Moviesఆ హీరోని ప్రాణంగా ప్రేమించిన నివేదా ధామస్..ఆ ఒక్క మాట తో...

ఆ హీరోని ప్రాణంగా ప్రేమించిన నివేదా ధామస్..ఆ ఒక్క మాట తో పెళ్లి క్యాన్సిల్..!?

నివేదా థామస్..అమ్మడు పేరు గురించి ప్రత్యేకంగా చెప్పాలా చెప్పండి.. నాచురల్ యాక్టింగ్ తో సూపర్ హిట్ హీరోయిన్ గా పేరు సంపాదించుకున్న యంగ్ బ్యూటి. అమ్మడు ఎక్కువగా మలయాళం, తమిళ, తెలుగు సినిమాల్లో నటించి మెప్పించింది. 2002లో మలయాళ చిత్రం ఉత్తరతో బాలనటిగా తెరంగేట్రం చేసిన నివేదా.,,ఆ తరువాత సన్ టీవీలో ప్రసారమయ్యే బాలల సీరియల్” మై డియర్ బూతంలో” కూడా నటించింది.

ఆ తరువాత మలయాళం సినిమా ‘వెరుథె ఒరు భార్య’ సినిమాలో జయరాం కుమార్తెగా నటించి..సినీ ఇండస్ట్రీకు పరిచయమైంది. ఈ చిత్రంలోని ఆమె నటనకు విమర్శకుల నుండి కూడా ప్రశంసలు లభించాయి. ఆ సినిమాలోని నటనకు కేరళ రాష్ట్ర ఉత్తమ యువ నటి పురస్కారం అందుకుంది. ఆ తరువాత నివేదా చాలా తమిళ, మలయాళ, చిత్రాల్లో సహాయ నటిగా నటించింది. చాప్పా కురిష్, తట్టతిన్ మరయతు వంటి విజయవంతమైన సినిమాల్లో నటించింది.

తెలుగులో ఆమె చేసిన మొదటి సినిమా జెంటిల్ మేన్ లో కూడా తన నటనతో ప్రశంసలు అందుకుంది నివేదా.జెంటిల్ మేన్ ఇంద్రగంటి మోహన కృష్ణ దర్శకత్వంలో నాని, నివేదా థామస్, సురభి లో నటించిన తెలుగు చలన చిత్రం. ఈ చిత్రం జూన్ 17 2016లో విడుదలై మంచి విజయాన్ని సాధించింది. ఈ సినిమా తర్వాత తెలుగులో ఆమె బోలెడన్ని సినిమాల్లో నటించింది. కొన్ని సినిమాలు హిట్ అయ్యాయి మరికొన్ని సినిమాలు ఫ్లాప్ అయ్యాయి. అయినా కానీ చేసిన ప్రతి సినిమాలో ఆమె నటనకు అందరూ ఫిదా అయ్యారు.

జెంటిల్మెన్ సినిమా తర్వాత నివేదా నిన్ను కోరి, జై లవకుశ ,జూలియట్ లవ్ ఆఫ్ ఇడియట్ ,118 ,బ్రోచేవారువరురా, దర్బార్, వి, వకీల్ సాబ్, సినిమాల్లో నటించింది. అయితే కెరియర్ స్టార్టింగ్ లో నివేదా ఓ మలయాళ యంగ్ హీరోని ప్రేమించిందని అతని పెళ్లి కూడా చేసుకోవాలనుకునిందని అక్కడ మీడియాలో వార్తలు వైరల్ అయ్యాయి . అప్పటికే జెంటిల్మెన్ సినిమాతో తెలుగులో కూడా పాపులర్ అయిన నివేదాగురించిన ఆ వార్త ఇక్కడ కూడా ఓ రేంజ్ లో వైరల్ గా మారింది. అయితే అతనిది వేరే క్యాస్ట్ కావడంతో ఈమెది వేరే క్యాస్ట్ కావడంతో ఇంట్లో వాళ్ళు ఒప్పుకోలేదు. అంతేకాదు నివేద ఇంట్లో వాళ్ళు..” నువ్వు కానీ అతని పెళ్లి చేసుకుంటే సూసైడ్ చేసుకుంటాము అని బెదిరించడంతో” నివేద ప్రేమ కన్నా పేరెంట్స్ ఏ ముఖ్యం అని అతనిని.. అతని ప్రేమని వదులుకునిందట. అయితే అతను మాత్రం వేరే పెళ్లి చేసుకుని హ్యాపీగా సెటిల్ అయ్యాడు అన్నట్టు తెలుస్తుంది . ప్రజెంట్ నివేదా టోటల్ ఫోకస్ సినిమాల పైన పెట్టింది.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news