Moviesప్ర‌భాస్ - అనుష్క పెళ్లి ఇక లేన‌ట్టే... ఎట్ట‌కేల‌కు నిజం బ‌య‌ట‌కు...

ప్ర‌భాస్ – అనుష్క పెళ్లి ఇక లేన‌ట్టే… ఎట్ట‌కేల‌కు నిజం బ‌య‌ట‌కు వ‌చ్చింది…!

టాలీవుడ్‌లో ప్ర‌భాస్‌, అనుష్క జోడీ ఎంత పాపుల‌రో తెలిసిందే. తెర‌మీద వీరి రొమాన్స్‌కు ఎంత క్రేజ్ ఉంటుందో.. బ‌య‌ట కూడా వీరు నిజ జీవితంలో రొమాన్స్ చేసుకోవాల‌ని కోరుకునే సినీ అభిమానులు ల‌క్ష‌ల్లోనే ఉన్నారు. ప్ర‌భాస్ – అనుష్క‌ది బ్లాక్‌బ‌స్ట‌ర్ కాంబినేష‌న్‌. వీరి కాంబోలో బిల్లా – మిర్చి – బాహుబ‌లి 1, బాహుబ‌లి 2 సినిమాలు వ‌చ్చాయి. అస‌లు 2013లో మిర్చికి ముందు నుంచి బాహుబ‌లి 2 అయ్యే వ‌రకు చూస్తే ఐదేళ్లు వీరి కంటిన్యూగా కలిసే ప‌నిచేశారు.

ఇక వీళ్లిద్ద‌రు పెళ్లి చేసుకోబోతున్నార‌న్న వార్త‌లు గ‌త నాలుగైదేళ్లుగా వ‌స్తూనే ఉన్నాయి. నాలుగున్న‌ర ప‌దుల వ‌య‌స్సు వ‌చ్చినా ప్ర‌భాస్ ఇంకా పెళ్లి చేసుకోక‌పోవ‌డం, అటు అనుష్క కూడా 40 ఏళ్లు వ‌స్తున్నా పెళ్లికి దూరంగా ఉండ‌డంతో నిజంగానే వీరు ప్రేమ‌లో ఉన్నారా ? అన్న సందేహాలు కూడా ఉన్నాయి. ఎప్ప‌టిక‌ప్పుడు ప్ర‌భాస్ – అనుష్క పెళ్ల‌యిపోతుంద‌న్న ప్ర‌చార‌మే గ‌ట్టిగా న‌డిచింది.

అటు ప్ర‌భాస్, ఇటు అనుష్క ఇద్ద‌రూ కూడా ఎప్ప‌టిక‌ప్పుడు పెళ్లి అన్న మాట ఎత్త‌క‌పోవ‌డం.. వీరి మ‌ధ్య ఉన్న స్నేహంతో ఏం జ‌రుగుతుందో ఎవ్వ‌రికి అర్థం కావ‌డం లేదు. మూడేళ్ల పాటు సినిమాల‌కు దూరంగా ఉన్న అనుష్క ఇప్పుడు యూవీ వాళ్ల బ్యాన‌ర్లోనే సినిమా చేస్తోంది. అది కేవ‌లం ప్ర‌భాస్ మీద ప్రేమ‌తోనే అన్న‌ది ప్ర‌త్యేకంగా చెప్ప‌క్క‌ర్లేదు. ఏదేలా ఉన్నా వీరిద్ద‌రికి పెళ్లి యోగం లేద‌ని ప్ర‌ముఖ జ్యోతిష్యుడు వేణుస్వామి చెప్పారు.

గత కొంత కాలంగా సినిమా సెల‌బ్రిటీల గురించి వేణుస్వామి చెప్పిన ప్ర‌తి విష‌యం జ‌రుగుతోంది. స‌మంత – చైతు విడాకుల‌తో మొద‌లు పెడితే వేణుస్వామి ముందుగానే చెప్పిన జ్యోతిష్యం చాలా విష‌యాల్లో ఫ్రూవ్ అవ్వ‌డంతో ఇప్పుడు అనుష్క‌, ప్ర‌భాస్ విష‌యంలోనూ ఇదే జ‌రుగుతుందా ? అన్న సందేహాలు క‌లుగుతున్నాయి. వీరిద్ద‌రి జ‌త‌కంలో గురువు నీచంలో ఉన్నాడ‌ట‌.

గురువు నీచంలో ఉన్నందున వీరికి పెళ్లి క‌లిసి రాద‌ని వేణుస్వామి చెప్పారు. అస‌లు వీరిద్ద‌రికి పెళ్లి జ‌రిగే అవ‌కాశ‌మే లేద‌ని.. అలాగే వీరు ఎవ‌రిని పెళ్లి చేసుకున్నా కూడా వైవాహిక జీవితంలో ఇబ్బందులు త‌ప్ప‌వ‌ని.. పెళ్లి స‌క్సెస్ కాక‌పోవ‌డానికే ఎక్కువ ఛాన్సులు ఉన్నాయ‌ని చెప్పాడు. వేణుస్వామి గ‌ట్టిగా వీరి పెళ్లి జ‌ర‌గ‌ద‌ని చెప్ప‌డంతో ఇప్పుడు ఇది హాట్ టాపిక్ అయ్యింది.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news