Moviesఅవ‌కాశాల కోసం పిలిచారు.... కాస్టింగ్ కౌచ్‌పై అన‌సూయ బిగ్ బాంబ్‌...!

అవ‌కాశాల కోసం పిలిచారు…. కాస్టింగ్ కౌచ్‌పై అన‌సూయ బిగ్ బాంబ్‌…!

యాంకర్స్ అంటే అప్పటి వరకూ సాదా సీదాగానే ఉండేవాళ్ళు. మోడ్రన్ గా కనిపించినా అందాల ప్రదర్శన తక్కువే ఉండేది. కానీ బుల్లి తెరకు హాట్ నెస్ పరిచయం చేసి యాంకర్స్ అంటే హీరోయిన్స్ కు మించి అనసూయ అనే చెప్పాలి. మొదట టీవీ 9 లో యాంకర్ గా పనిచేసిన అనసూయ ఆ తరవాత జబర్థస్త్ లో ఛాన్స్ అందుకుంది. అస‌లు ఆమెకు న్యూస్ ప్ర‌జెంట‌ర్‌గా ఛాన్స్ రావ‌డానికే చాలా క‌ష్టాలు ప‌డింది. ఎప్పుడు అయితే జ‌బ‌ర్ద‌స్త్‌లోకి ఎంట్రీ ఇచ్చింది అస‌లు తెలుగు యాంక‌రింగ్ అన్న ప‌దానికే ఆమె స‌రికొత్త నిర్వ‌చ‌నం చెప్పేసింది.

ఈ కామెడీ షోలో పొట్టి బట్టలతో కుర్రాళ్ళ మతి పోగొట్టింది. ఆ షో లో వచ్చ్చే కామెడీ తో పాటు అనసూయ అందాలను ఎంజాయ్ చేయడం కూడా ప్రేక్షకులకు అలవాటు అయిపోయింది. అంతే కాకుండా స్కిట్ మధ్యలో డబుల్ మీనింగ్ పంచ్ లు వేస్తూ ఆకట్టుకుంది. దాంతో అనసూయ క్రేజ్ యూత్ లో పీక్స్ లోకి వెళ్ళిపోయింది. ఇక ఆ తర్వాత జబర్దస్త్ తో పాటు మరిన్ని టివి షోలలో సందడి చేసింది. అంతే కాకుండా క్షణం సినిమాతో నటిగా ఎంట్రీ ఇచ్చి అదరగొట్టింది. రంగస్థలం సినిమా లో రంగమ్మ‌త్త పాత్రలో నటించి మెప్పించింది.

రీసెంట్ గా పుష్ప తో కూడా మరో హిట్ అందుకుంది. ప్రస్తుతం సినిమాల్లో బిజీగా ఉండటంతో జబరస్త్ కు సైతం గుడ్ బై చెప్పింది. ఇదిలా ఉండగా ఓ ఇంటర్వ్యూ లో కాస్టింగ్ కౌచ్ పై సంచలన వ్యాఖ్యలు చేసింది. ఎవరైనా రోల్ ఆఫ‌ర్ చేసి అడగకూడనిది అడిగితే.. ఆ పాత్ర వదులుకోడమే అని చెప్పింది. ఆ పాత్ర పోతే దానికి అమ్మ లాంటి పాత్ర వస్తుంది అని ధైర్యంగా ఉండాలని చెప్పింది.

అవకాశాల కోసం పిలిస్తే తాను వెళ్ళలేదు అని చెప్పింది. అంతే కాకుండా ధైర్యం లేని అమ్మాయిలే కాస్టింగ్ కౌచ్ కు బలి అవుతున్నారు అంటూ సంచలన నిజాలు బయటపెట్టింది. ఇక అనసూయ గతంలో ఈ కామెంట్స్ చేయగా ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతున్నాయి.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news