Moviesబాబాయ్ బాల‌య్య కోసం అబ్బాయ్ క‌ళ్యాణ్‌రామ్ ప్లానింగ్ మామూలుగా లేదే..!

బాబాయ్ బాల‌య్య కోసం అబ్బాయ్ క‌ళ్యాణ్‌రామ్ ప్లానింగ్ మామూలుగా లేదే..!

నందమూరి హీరో కళ్యాణ్‌ రామ్‌ హీరోగా ఓ చారిత్రక కథాంశంతో బింబిసార సినిమా తెర‌కెక్కుతోన్న సంగ‌తి తెలిసిందే. కొత్త ద‌ర్శ‌కుడ వ‌శిష్ట్ మ‌ల్లిడి ద‌ర్శ‌క‌త్వంలో వ‌స్తోన్న ఈ సినిమాకు ఎ టైమ్‌ ట్రావెల్‌ ఫ్రమ్‌ ఈవిల్‌ టు గుడ్ అన్నది ఉపశీర్షిక. కళ్యాణ్ రామ్ స్వయంగా నిర్మించిన ఈ ఫాంట‌సీ డ్రామా ఆగ‌స్టు 5న ప్రేక్ష‌కుల ముందుకు రానుంది. ఇక ఈ సినిమాతో క‌ళ్యాణ్‌రామ్ ప‌టాస్ రేంజ్ హిట్ కొడ‌తాడ‌న్న న‌మ్మ‌కాలు అయితే ఆయ‌న అభిమానుల‌తో పాటు ట్రేడ్ వ‌ర్గాల్లోనూ క‌నిపిస్తున్నాయి.

ఇక గ‌త నెల 29న జ‌రిగిన బింబిసార ప్రి రిలీజ్ ఈవెంట్ ఫంక్ష‌న్‌కు జూనియ‌ర్ ఎన్టీఆర్ ముఖ్య అతిథిగా వ‌చ్చాడు. ఎన్టీఆర్ ఎప్పుడు అయితే ఈ సినిమా ఈవెంట్‌కు వ‌చ్చి సినిమా ఖ‌చ్చితంగా హిట్ అవుతుంద‌ని.. తాను ప్రివ్యూ షో చూశాన‌ని చెప్పాడో అప్ప‌టి నుంచి బింబిసార‌పై మ‌రింత గురి కుదురుతోంది. ఇక ఈ సినిమా హైప్‌ను మ‌రింతగా కంటిన్యూ చేసేందుకు హీరో క‌ళ్యాణ్‌రామ్ మ‌రో అదిరిపోయే ప్లాన్ వేసిన‌ట్టు టాక్ ?

సినిమా రిలీజ్‌కు మ‌రో మూడు రోజుల టైం ఉంది. ఈ క్ర‌మంలోనే రిలీజ్‌కు ముందు మ‌రో భారీ ఈవెంట్ ప్లాన్ చేశారు. ఈ ఈవెంట్‌కు ముఖ్య అతిథిగా క‌ళ్యాణ్‌రామ్ బాబాయ్‌, న‌ట‌సింహం బాల‌కృష్ణ ముఖ్య అతిథిగా వ‌స్తున్నాడ‌ట‌. ఒక వేళ బింబిసార ఈవెంట్ గెస్ట్‌గా వ‌స్తే సినిమాపై హైప్ ఖ‌చ్చితంగా మ‌రో రేంజ్‌కు వెళుతుంద‌నే చెప్పాలి. నంద‌మూరి, బాల‌య్య అభిమానులు అంద‌రూ ఈ సినిమాను భారీ ఎత్తున ప్ర‌మోట్ చేసేందుకు రెడీగా ఉన్నారు.

ఇక ఈ సినిమాలో హీరో క‌ళ్యాణ్‌రామ్ బింబిసార అనే క్రూరమైన రాజుగా శక్తివంతమైన పాత్రలో కనిపించనున్నారు. ఈ సినిమా.. తెలుగుతో పాటు అన్ని ప్రధాన భారతీయ భాషల్లో విడుదలవుతోంది. క‌ళ్యాణ్‌రామ్‌కు జోడీగా కేథరీన్‌, సంయుక్త మీనన్‌ కథానాయికలుగా నటిస్తున్నారు.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news