Moviesఎట్టేట్టా..ఈ హీరోని చూసి ..మన హీరోలు సిగ్గు తెచ్చుకోవాలా..ఏం పీకాడట..!?

ఎట్టేట్టా..ఈ హీరోని చూసి ..మన హీరోలు సిగ్గు తెచ్చుకోవాలా..ఏం పీకాడట..!?

ఎట్టేట్టా,, మన తెలుగు హీరోలు ఆ బాలీవుడ్ హీరోని చూసి సిగ్గు తెచ్చుకోవాలా ..? ఏమయ్యా కొంచెం అయినా బుద్ధి అనేది ఉందా..? ట్రోల్ చేసే వాళ్ళు ఆ మాత్రం చూసుకోఅక్కర్లేదా..? ఏం మాట్లాడుతున్నారు. మన హీరోలు ఎక్కడ ..హీరో ఎక్కడ? మన హీరోల స్టైల్ ఎక్కడ..ఆ హీరో కున్న స్టైల్ ఎక్కడ? మన హీరో లకి అసలు ఆ పోలిక పోల్చడం కూడా వేస్ట్ అంటూ టాలీవుడ్ హీరోల పై ట్రోల్ చేస్తున్న వారిపై విరుచుకుపడుతున్నారు అభిమానులు.

మనకు తెలిసిందే.. బాలీవుడ్ స్టార్ హీరో రణబీర్ కపూర్ తన భార్య ఆలియా భట్ తో కలిసి పెళ్లి తర్వాత చేస్తున్న మొదటి సినిమా బ్రహ్మాస్త్ర . తెలుగులో బ్రహ్మాస్త్రం అనే పేరుతో రిలీజ్ అవుతున్న ఈ సినిమా సెప్టెంబర్ 9న పాన్ ఇండియా రేంజ్ లో రిలీజ్ కి సిద్ధంగా ఉంది. ఈ సినిమా ప్రమోషన్స్ లో భాగంగా రీసెంట్ గా హైదరాబాద్లో జరిగిన ఓ ఈవెంట్లో రణబీర్ కపూర్ తెలుగులో మాట్లాడాడు. వామ్మో ఆ తెలుగు మాటలు విన్నాక జనాలకి ఓ ఊపు వచ్చేసింది. ప్రపంచంలో ఎవ్వరు తెలుగు మాట్లాడినట్టు ..రణబీర్ కపూర్ ఒక్కడే తెలుగులో మాట్లాడినట్టు కొందరు మన తెలుగు హీరోలను ట్రోల్ చేస్తున్నారు.

అఫ్కోర్స్ రణబీర్ర్ కపూర్ తెలుగులో మాట్లాడడం గొప్ప విషయమే. మన తెలుగు భాషను గౌరవించడం గుడ్ అనే చెప్పాలి. కానీ రణబీర్ కపూర్ తెలుగు హీరోలను మించిపోయేలా మాట్లాడాడు అంటే కోపం వస్తుంది. ఎందుకంటే ఇండస్ట్రీలో హీరోయిన్స్ తెలుగు వచ్చినా కానీ ఇంగ్లీషులో మాట్లాడుతున్నారు.. కానీ మన తెలుగు హీరోలు మాత్రం ఎక్కడికి వెళ్లినా తెలుగులోనే మాట్లాడుతారు. అది అందరికీ తెలిసిన నిజం. రామ్ చరణ్, పవన్ కళ్యాణ్ ,చిరంజీవి ,ఎన్టీఆర్ అందరూ కూడా తెలుగులోనే మాట్లాడుతారు.

అంతెందుకు ఆర్ఆర్ఆర్ సినిమా ప్రమోషన్స్ కోసం బాలీవుడ్ వెళ్ళిన తారక్ తెలుగులోనే మాట్లాడి బాలీవుడ్ జనాలను మెప్పించాడు. రామ్ చరణ్ కూడా అలానే చేశాడు . మరి వాళ్ళు గుర్తు రాలేదా ఈ ట్రోల్లర్స్ కి . ఒకప్పుడు మన హీరోలను చూసి నవ్వుకున్న బాలీవుడ్ జనాలే ఇప్పుడు మన హీరోల స్టామినా చూసి వావ్ అంటున్నారు . మన హీరోల సినిమాలు బాలీవుడ్ లో కోట్లు కొల్లకొడుతున్నాయి మరి అప్పుడు బాలీవుడ్ హీరోలు ఏం పీకారట..? అంటూ కొంతమంది నెటిజన్స్ కామెంట్స్ చేయడంతో ఇప్పుడు ఈ ఇష్యూ సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారింది.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news