Moviesవాణిశ్రీతో ఆరాధాన చేసిన ఎన్టీఆర్ ఆ మాట‌తో అంత హ‌ర్ట్ అయ్యారా...!

వాణిశ్రీతో ఆరాధాన చేసిన ఎన్టీఆర్ ఆ మాట‌తో అంత హ‌ర్ట్ అయ్యారా…!

ఎన్టీఆర్‌-వాణిశ్రీ జంట‌గా వ‌చ్చిన అనేక సినిమాలు సూప‌ర్ డూప‌ర్ హిట్లు సాధించాయి. ఇలాంటి వాటిలో అశేష తెలుగు ప్రేక్ష‌కుల‌నే కాకుండా.. అప్ప‌టి న‌వ‌త‌రం ప్రేమికుల‌ను ఎక్కువ‌గా ఆక‌ర్షించిన సినిమా.. ఆరాధ‌న‌. ఇది హిందీలో వ‌చ్చిన ఆరాధ‌న సినిమానే నేరుగా తెలుగులో చిత్రీక‌రించారు. ఈ సినిమాలో భ‌గ్న ప్రేమికుడిగా.. అన్న‌గారు న‌టించారు. తొలిసారి ఈ సినిమాలోని పాట‌ల‌న్నింటినీ కూడా.. బాలీవుడ్ లో అప్ప‌టి..స్టార్ గాయ‌కుడు మ‌హ‌మ్మ‌ద్ ర‌ఫీతో పాడించారు.

ప్ర‌తిపాటా కూడా సూప‌ర్ హిట్ట‌యింది. అనేక సంవ‌త్స‌రాలు గ‌డిచిన త‌ర్వాత కూడా ఈ సినిమాలో పాట లు ఇప్ప‌టికీ వినిపిస్తూనే ఉన్నాయి. అంతా బాగానే ఉంది. సినిమా కూడా వంద రోజులుచేసుకుంది. అయితే.. ఈ చిత్రంలో అన్న‌గారు ప్ర‌యోగాలు చేశారు. తొలిసారి హిందీ గాయ‌కుడిని తీసుకువ‌చ్చారు. అదే స‌మయంలో త‌న‌క‌న్నా ఎత్తున్న‌వాణిశ్రీతో క‌లిసి స్టెప్పులు కూడా వేశారు. ఇంత జ‌రిగి.. సినిమా హిట్ట‌యినా.. కూడా అన్న‌గారు అసంతృప్తితోనే ఉన్నారు.

కార‌ణం.. హీరోగా త‌న‌క‌న్నా.. వాణిశ్రీకి ఎక్కువ‌గా పేరు రావ‌డ‌మే కాకుండా.. సినిమాలో క‌థ‌క‌న్నా పాట‌ల‌కు ఎక్కువ‌గా ఆద‌ర‌ణ ల‌భించ‌డం. దీంతో క్రెడిట్ అంతా కూడా ర‌ఫీ, వాణిశ్రీలు ఎగ‌రేసుకుపోయార‌నేది అన్న‌గారి అభిమానుల వాద‌న‌. ఇదే విష‌యం అన్న‌గారిని కూడా ఒకింత బాధించింది. అప్ప‌టి వ‌ర‌కు హీరో ఓరియెంటెడ్ మూవీల‌తోనే ఫేమ్ అయిన అన్న‌గారు.. ఆ సినిమాతో త‌న‌కు కాకుండా హీరోయిన్‌కు మంచి పేరు రావ‌డం…ఆ విష‌యం హైలెట్ అవ్వ‌డంతో ఆయ‌న కాస్త ఫీల్ అయ్యేవార‌ని అంటారు.

ఈ విష‌యాలను త‌ర‌చుగా త‌లుచుకుని అన్న‌గారు.. సినిమా హిట్టే సోద‌రా..కానీ, ఏం లాభం? అని ప్ర‌శ్నిం చేవార‌ట‌. ఈ క్ర‌మంలోనే త‌ర్వాత వేట‌గాడు సినిమాను తీసి సూప‌ర్ హిట్ కొట్టారు. ఇలా.. ఆరాధ‌న ప్రేమికుల‌కు ఒక ర‌కంగా పండ‌గ చేస్తే.. అన్న‌గారికి మ‌రోర‌కంగా.. మ‌న‌సు చివుక్కుమ‌నేలా చేసింద‌ని ఇండ‌స్ట్రీలో టాక్‌. మ‌రి సినిమా రంగం అన్నాక అనేక ప్ర‌యోగాలు ఉంటాయి క‌దా!! అని స‌రిపెట్టుకున్నార‌ట‌.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news