Moviesకమిట్మెంట్ ఇవ్వకపోవడం వల్లనే ఆ సినిమా ఛాన్స్ లు మిస్ అయ్యా....మిర్చి...

కమిట్మెంట్ ఇవ్వకపోవడం వల్లనే ఆ సినిమా ఛాన్స్ లు మిస్ అయ్యా….మిర్చి నటి బోల్డ్ కామెంట్స్…!

సినిమా ఇండస్ట్రీలో ఆడవాళ్ళు రాణించడం అంటే అంత అషా మాషి కాదు. ఎన్నో ఇబ్బందులు ఎదురుకోవాల్సి వస్తుంది. నటన పై ఎంత ఇష్టం ఉన్నా సినిమాలు అంతే ప్రేమ ఉన్నా.. కానీ, అవకాశాలు రావాలంటే ఇబ్బందులు తప్పవు. స్టార్ హీరోయిన్ ల నుండి క్యారెక్టర్ ఆర్టిస్ట్ ల వరకూ తాము అనేక ఇబ్బందులు ఎదురుకున్నాం అని ఇంటర్వ్యూ లలో చెబుతుంటారు. అప్పట్లో నటి శ్రీరెడ్డి తనను వాడుకుని అవకాశం ఇవ్వకుండా వదిలేశారు అని సంచలన ఆరోపణలు చేసిన సంగతి తెలిసిందే.

దాంతో ఏకంగా ఇండస్ట్రీ నుండి దూరం అవ్వాల్సి వచ్చింది. ఇక చాలా మంది క్యారెక్టర్ ఆర్టిస్ట్ లు కూడా తాము కాస్టింగ్ కౌచ్ బాధితులం అని చెప్పారు. కాగా మిర్చి సినిమాతో గుర్తింపు తెచ్చుకున్న నటి మిర్చి మాధవి కూడా ఇప్పుడు అలాంటి కామెంట్లు చేసింది. మిర్చి సినిమా కంటే చాలా సినిమాల్లో నటించినప్పటికీ అంతగా గుర్తింపు తెచ్చుకోలేదు. కానీ మిర్చి సినిమా తర్వాత నోటెడ్ నటిగా మాధవి మారిపోయింది. అప్పటి నుండి సినిమా లో నటిస్తూ సీరియల్స్ లోనూ నటించింది. ఇక మాధవి గతంలో ఓ ఇంటర్వ్యూ లో సంచలన కామెంట్స్ చేయగా అవి ఇప్పుడు వైరల్ అవుతున్నాయి.

ఇంటర్వ్యూలో మిర్చి మాధవి మాట్లాడుతూ…..”అప్పట్లో ఓ వ్యక్తి ఫోన్ చేసి ఐదుగురం ఉన్నాం…వస్తావా కమిట్మెంట్ ఇస్తావా అంటూ మాట్లాడాడు అని “ఆవేదన వ్యక్తం చేసింది. దానికి తాను సీరియస్ అయ్యా అని చెప్పుతో కొడతా అని వార్నింగ్ ఇచ్చినట్టు తెలిపింది….దాంతో వెంటనే ఫోన్ కట్ చేశాడు అని పేర్కొంది. సినీ పరిశ్రమ లోనే కొందరు గుర్తు తెలియని వ్యక్తులు ఇలాంటి దారుణాలకు పాల్పడుతున్నారు అంటూ బాంబు పేల్చింది. కమిట్మెంట్ ఇవ్వకపోవడం వల్లనే తను చాలా సినిమా అవకాశాలు మిస్ అయ్యానని వెల్లడించింది. సినిమా ఇండస్ట్రీలో జాగ్రత్తగా ఉండాలని సూచించింది.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news