Moviesఉదయ్‌ కిరణ్‌ అలాంటివాడే..షూటింగ్ లో అందరితో అలా ఉంటాడు..పింకీ షాకింగ్ కామెంట్స్..!!

ఉదయ్‌ కిరణ్‌ అలాంటివాడే..షూటింగ్ లో అందరితో అలా ఉంటాడు..పింకీ షాకింగ్ కామెంట్స్..!!

టాలీవుడ్ యంగ్ హీరో ఉదయ్ కిరణ్ గురించి ఎంత చెప్పినా తక్కువే. ” చిత్రం ” అనే సినిమా ద్వారా సినీ ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన ఉదయ్ కిరణ్ మొదటి సినిమాతోనే బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్నాడు . అంతేకాదు ఆ తర్వాత సినిమాలతో సినీ ఇండస్ట్రీను ఏలేసాడు ఒకానొక టైం లో బిగ్ స్టార్స్ కూడా ఉదయ్ కిరణ్ నటించిన సినిమాల ముందు సినిమాను రిలీజ్ చేయాలంటే భయపడేవారు. అంతలా తనలోని టాలెంట్ను బయటపెట్టి ఫ్యాన్ ఫాలోయింగ్ సంపాదించుకున్నాడు ఈ లవర్ బాయ్.

అయితే కొన్ని అనుకోని కారణాలవల్ల ఉదయ్ కిరణ్ జీవితం మధ్యలోనే ఆగిపోయింది . ఈ క్రమంలోనే ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ తో ఇండస్ట్రీలో అవకాశాలు రాక ఆ ప్రెజర్ ని తట్టుకోలేక సూసైడ్ చేసుకొని మరణించాడు. అయితే ఉదయ్ కిరణ్ చనిపోయిన తర్వాత ఆయన గురించి సంబంధించిన ఒక్కొక్క విషయం బయటపడుతూ వస్తుంది . ఈ క్రమంలోనే ఆయనతో చెల్లిగా నటించినా సుదీప రీసెంట్ ఇంటర్వ్యూలో ఆయన గురించి కొన్ని ఎవరికి తెలియని విషయాలను బయటపెట్టింది.

నిజానికి ఉదయ్ కిరణ్ డైరెక్టర్ నిర్మాతలు మోసం చేస్తారనే న్యూస్ ఎప్పటినుంచో ఇండస్ట్రీలో వైరల్ గా మారింది. ఇప్పుడు సుదీప ఆ వార్తలను నిజం చేసింది. “ఇండస్ట్రీలో స్టార్ హీరో అన్నాక సరదాగా ఆట పట్టిస్తూ ఉంటాడు . కానీ ఉదయ్ కిరణ్ అలా కాదు చాలా సైలెంట్ గా ఉంటాడు.సెట్లో ఎవరికైనా బర్త డే పార్టీ అయినా కూడా దగ్గరికి రాడు. దూరంగానే ఉంటాడు. అసలు ఒక హీరోలా బిహేవ్ చేయడు ఎవరైనా బాధపడుతుంటే మాత్రం వెంటనే దగ్గరకు వచ్చేసి పలకరిస్తాడు.. అది ఎలాంటి వారైనా సరే. నేను కూడా ఒక్కటే కూర్చుని ఉన్నప్పుడు నా దగ్గరకు వచ్చి చాలాసార్లు పలకరించారు. నాకు నిజంగా అన్నయ్య అనే ఫీలింగ్ ఆయన చూస్తే కలిగింది.

చాలా మంచి మనస్తత్వం ఒకానొక టైంలో ఏడు ప్రాజెక్టులు సైన్ చేసాడు . కానీ ఆ ఏడు ప్రాజెక్టులు ఆగిపోయి. దానికి కారణం ఆయన మంచితనమే. సైన్ చేసిన ప్రాజెక్ట్స్ ని డబ్బులు ఇవ్వకుండా క్యాన్సిల్ చేసారు. ఆగిపోయిన కానీ ఉదయ్ ఏం అనలేదు”..అంటూ చెప్పుకొచ్చింది. ఉదయ్ కిరణ్ మంచితనంతోనే అతని జీవితం నాశనం చేసుకున్నాడు అన్న కామెంట్స్ ఇప్పుడు వైరల్ గా మారాయి. ఏది ఏమైనా సరే ఇండస్ట్రీ ఓ మంచి గొప్ప నటూడిని కోల్పోయింది అన్నది మాత్రం వాస్తవం.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news