Moviesబిగ్ బాస్ చరిత్రలోనే చెత్త పని..కళ్లు మూసుకుని ఉన్నావా నాగార్జున..!?

బిగ్ బాస్ చరిత్రలోనే చెత్త పని..కళ్లు మూసుకుని ఉన్నావా నాగార్జున..!?

బిగ్ బాస్ 6 ప్రస్తుతం చెత్త టీఆర్పి రేటింగ్ తో ముందుకు కొనసాగుతుంది . కనీ విని ఎరుగని రీతిలో.. ఏ భాషలోనూ ..ఏ సీజన్లోను దక్కించుకోనంత పరమ చెత్త టీఆర్పి రేటింగ్ బిగ్బాస్ సీజన్ 6 సంపాదించుకుంటుంది . మనకు తెలిసిందే తెలుగులోనే అతిపెద్ద రియాలిటీ షో గా స్టార్ట్ అయిన బిగ్బాస్ ప్రజెంట్ సీజన్ 6 రన్ అవుతుంది . ఈ క్రమంలోని సీజన్ సిక్స్ బ్లాక్ బస్టర్ చేయాలని నాగర్జున బిగ్బాస్ టీం ఎంతగానో ప్రయత్నిస్తున్నారు .

అయినప్పటికీ లోపల ఉండే కంటెస్టెంట్స్ పెద్దగా చెప్పుకో తగ్గిన పాపులారిటీ కాకపోవడం.. ఉన్న నలుగురు కూడా పెద్దగా పెర్ఫార్మన్స్ ఇవ్వకపోవడంతో బిగ్ బాస్ సీజన్ 6 డిజాస్టర్ గా మిగిలిపోయింది. ఈ క్రమంలోని ఈ వారం హౌస్ నుంచి అర్జున్ ఎలిమినేట్ అయ్యాడు . దీంతో ఒక్కసారిగా జనాలు షాక్ అయిపోయారు. ఎందుకంటే అర్జున్ కన్నా పరమ చెత్తగా ఆడే కంటెస్టెంట్లు.. ఫ్యాన్ ఫాలోయింగ్ లేని హౌస్మెట్స్ లోపల చాలామంది ఉన్నారు . సోషల్ మీడియా ఓటింగ్స్ చూసుకుంటే అర్జున్ సేఫ్ జోన్ లోనే ఉన్నాడు.

కానీ బిగ్ బాస్ టీం ఆయన ప్రవర్తన నచ్చక ఆయన తీరు నచ్చకనే ఇలా మధ్యలోనే ఎలిమినేట్ చేసిందన్న మాటలు సోషల్ మీడియాలో ఎక్కువగా వినిపిస్తున్నాయి . అంతేకాదు అర్జున్, శ్రీ సత్య తో ఎక్కువగా పులిహోర కలపడం కూడా మైనస్ అయ్యింది. అది శ్రీ సత్య ఇన్ కన్వీనెంట్ గా ఉండడం బిగ్ బాస్ చూడలేకపోయాడని టాక్ వినిపిస్తుంది. ఆ కారణంగానే కొందరు హౌస్ మేట్స్ అర్జున్ ను నెగటివ్ చేసే విధంగా మాట్లాడిన వీడియోలను టెలికాస్ట్ చేశారని బిగ్ బాస్..అర్జున్ ఫ్యాన్స్ ఫైర్ అవుతున్నారు. కాగా ఇవన్నీ పక్కన పెడితే ..ఎప్పుడూ న్యాయం-ధర్మం-నిజాయితీ అనే అక్కినేని నాగార్జున ఈసారి బిగ్ బాస్ ఎపిసోడ్లో మాత్రం అవన్నీ వదిలేసాడని ..బిగ్ బాస్ చెప్పిన పని కళ్ళు మూసుకొని చేసేస్తున్నాడని మండిపడుతున్నారు జనాలు. ఏది ఏమైనా సరే అర్జున్ ఎలిమినేట్ అవ్వడం బిగ్ బాస్ టి ఆర్ పి రేటింగ్ కి మరింత నష్టం చేకూర్చేలా ఉంది.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news