Moviesవ‌రుణ్ సందేశ్ - వితిక మ‌ధ్య ఏజ్ గ్యాప్ ఎంతో తెలుసా......

వ‌రుణ్ సందేశ్ – వితిక మ‌ధ్య ఏజ్ గ్యాప్ ఎంతో తెలుసా… వీరి ప్రేమ పెళ్లిలో ట్విస్ట్ ఇదే..!`

టాలీవుడ్ ఇండస్ట్రీలో క్యూట్ కపుల్స్ లో హీరో వరుణ్ సందేశ్- వితిక షేరు జోడి ఒకటి. వరుణ్ సందేశ్ కు `కొత్త బంగారులోకం` సినిమా తర్వాత యూత్ లో పిచ్చ క్రేజ్ వచ్చింది. ఆ తర్వాత వరుస ప్లాపులతో రేసులో వెనకబడిపోయాడు. తనతో పాటు కలిసిన హీరోయిన్ వితిక షేరును ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు. తర్వాత ఈ క్యూట్ కపుల్ బిగ్ బాస్ షోలోకి ఎంటర్ కావడంతో వీరి క్రేజ్ మరింత పెరిగిపోయింది.

బిగ్ బాస్ సీజన్ 3 లో వరుణ్ సందేశ్ – వితిక రొమాంటిక్ కపుల్ అయ్యారు. ఈ షో వరుణ్ సందేశ్ కెరీర్ కు బాగా ప్లస్ అయిందని చెప్పాలి. ఇక వరుణ్ సందేశ్ సక్సెస్‌లోనూ, ఫెయిల్యూర్ లోను వితికా అండగా ఉండడంతో ఆమెను ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు. వరుణ్ సందేశ్ – వితిక మధ్య ఏజ్ గ్యాప్ ఆరు సంవత్సరాలు. వరుణ్ తన కెరీర్లో కచ్చితంగా హిట్టు కొడతాడు అనుకున్న కొన్ని సినిమాలు ప్లాప్ కావడంతో బాగా డిసప్పాయింట్ అయిపోయాడు.

ఆ తర్వాత యూఎస్ వెళ్లి అక్కడ ఉద్యోగం చేసుకోవాలని కూడా అనుకున్నాడట. అదే సమయంలో వితికాతో ఏర్పడిన పరిచయం అతడి కెరీర్ ని మలుపు తిప్పిందని చెప్పాడు. ఇక వితికా ఇంటీరియర్ డిజైనర్ కూడా.ఇక వారిద్దరూ కలిసి `పడ్డానండి ప్రేమలో మరి` సినిమాలో నటించారు. ఆ సినిమా టైటిల్ కు అనుగుణంగానే వీరు నిజంగానే ప్రేమలో పడ్డారు.

వితికది ఏపీలోని పశ్చిమగోదావరి జిల్లా భీమవరం. వాళ్లది హైదరాబాదులో సెటిల్ అయిన కుటుంబం. వితికా వాళ్ళది మామూలు మధ్యతరగతి కుటుంబం. అయితే ఆమెకు బాగా హెల్పింగ్ నేచర్ ఎక్కువ కావడంతో అదే వరుణ్ సందేశ్ ఆకర్షించింది. అయినా కూడా వితికా మనస్తత్వం న‌చ్చి వరుణ్ తల్లిదండ్రులు వీరి పెళ్లికి అంగీకరించారట.. ఈ విషయాన్ని వరుణ్ సందేశ్ ఓ సందర్భంలో చెప్పాడు.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news