Moviesబాల‌య్య‌తో అన‌సూయ ఆంటీ... రంగ‌మ్మ‌త్తకు క్రేజీ ఆఫ‌ర్‌...!

బాల‌య్య‌తో అన‌సూయ ఆంటీ… రంగ‌మ్మ‌త్తకు క్రేజీ ఆఫ‌ర్‌…!

నటసింహం నందమూరి బాలకృష్ణ యాక్షన్ సినిమాల‌ దర్శకుడు మలినేనిను గోపీచంద్ కాంబినేషన్లో తెరకెక్కుతున్న సినిమా షూటింగ్ శ‌ర‌వేగంగా జరుగుతోంది. అఖండ లాంటి బ్లాక్ బస్టర్ హిట్ సినిమా తర్వాత బాలయ్య నటిస్తున్న సినిమా కావడంతో భారీ అంచనాలు ఉన్నాయి. అలాగే క్రాక్ సినిమాతో ఫామ్ లోకి వచ్చిన గోపీచంద్ ఇప్పుడు ఏకంగా బాలయ్యను డైరెక్ట్ చేస్తుండడంతో సినిమా హిట్ అవుతుందని ప్రతి ఒక్కరు చర్చించుకుంటున్నారు. బాలయ్యకు జోడిగా శృతిహాసన్ నటిస్తుండగా వరలక్ష్మీ శరత్ కుమార్ – కన్నడ నటుడు దునియా విజయ్ లాంటి కీలక నటీనటులు అందరూ ఈ సినిమాలో నటిస్తున్నారు. ఇక థ‌మన్‌ స్వరాలు అందిస్తున్నారు. మైత్రి మూవీ మేకర్స్ భారీ బడ్జెట్తో ఈ సినిమాను నిర్మిస్తోంది.

NBK 107 అనే వర్కింగ్ టైటిల్ తో రూపొందుతున్న ఈ సినిమాను వచ్చే డిసెంబర్ లేదా సంక్రాంతికి రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు. ఇప్పటికే రామోజీ ఫిలిం సిటీ – హైదరాబాద్ – కర్నూల్ లో కీలక సన్నివేశాలు షూట్ చేశారు. ఇటీవల ఈ సినిమా యూనిట్ టర్కీ వెళ్లి అక్కడ ఒక రొమాంటిక్ సాంగ్ తో పాటు పలు కీలక సన్నివేశాలు షూట్ చేసుకుని తిరిగి హైదరాబాద్‌కు వచ్చింది. కచ్చితంగా డిసెంబర్ లేదా సంక్రాంతి కానుకగా జనవరిలో అయితే సినిమా రిలీజ్ చేసేలా మేకర్స్‌ ప్లాన్ చేస్తున్నారు.

బాలయ్య పవర్ఫుల్ రోల్‌ లో కనిపిస్తాడు అన్న వార్తలు ఫ్యాన్స్ కు ముందే పూనకాలు తెప్పిస్తున్నాయి. ఈ సినిమాలో బాలయ్య తండ్రి, కొడుకులుగా డ్యూయల్ రోల్ లో నటిస్తున్నాడు. ఇదిలా ఉంటే ఈ సినిమా త‌ర్వాత బాల‌య్య అనిల్ రావిపూడి డైరెక్ష‌న్‌లో న‌టిస్తోన్న సినిమా గురించి అదిరిపోయే అప్డేట్ ఒకటి బయటకు వచ్చింది. ఈ సినిమాలో బాలయ్య వయసు మళ్ళిన వ్యక్తిగా పవర్ ఫుల్‌ పాత్రలో నటిస్తుండగా.. కుర్ర హీరోయిన్ శ్రీలల బాలయ్య కూతురుగా నటిస్తోంది.

షైన్ మూవీ క్రియేషన్స్ బ్యానర్ పై సాహూ గారపాటి – హరీష్ పెద్ది ఈ సినిమాను నిర్మిస్తున్నారు. ఈ సినిమాలో స్పెష‌ల్ సాంగ్ కోసం అనసూయ ఆంటీ రంగమ్మత్తను అడుగుతున్నారట. ప్రస్తుతం దర్శకుడు అనిల్ రావుపూడి అన‌సూయ‌తో చర్చలు జరుపుతున్నారని.. అనసూయ గ్రీన్స్ సిగ్నల్ ఇవ్వటమే తర్వాత అని కూడా అంటున్నారు. ఏదేమైనా బాలయ్యతో స్పెషల్ సాంగ్‌లో నటించేందుకు అనసూయ ఓకే చెబితే మనం అదిరిపోయే ఐటెం నెంబర్ చూడటం ఖాయం. బాలయ్యకు జోడిగా రంగమ్మత్త తెరపై స్టెప్పులు వేస్తే అంతకంటే కావాల్సింది ఇక ర‌చ్చ రంబోలాయే..!

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news