Moviesతమన్నాకి ఆ దర్శకుడంటే చాలా స్పెషల్..ఎప్పుడు ఫోన్ చేసినా నో అనకుండా..?

తమన్నాకి ఆ దర్శకుడంటే చాలా స్పెషల్..ఎప్పుడు ఫోన్ చేసినా నో అనకుండా..?

సినిమా ఇండస్ట్రీలో దర్శకుడికి హీరోకి, దర్శకుడికి, నిర్మాతకి ప్రత్యేకమైన అనుబంధం ఉంటుంది. అలా ఉంటేనే కలిసి కొన్నేళ్ళ పాటు జర్నీ చేయగలిగేది. కాంబోలో బ్లాక్ బస్టర్స్ తీసేది. కొన్ని కాంబినేషన్స్ అంటే కూడా ఇటు అభిమానుల్లో అటు ప్రేక్షకుల్లో క్రేజ్ విపరీతంగా ఉంటుంది. అలాగే, మరో క్రేజీ కాంబినేషన్ అంటే దర్శకుడు – హీరోయిన్. వీరి మధ్య సఖ్యత కుదిరితే నిర్మాతని ఒప్పించైనా ఆ దర్శకుడు..తనకి అనుకూలంగా ఉండే హీరోయిన్ కి వరుసగా అవకాశాలిస్తుంటాడు.

హీరోయిన్స్ కూడా దర్శకనిర్మాతలతో అలాగే హీరోలతో మంచి రాపో మేయింటైన్ చేస్తుంటారు. లాంగ్ రన్ లో కొత్తగా వచ్చే అందాల భామల పోటీని తట్టుకోవాలంటే హీరోయిన్స్ ఎవరో ఒకరి వెంట నడవాల్సిందే. తప్పదు. ఇక్కడ చిన్న సందు దొరికితే, లెక్కకు మించి దూరిపోవడానికి రెడీగా ఉంటారు. అయితే, ఎవరొచ్చొనా నా ఫస్ట్ ప్రిఫరెన్స్ నీకే అని మాటిచ్చే దర్శకులు కూడా ఉన్నారు. అలాంటి వారిలో సంపత్ నంది ఒకరు. రచయితగా పాపులర్ అయిన సంపత్ నంది ఏమైంది ఈ వేళ ఈ సినిమాతో దర్శకుడిగా మారాడు.

ఈ సినిమా యూత్ ఆడియన్స్ ని బాగా ఆకట్టుకుంది. ఆ తర్వాత ర‌చ్చ సినిమా మెగా పవర్ స్టార్ రాం చరణ్‌తో తీశాడు. ఈ సినిమాలో హీరోయిన్‌గా తమన్నా నటించింది. ఈ సినిమా తర్వాత నుంచి తమన్నా, సంపత్ నంది మధ్య మంచి బాండింగ్ ఏర్పడింది. ఎప్పుడు సంపత్ నంది కాల్ చేసినా మిల్కీ బ్యూటీ అందుబాటులో ఉంటుంది. మిగతా దర్శ‌కుల సంగతేమో గానీ తమన్నాకి సంపత్ నంది అంటే ఎందుకో ప్రత్యేకమైన అభిమానం.

రచ్చ, బెంగాల్ టైగర్, సీటీమార్ లాంటి సినిమాలు వచ్చాయి. వీటిలో ఒక్క సీటీమార్ ఆశించిన సక్సెస్ అందుకోలేకపోయింది. మిగతా రెండు సినిమాలు తమన్నాకి మంచి హిట్ ఇచ్చాయి. సంపత్ నందికి ఇండస్ట్రీలో డేట్స్ అడిగితే కాదనకుండా ఇచ్చే హీరోయిన్ ఎవరైనా ఉన్నారంటే అది తమ్మూ బేబీ మాత్రమే. మరి వీరి కాంబినేషన్‌లో మళ్ళీ బ్లాక్ బస్టర్ ఎప్పుడు పడుతుందో చూడాలి..!

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news