Movies"తొక్కలో సలహా ఇచ్చావ్"..స్టేజీ పై సత్య దేవ్ సెన్సేషనల్ కామెంట్స్..!!

“తొక్కలో సలహా ఇచ్చావ్”..స్టేజీ పై సత్య దేవ్ సెన్సేషనల్ కామెంట్స్..!!

ప్రజెంట్ సినీ ఇండస్ట్రీలో ఎలాంటి వాతావరణం నెలకొందో అందరికీ తెలిసిందే. దసరా కానుకగా రిలీజ్ అయిన మూడు సినిమాలు మంచి పాజిటివ్ టాక్ దక్కించుకోవడంతో ఈ దసరా ధూమ్ ధామ్ గా సెలబ్రేట్ చేసుకున్నారు సినీ లవర్స్. మెగాస్టార్ చిరంజీవి నటించిన గాడ్ ఫాదర్, నాగార్జున నటించిన ఘోస్ట్ ,బెల్లంకొండ గణేష్ నటించిన స్వాతి ముత్యం ..మూడు సినిమాలో అక్టోబర్ 5న దసరా కానుకగా థియేటర్స్ లో రిలీజ్ అయ్యి మూడు సినిమాలు మంచి పాజిటివ్ టాక్ ను దక్కించుకున్నాయి. వీటిల్లో అన్నిటికన్నా ఎక్కువగా ప్రేక్షక ఆదరణ పొందిన సినిమా గాడ్ ఫాదర్ .మెగాస్టార్ చిరంజీవిని సరికొత్త రోల్ లో చూపిస్తూ మోహన్ రాజా సాహసం చేశారనే చెప్పాలి.

చిరంజీవి ప్రధాన పాత్రలో డైరెక్టర్ మోహన్ రాజా ఈ సినిమాను తెరకెక్కించారు. ఈ సినిమాలో హీరోయిన్ లేదు. కర్త కర్మ క్రియ అన్ని చిరంజీవినే. ఈ సినిమా హిట్ అవ్వడానికి ఇది ప్రధాన కారణం అనే చెప్పాలి . ఈ సినిమాలో నయనతార సత్యదేవ్ తమదైన స్టైల్ లో నటించి అభిమానులను మెప్పించారు. కాగా ఈ సినిమా హ్యూజ్ బ్లాక్ బస్టర్ హీట్ అవడంతో గాడ్ ఫాదర్ సక్సెస్ మీట్ నిన్న ఘనంగా జరిగింది.
శనివారం జరిగిన గాడ్ ఫాదర్ సక్సెస్ సెలబ్రేషన్స్ లో అందరూ తమదైన స్టైల్ లో ప్రసంగాలు చేసే ఆకట్టుకున్నారు . కానీ అందరికన్నా హైలెట్గా నిలిచింది ఈ చిత్రంలో ప్రతి నాయకుడు రోల్ లో నటించిన సత్యదేవ్ స్పీచ్ ప్రతి ఒక్కరిని ఆకట్టుకుంది . అంతేకాదు ఇలాంటి స్టైలిష్ విలన్ నే ఇండస్ట్రీ కావాలి అంటూ జనాలు సత్యదేవ్ ని ఓ రేంజ్ లో పొగడేస్తున్నారు.

కాగా ఈ సినిమా సక్సెస్ సెలబ్రేషన్స్ లో భాగంగా సత్యదేవ్ మాట్లాడుతూ షూటింగ్లో జరిగిన ఇంట్రెస్టింగ్ విషయాలను బయట పెట్టాడు. ఆయన మాట్లాడుతూ..” ఈ సినిమా ఇంత పెద్ద హిట్ అయినందుకు చాలా హ్యాపీగా ఉంది.. హిట్ అవుద్ది అని ముందుగానే గెస్ చేశా. ఈ సినిమా హిట్ అయిన ప్రభావమో ఏమో నేను వింత వింతగా ప్రవర్తిస్తున్నాను. నేను ఒక నటుడిని కానీ మెగాస్టార్ చిరంజీవి గారి లాంటి హీరోతో నటించినప్పుడే నా నటనకు వాల్యూ ఉంది . ఈ సినిమా షూటింగ్లో పూరి జగన్నాథ్ గారు నటిస్తున్నప్పుడు ముందు రోజు నాకు ఫోన్ చేశారు .

చిరంజీవి గారితో నువ్వు ఎలా నటించావు ..కొన్ని టిప్స్ చెప్పు. రేపు నాకు ఆయనతో షూటింగ్ ఉంది ..నువ్వు ఆల్రెడీ ఆయనతో నటించావు కదా..” అంటూ అడిగారు. ఇదే సమయంలో నేను ఆయన కళ్ళల్లో చూడకుండా నటించేసేయ్ ఈజీగా అయిపోతుంది.. టెన్షన్ ఉండదు అంటూ చెప్పాను . అయితే సినిమా షూటింగ్ అయిపోయిన తర్వాత పూరి జగన్నాథ్ కాల్ చేసి “తొక్కలో సలహా ఇచ్చావ్.. ఏమి వర్కౌట్ కాలేదు ..నీకు సైట్ ఉంది నాకు లేదు అని అన్నయ్య అన్నారు అంటూ పూరి చెప్పారు..అని చెప్పుకొచ్చారు. ఈ సరదా సంభాషణతో ఒక్కసారిగా అక్కడ నవ్వులు పూసాయి.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news