Moviesషాక్‌: అంజ‌లికి ఏమైంది... ఇలా అవ్వ‌డానికి ఇంత కార‌ణం ఉందా...!

షాక్‌: అంజ‌లికి ఏమైంది… ఇలా అవ్వ‌డానికి ఇంత కార‌ణం ఉందా…!

అసలు పై ఫోటో చూస్తుంటే ఆ ఫోటోలో ఉన్నది ఎవరు ? మనం ఇప్పటివరకు చూస్తున్న‌ మన అంజలి యేనా ? ఆమె రూపం ఎంత గుర్తుపట్టలేనంతగా మారిపోయింది ఏంటి ? మరీ సైజ్ జీరో పేరుతో ఆమె ఇంతలా బక్క చిక్కిపోయింది ఏంటి ? అని ప్రతి ఒక్కరు షాక్ అవుతున్నారు. అంజలి లేటెస్ట్ ఫోటో చూడగానే అందరిలోనూ చాలా సందేహాలు వ్యక్తం అవుతున్నాయి. అంజలి అంటేనే ఒకప్పుడు కాస్త లావుగా ఒళ్ళు చేసి బొద్దుగా ఉండేది. అలాంటి అంజలి ఇప్పుడు పూర్తిగా మారిపోయింది.

స్లిమ్ లుక్‌ పేరుతో ఆమె తన శరీరాన్ని బాగా హింసించేసి బ‌క్క ప‌లుచుగా మారిపోయింది. అసలు పాత అంజలి ఫోటోలు.. ఈ కొత్త ఫోటో దగ్గర పెట్టి కంపేరిజన్ చేస్తే మనం చూస్తున్నది అంజలి ఫోటోయేనా ? అన్నంత అనుమానం వచ్చేలా బ‌క్క చిక్కిపోయింది. ఒకప్పుడు సీనియర్ హీరోలు వెంకటేష్, బాలకృష్ణ లకు జోడిగా నటించింది అంజలి. ఆ తర్వాత తెలుగులో ఛాన్సులు తగ్గడంతో తమిళంలో కొన్ని సినిమాల్లో నటించింది.

తమిళ హీరో జైతో చాలా కాలం పాటు ఆమె సహజీవనం చేసింది. వీళ్లిద్దరూ కలిసి ఎన్నో రోజులపాటు ఒక ఇంట్లో కూడా ఉన్నారు. పీకల్లోతు ప్రేమలో మునిగిన వీరు పెళ్లి వరకు వెళతారని కూడా అంద‌రు అనుకున్నాన్న‌రు. ఆ తర్వాత ఏమైందో కానీ వీరిద్దరూ బ్రేకప్ చెప్పేసుకొని ఎవరి దారి వారు చూసుకుంటాన్నారు. చాలా రోజుల తర్వాత అంజలికి తెలుగులో ఐటెం సాంగ్ లో అవకాశం వచ్చింది.
నితిన్ హీరోగా రాజశేఖర్ రెడ్డి దర్శకత్వంలో తెరకెక్కిన మాచర్ల నియోజకవర్గం సినిమాలో అంజలి ఐటమ్ సాంగ్ ఒక ఊపు పేసింది.

రా రా రెడ్డి అనే పాట ఇప్పటికే జనాల్లోకి దూసుకుపోయింది. రేపు రిలీజ్ అవుతున్న ఈ సినిమాలో ఐటమ్ సాంగ్ క్లిక్ అయితే అంజలికి మళ్ళీ తెలుగులో అవకాశాలు వస్తాయన్న ఆశలతో ఆమె ఉంది. ఈ పాటకు వస్తున్న రెస్పాన్స్ చూశాక అంజలి ఫుల్ జోష్లో ఉంది. ఈ పాట షూట్ చేస్తున్నప్పుడు ఫోటోగ్రాఫర్ చీర, రవికలో ఎంతో అందంగా ముస్తాబు అయిన అంజలిని రకరకాల భంగిమల్లో ఫోటోలు తీశాడు.

ఈ ఫోటోలో స్లిమ్ లుక్‌లో ఆమె అందం రెట్టింపు అయింది. ప్రస్తుతం ఈ ఫోటోలు ఇంటర్నెట్లో వైరల్ గా మారాయి. అయితే ఈ ఫోటోలు చూస్తుంటే అంజలి ప్రస్తుతం కుర్ర హీరోయిన్లకు పోటీగా అవకాశాలు దక్కించుకుంటుందా..! అన్నంత అందంగా కనిపిస్తోంది. అంజ‌లి ప్రస్తుతం తెలుగులో అవకాశాలు లేకపోయినా తమిళంలో మాత్రం ఆమె పలు సినిమాల్లో బిజీగా ఉంది.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news