Movies' జై బాల‌య్య ' సినిమా నుంచి ప‌వ‌ర్ ఫుల్ లుక్...

‘ జై బాల‌య్య ‘ సినిమా నుంచి ప‌వ‌ర్ ఫుల్ లుక్ వ‌చ్చేసింది… చంపేశావ్ బాల‌య్యా..!

నందమూరి బాలకృష్ణ అఖండ భారీ విజయం తర్వాత ఇప్పుడు మ‌లినేని గోపీచంద్ డైరెక్ష‌న్‌లో సినిమాలో న‌టిస్తోన్న సంగ‌తి తెలిసిందే. క్రాక్ లాంటి బ్లాక్‌బ‌స్ట‌ర్ హిట్ సినిమా త‌ర్వాత మ‌లినేని గోపీచంద్ డైరెక్ట్ చేస్తోన్న సినిమా కావ‌డంతో ఈ క్రేజీ ప్రాజెక్టుపై భారీ అంచ‌నాలే ఉన్నాయి. బాల‌య్య కెరీర్‌లో 107వ సినిమాగా ఈ ప్రాజెక్టు తెర‌కెక్కుతోంది. బాల‌య్య‌కు జోడీగా శృతీహాస‌న్ న‌టిస్తుండ‌గా… వ‌ర‌లక్ష్మి శ‌ర‌త్‌కుమార్ కీల‌క పాత్ర‌లో న‌టిస్తున్నారు.

ఇప్ప‌టికే ఈ సినిమా నుంచి రిలీజ్ అయిన ఫస్ట్ లుక్ స్టిల్స్‌, ఇత‌ర ఫొటోలు సినిమాపై అంచ‌నాలు అమాంతం పెంచేస్తున్నాయి. ఈ క్ర‌మంలోనే ఈ రోజు సినిమా నుంచి అదిరిపోయే మ‌రో ప‌వ‌ర్ ఫుల్ లుక్ రిలీజ్ చేశారు. బాల‌య్య వైట్ డ్రెస్‌లో, గుబురు గడ్డంతో.. క‌ళ్ల‌కు స్టైలీష్ గ్లాసెస్ పెట్టుకుని ఉన్నాడు. అస‌లు లుక్ చూడ‌డానికి ప‌వ‌ర్ ఫుల్ పొలిటిక‌ల్ లీడ‌ర్ లుక్‌గా క‌నిపిస్తోంది.

ఈ లుక్ బ‌య‌ట‌కు రావ‌డంతో ఈ సినిమాపై మ‌రింత ఆస‌క్తి, బ‌జ్ స్టార్ట్ అయ్యింది. అలాగే బాల‌య్య మేకోవ‌ర్‌పై కూడా భారీ అంచ‌నాలే ఉన్నాయి. ఈ తాజా లుక్ ఇటీవ‌ల ముగిసిన క‌ర్నూలు షెడ్యూల్ నుంచి తీసింద‌ని అర్థ‌మ‌వుతోంది. ఇటీవ‌లే క‌ర్నూలులో ఓ శవం ర్యాలీకి సంబంధించిన సీన్ల‌ను ద‌ర్శ‌కుడు గోపీ షూట్ చేశారు. ఈ షెడ్యూల్ ముగియ‌డంతో ఇప్పుడు విదేశాల్లో రెండు పాట‌ల‌తో పాటు హైద‌రాబాద్‌లో నెక్ట్స్ షెడ్యూల్ ప్లాన్ చేస్తున్నారు. ఏదేమైనా తాజా లుక్ అయితే సినిమాపై అంచ‌నాలు అమాంతం పెంచేసింది.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news