Moviesమారుతికి ప్రభాస్ పెట్టిన ఏకైక కండీషన్ ఇదే..భలే ఇరుక్కున్నాడే..?

మారుతికి ప్రభాస్ పెట్టిన ఏకైక కండీషన్ ఇదే..భలే ఇరుక్కున్నాడే..?

గత కొద్ది రోజులుగా ప్రభాస్ మారుతి సినిమాపై ఏ రేంజ్ లో న్యూస్ లు వైరల్ అవుతున్నాయో మనకు తెలిసిందే. నిన్న మొన్నటి వరకు దీనిపై అఫీషియల్ ప్రకటన రానప్పటికీ ప్రభాస్ మారుతి సినిమాపై సోషల్ మీడియాలో ఓ రేంజ్ లో హైప్స్ క్రియేట్ అయ్యాయి . దిన్నంతటికీ కారణం హీరో ప్రభాస్ కి ఉన్న క్రేజ్ అనే చెప్పాలి. పాన్ ఇండియా స్థాయిలో సినిమాలు తీసే ఈయన ఓ చిన్న డైరెక్టర్ మారుతి డైరెక్షన్లో సినిమా చేయబోతున్నాడా..? అని సినీ ప్రముఖుల సైతం సందేహం వ్యక్తం చేశారు. కానీ వాటి అన్నింటినీ పటాపంచలు చేస్తూ క్రితం బుధవారం సినిమాకు సంబంధించిన పూజా కార్యక్రమాలు అటహాసంగా జరిగాయి.

కాగా ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ నవంబర్ నుంచి ప్రారంభం కానుంది అని తెలుస్తుంది. ఇప్పటికే ఈ సినిమా కి సంబంధించిన క్రేజీ అప్డేట్స్ సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. ఈ సినిమాకి రాజా డీలక్స్ అనే టైటిల్ ని మారుతి రిజిస్టర్ చేశాడని తెలుస్తుంది. అంతేకాదు మారుతి ఈ సినిమాలో ప్రభాస్ ని ఓ సరికొత్త రోల్ లో చూపించబోతున్నాడని.. బుజ్జిగాడు, ఈశ్వర్ సినిమా టంలోని ప్రభాస్ ని మళ్ళీ మనం తెరపై చూడబోతున్నామంటూ సినీ వర్గాల నుండి సమాచారం అందుతుంది . ఈ సినిమాలో ముగ్గురు హీరోయిన్స్ ఉన్నట్లు తెలుస్తుంది.

మలయాళం బ్యూటీ మాళవిక మోహన్ మెయిన్ హీరోయిన్ గా చేస్తుండగా.. మారుతి లక్కీ హీరోయిన్ రాశి ఖన్నా ఈ సినిమాలో సెకండ్ హీరోయిన్ గా, మూడో హీరోయిన్ గా అందాల భామ మెహరీన్ నటిస్తున్నట్లు తెలుస్తుంది. కాగా నవంబర్ నుంచి ఈ సినిమా షూటింగ్ ప్రారంభం కానున్న నేపథ్యంలో సినిమాకి సంబంధించిన క్రేజీ న్యూస్ సోషల్ మీడియాలో ఓ రేంజ్ లో వైరల్ గా మారింది. ఈ సినిమా కోసం మొత్తం బడ్జెట్ 50 కోట్లుగా తెలుస్తుంది . అయితే ప్రభాస్ ఈ సినిమాకి కొత్త కండిషన్ పెట్టాడట.

ఇప్పటివరకు తను తీసే సినిమాలన్నీ పాన్ ఇండియా రేంజ్ లోనే తెరకెక్కలి అనే రూల్ పెట్టుకున్న ప్రభాస్.. ఫస్ట్ టైం ఈ సినిమా కోసం ఆ లిమిట్స్ క్రాస్ చేసి తాను పెట్టుకున్న కండిషన్ ను తానే బ్రేక్ చేసినట్లు తెలుస్తుంది. ఈ సినిమా కథ పూర్తిగా విన్న తర్వాత ప్రభాస్ ఇది తెలుగు వాళ్లకి బాగా నచ్చుతుందని.. కేవలం తెలుగులోనే ఈ సినిమాను తీద్దామని.. తెలుగులో హిట్ అయితే ఆ తర్వాత మిగతా భాషలో ట్రౌ చేద్దామని అన్నారట. అంతేగాని ఫస్ట్ టైం పాన్ ఇండియా సినిమా అంటూ తెరకెక్కించొద్దని మారుతికి చెప్పుకొచ్చారట. అంతేకాదు ఈ సినిమా కోసం ప్రభాస్ కేవలం 50 రోజుల కాల్ షీట్లు ఇచ్చారంట ఆ 50 రోజులకు కాల్ షీట్లోనే మారుతి సినిమా మొత్తం డైరెక్ట్ చేసి రిలీజ్ చేసి ప్రభాస్ ఖాతాలో కొత్త హిట్ వేయాలి నిజానికి బాహుబలి సినిమా తర్వాత ప్రభాస్ ఇప్పటి వరకు ఒక్క హిట్టు కూడా అందుకోలేదు ఒకవేళ మారుతి సినిమా హిట్ అయితే నిజంగా చెప్పాలి.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news