Moviesఅయ్య బాబోయ్ .. బిగ్ బాస్ బ్యూటి అరియానా నెలకి అంత...

అయ్య బాబోయ్ .. బిగ్ బాస్ బ్యూటి అరియానా నెలకి అంత సంపాదిస్తుందా.. ?

తెలుగులోనే అతిపెద్ద రియాలిటీ షోగా స్టార్ట్ అయిన బిగ్ బాస్ గురించి ప్రత్యేకించి చెప్పనవసరం లేదు. బిగ్బాస్ షో ని తిట్టుకునే జనాలు ఎంతమంది ఉన్నారో.. ఆ టైం అయితే టీవీకి ఎగబడి చూసే జనాలు అంతకన్నా ఎక్కువే ఉన్నారు . మరి ముఖ్యంగా మనకి తెలియని పాపులర్ కాని వ్యక్తులను కూడా బిగ్ బాస్ మనకి తెలిసేలా పాపులర్ అయ్యేలా చేసింది. వాళ్ళలో మరీ ముఖ్యంగా మనం చెప్పుకోవాల్సింది అరియానా.

ఒకప్పుడు హోస్టుగా చేసిన రాని గుర్తింపు బిగ్ బాస్ లోకి ఎంటర్ అయిన తరువాత తన గేమ్ తో ఆడి పాడి అలరించి.. తర్వాత జనాలకు మరింత దగ్గర అయింది. ఈ క్రమంలోనే పిచ్చ క్రేజీ ఫ్యాన్ ఫాలోయింగ్ తో సోషల్ మీడియాలో దూసుకుపోతుంది అరియానా గ్లోరీ. కాగా ఎప్పటికప్పుడు సోషల్ మీడియాలో హాట్ ట్రెండీ ఫోటోషూట్స్ చేస్తూ అభిమానులకు పిచ్చెక్కించే అరియానా.. నెలకి ఎంత సంపాదిస్తుందో తెలిస్తే ఎవరైనా షాక్ అయిపోవాల్సిందే. ఒకప్పటి అరియానా సంపాదనకి.. ఇప్పటి అర్యాన సంపాదనకు పోలికే ఉండదు .

ఎస్ ఇదే న్యూస్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. బిగ్బాస్ తర్వాత తనదైన స్టైల్ లో దూసుకుపోతున్న అరియానా పలు ఈవెంట్స్ తో పాటు క్రేజీ షోలకి హోస్ట్ గా చేస్తూ పలు వెబ్ సిరీస్లో నటించడానికి ట్రై చేస్తుంది. ఈ క్రమంలోనే బి బి కేఫ్ కోసం అరియానా భారీ రేంజ్ లో పారితోషకం తీసుకుంటుందని తెలుస్తుంది . అందుతున్న సమాచారం ప్రకారం రోజుకి 60 వేల నుంచి లక్ష రూపాయలు దాకా అమ్మడు రెమ్యూనరేషన్ గా అందుకుంటుందట. ఈ లెక్కన చూస్తే హౌస్ లో ఉన్న వారి కన్నా బి బి కేఫ్ ద్వారా అరియానా అందుకుంటున్న రెమ్యూనరేషన్ ఎక్కువ అంటున్నారు. అంతేకాదు పలు యాడ్స్ ప్రమోట్ చేయడం ద్వారా ..ఇన్స్టా ఫాలోవర్స్ ద్వారా మిగతా ఆదాయాల ద్వారా అరియానా టోటల్గా నెలకు లక్ష 30 వేలు సంపాదిస్తుందని ఓ న్యూస్ వైరల్ గా మారింది. ఈ లెక్కను చూసుకుంటే అరియానా మొదటి సంపాదన కంటే ఎక్కువే.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news