Moviesవిజయ్ అంటే పిచ్చితో ఈ పిల్ల ఏం చేసిందో తెలుసా..పిచ్చెక్కిపోవాల్సిందే..!!

విజయ్ అంటే పిచ్చితో ఈ పిల్ల ఏం చేసిందో తెలుసా..పిచ్చెక్కిపోవాల్సిందే..!!

టాలీవుడ్ రౌడీ హీరో విజయ్ దేవరకొండ..ఈ పేరు చెప్పగానే మనకు వెనుక అర్జున్ రెడ్డి బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ వినిపిస్తుంది. పెళ్లి చూపులు సినిమాతో క్లాస్ హీరో గా పేరు తెచ్చుకున్న ఈ రౌడీ హీరో..అర్జున్ రెడ్డి తో ఇండస్ట్రీ లెక్కలు మార్చేశాడు. ఒక్క సినిమా తోనే అల్లు అర్జున్, ప్రభాస్ లాంటి బడా స్టార్ హీరో ల క్రేజ్ ను సంపాదించుకున్నాడు.

ఇప్పుడు బాలీవుడ్ లో కూడా విజయ్ కి మంచి ఫాలోయింగ్ ఉంది. స్టార్ బ్యూటీస్ అలియా, దిపికా, జాన్వీ కపూర్ లాంటి వాళ్లు కూడా విజయ్ తో సినిమా చేయాలని డైరెక్ట్ గానే చెప్పుకొచ్చారు. ఇందస్ట్రీకి వచ్చిన తక్కువ టైంలోనే ఈ రేంజ్ ఫాలోయింగ్ వచ్చిందంటే..దాని వెనుక ఆయన కష్టం ఉందన్న సంగతి మనం మర్చిపోకూడదు.

అయితే, విజయ్ కి గర్ల్స్ ఫ్యాన్ ఫాలోయింగ్ ఎక్కువనే సంగతి తెలిసిందే. విజయ్ ఎక్కడికి వెళ్లినా..అమ్మాయిలు ఫోటోలు, సెఫ్లీలు, ఆటో గ్రాఫ్ లు అంటూ పిచ్చెక్కిస్తారు. అబ్బాయిలకన్నా గట్టిగా అరుస్తూ..కేకలు పెడుతూ విజయ్ ఫ్యాన్స్ అనిపిస్తారు. తాజాగా, లేడీ ఫ్యాన్.. ఈ రౌడీ హీరోపై తన అభిమానాన్ని చాటుకుంది. వీపుపై విజయ్ దేవరకొండ ఫొటోను టాటూగా వేయించుకుంది.

రౌడీ బాయ్‌ను కలిసి ఆ యువతి వీడియో ప్రస్తుతం నెట్టింట వైరల్‌గా మారింది. విజయ్ అంటే చెర్రీ కి చాలా ఇష్టం. చచ్చేంత అభిమానం..ఆ అభిమానాన్ని ఎలా చూయించాలో తెలియక అతని ఫోటోను తన వీపుపై పర్మినెంట్ పచ్చబొట్టుగా వేయించుకుని ఇందస్ట్రీలో హాట్ టాపిక్ గా మారింది. అంతేకాకుండా నేరుగా తన ఫేవరేట్ స్టార్ ‏ను కలిసి సంతోషం వ్యక్తం చేసింది.ఆ టాటూను చూసి దేవరకొండ సైతం ఆశ్చర్య పోయాడు. విజయ్ వెల్ కమ్ చూసిన ఆ అమ్మాయి పొంగిపోయి భావోద్వేగానికి గురైంది.

 

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news