Moviesచిరంజీవి హిట్ సినిమాపై ఎన్టీఆర్ ప్ర‌భుత్వం నిషేధం నిజ‌మేనా... ఏం జ‌రిగింది...!

చిరంజీవి హిట్ సినిమాపై ఎన్టీఆర్ ప్ర‌భుత్వం నిషేధం నిజ‌మేనా… ఏం జ‌రిగింది…!

మెగాస్టార్ చిరంజీవి సినిమా అంటేనే తెలుగులో ఓ క్రేజ్‌. చిరంజీవి సినిమా రిలీజ్ అవుతుంది అంటే తెలుగు గడ్డపై సినిమా అభిమానులకు పెద్ద పండగ. నటరత్న ఎన్టీఆర్ తర్వాత ఆ స్థాయిలో తెలుగు ప్రేక్షకులు ఒక సినిమా హీరోను పిచ్చపిచ్చగా అభిమానించి… ఆరాధించింది చిరంజీవినే. 1980 – 90వ దశకంలో చిరంజీవి సినిమా వస్తుంది అంటే యువకులు, చిన్నారులు, మహిళలు, ఫ్యామిలీ ప్రేక్షకులు అందరూ కలిసి వెళ్లి ఆ సినిమాను ఎంజాయ్ చేసేవారు. ముఖ్యంగా చిరంజీవి డ్యాన్సులు అంటే మాస్ ప్రేక్షకులు ఊగిపోయేవారు.

ఇలాంటి కోవలోనే వచ్చిన సినిమా అల్లుడా మజాకా. చెల్లి సెంటిమెంట్ తో పాటు ఫ్యామిలీ ఆడియన్స్ కు కనెక్ట్ అయ్యేలా చిరంజీవి మార్క్ మాస్ పాటలు, డ్యాన్సులు.. ఫైట్లతో వచ్చిన ఈ సినిమా బాక్సాఫీస్ దగ్గర సూపర్ డూపర్ హిట్ అయింది. గ్రామీణ నేపథ్యంలో జరిగే కథతో పాటు చెల్లి సెంటిమెంట్… గడుసరి అత్తకు బుద్ధి చెప్పే అల్లుడుగా సీతారాముడు పాత్రలో చిరంజీవి నటించారు. ఈ సినిమాలో మా ఊరి దేవుడు అంటూ వచ్చే పాట తెలుగు నాట మార్మోగింది. ఇప్పటికీ ఈ పాట శ్రీరామనవమి పందిళ్ళలో వినిపిస్తూ ఉంటుంది.

అల్లుడా మజాకా సినిమాలో రమ్యకృష్ణ – రంభ గ్లామర్ సినిమాకు అదనపు ఆకర్షణ. చిరంజీవితోనే సినిమాలు నిర్మిస్తాను అని ప్రకటించిన కే. దేవి వరప్రసాద్ తన దేవి ఫిలిం ప్రొడక్షన్స్ పై ఈ సినిమాను భారీగా నిర్మించారు. ద‌ర్శ‌కుడు ఈవీవీ సత్యనారాయణకు చిరంజీవితో ఇదే తొలి సినిమా. 1995 ఫిబ్రవరి 25న విడుదలైన ఈ సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర సూపర్ హిట్‌గా నిలిచింది. అయితే ఈ సినిమాలో అడల్ట్ కంటెంట్ ఎక్కువగా ఉందన్న విమర్శలు రావడంతో ఎన్టీఆర్ ప్రభుత్వంలో అధికారులు సినిమాకు ఏ సర్టిఫికెట్ ఇస్తామని చెప్పడంతో పాటు ప్రదర్శన నిలిపివేస్తామని కూడా ప్రకటించింది.

ఇది మెగా అభిమానులకు కోపం తెప్పించింది. దీంతో రాష్ట్రవ్యాప్తంగా ఉన్న చిరంజీవి ఫ్యాన్స్ హైదరాబాద్ వెళ్లి ప్రభుత్వ నిర్ణయానికి వ్యతిరేకంగా ర్యాలీలు కూడా చేశారు. కొందరు తమ తమ గ్రామాల్లో టెంట్లు వేసి మరీ నిరాహార దీక్షలు చేపట్టడం అప్పట్లో సంచలనమైంది. చివరకు అసలు విషయం తెలుసుకున్న ఎన్టీఆర్ ప్రభుత్వ నిర్ణయాన్ని ఉపసంహరించుకునేలా చేశారు. అలా వివాదాల మధ్య రిలీజ్ అయిన అల్లుడా మజాకా 27 కేంద్రాల్లో డైరెక్ట్ గా 100 రోజులు… షిఫ్టులతో మరో 20 సెంటర్లలో మొత్తం 47 కేంద్రాల్లో 100 రోజులు ఆడింది.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news