Moviesనీకు సిగ్గుందా..? స్టార్ డాటర్ నోట ఊహించని మాట..ఫ్యాన్స్ హర్ట్..!

నీకు సిగ్గుందా..? స్టార్ డాటర్ నోట ఊహించని మాట..ఫ్యాన్స్ హర్ట్..!

మనం ఏదైనా ఒక మాట మాట్లాడేటప్పుడు ఆలోచించుకుని మాట్లాడాలి. ఓ విషయంలోకి ఎంటర్ అవుతున్నాం అంటే.. ఆచి తూచి అడుగులు వేయాలి. మరీ ముఖ్యంగా స్టార్ డాటర్స్.. స్టార్ సెలబ్రిటీస్.. స్టార్ సెలబ్రిటీ హోదాలో ఉన్న ముద్దుగుమ్మలు చాలా జాగ్రత్తగా మాట్లాడాలి . ఏమాత్రం తేడా వచ్చినా నెట్టింట ఆడేసుకుంటారు ట్రోలర్స్. ఇప్పుడు ప్రజెంట్ అలాంటి ఊహించని చిక్కుల్లో ఇరుక్కుంది స్టార్ డాటర్ వరలక్ష్మి శరత్ కుమార్. నిన్న మొన్నటి వరకు దేవతల చూసిన జనాల ఆమెను ఇప్పుడు దెయ్యంలా చూస్తున్నారు. ఇంతకీ అంత తప్పు మాట వరలక్ష్మి శరత్ కుమార్ ఏమన్నిందో తెలుసా…

మనకు తెలిసిందే శరత్ కుమార్ ని రెండో పెళ్లి చేసుకుంది హీరోయిన్ రాధిక. శరత్ కుమార్ మొదటి భార్య కూతురు వరలక్ష్మి. ఆమెను వదిలేసి కూతురు ఉండగానే రెండో పెళ్లి చేసుకున్నాడు శరత్ కుమార్. అంటే వరలక్ష్మి శరత్ కుమార్ కు రాధిక సవతి తల్లి అని చెప్పాల్సిందే. ఒకప్పుడు అంటే సవతి తల్లి రాచి రంపాలు పెదూతుంది అని అనుకునేవారు. కానీ ఇప్పుడు అలా లేదు ఒక్కొక్కరు మూడు నాలుగు పెళ్లిళ్లు చేసుకుంటున్నారు. అయితే రీసెంట్ గా రాధిక తన 60 పుట్టినరోజు వేడుకలను గ్రాండ్ గా సెలబ్రేట్ చేసుకుంది. కోలీవుడ్ టాలీవుడ్ స్టార్స్ అందరిని పిలిచి ఓ రేంజ్ లో పార్టీ ఇచ్చి ఘనంగా సెలబ్రేట్ చేసుకుంది . దీనికి సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.

అయితే తన సవతి తల్లి పుట్టిన రోజుకి వరలక్ష్మి శరత్ కుమార్ విష్ చేస్తూ..” అమ్మ అనకుండా ఆంటీ “అని పోస్ట్ పెట్టింది. ” 60వ జన్మదిన శుభాకాంక్షలు ఆంటీ.. లవ్ యు.. మీరు మా అందరికీ ఆదర్శం.. మీ వయసు ఎంత పెరిగిన ఇంకా యంగ్ గానే ఉన్నారు. గ్లామర్ కి నటనకి నెంబర్ అడ్డు కాదని.. మీ నుంచి నేర్చుకుంటున్న.. హావ్ ఏ గుడ్ ట్రిప్.. ఆంటీ ..సి యు సూన్.. లవ్ యు” అంటూ పోస్ట్ పెట్టింది.

అంతే మిగతా మ్యాటర్ అంతా పట్టించుకోని జనాలు ఆంటీ అన్న ఒక్క మాటను పట్టేసుకుని ఆడేసుకుంటున్నారు. “సవతి తల్లి అయినా తల్లి అయినా తల్లి తల్లే కదా మరి ఆంటీ అని ఎలా అంటావ్? నీకు సిగ్గుందా” అంటూ కొందరు ఆమెను తిట్టిపోస్తున్నారు. “మరికొందరు వాళ్ళ అమ్మ ఆమె ఇష్టం మనకెందుకురా బాయ్” అంటూ లైట్ తీసుకుంటున్నారు. దీంతో వరలక్ష్మి శరత్ కుమార్ నోటి నుండి ఇలాంటి ఆంటీ అనే మాట ఊహించలేదంటూ కొందరు ఆమె అభిమానులు బాధపడుతున్నారు.

 

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news