Moviesకెరీర్ లోనే ఫస్ట్ టైం అలాంటి రోల్ లో పూజా.. అభిమానులకు...

కెరీర్ లోనే ఫస్ట్ టైం అలాంటి రోల్ లో పూజా.. అభిమానులకు బిగ్ షాక్ ఇవ్వనున్న బుట్టబొమ్మ..?

పూజా హెగ్డే..టాలీవుడ్ స్టార్ హీరోయిన్లల్లో ఒకరు. ఇప్పుడు సౌత్ నుంచి నార్త్ వరకు పూజాహెగ్డే పేరే మారు మోగిపోతోంది. హిట్ ఫ్లాప్ లతో సంబంధం లేకుండా తెలుగు, తమిళ, హిందీ భాషల్లో ఈ అమ్మడు వరసగా ఆఫర్స్ కొట్టేస్తుంది.వరుసగా మూడు ఫ్లాప్ సినిమాలు పడినా కానీ..తన కెరీర్ గ్రాఫ్ డౌన్ అవ్వకుండా..క్రేజీ ఆఫర్స్ పట్టేసి..టాలీవుడ్, కోలీవుడ్, బాలీవుడ్ లో వరుస అవకాశాలు అందుకుంటుంది. ప్రజెంట్ టాలీవుడ్ లో రెండు సినిమాలు..బాలీవుడ్ లో మూడు సినిమాలు..కోలీవుడ్ లో మరో రెండు సినిమాలు చేస్తున్నట్లు తెలుస్తుంది.

కాగా, ఇప్పుడు పూజా హెగ్డే హీరోయిన్ గా మరో స్టార్ హీరో సరసన నటించనున్నట్లు తెలుస్తుంది. యస్.. కోలీవుడ్ మీడియా లో ఈ వార్త తెగ చక్కర్లు కొడుతుంది. పూజాహెగ్డే తెలుగుతో పాటు హిందీ మూవీస్ తో ఫుల్ బిజీ షెడ్యూల్ గడుపుతోంది. అయినా తమిళ్ ఆఫర్స్ ని వదులుకోవడం లేదు. తమిళ డైరెక్టర్ శివ తెరకెక్కిస్తున్న సూర్య 40వ సినిమాలో పూజాహెగ్డేనే హీరోయిన్ గా నటించనున్నట్టు సమాచారం.

నిజానికి ఈ సినిమా ఎప్పుడో సెట్స్ పై కి వెళ్ళాసింది. మొన్ని అనివార్య కారణాల చేత..ఈ సినిమా పోస్ట్ పోన్ అవుతూ వస్తుంది. ప్రాడ్యూసర్ మారడంతో ఆల్రెడీ భారీ బడ్జెట్ తో మొదలు పెట్టి ఆగిపోయిన సూర్య 40వ సినిమాను మళ్లీ పట్టాలెక్కిస్తున్నట్లు కోలీవుడ్ సర్ కిల్స్ లో ఓ వార్త తెగ హల్ చల్ చేస్తుంది.

ఆ సినిమాకోసం హీరోయిన్ గా పూజాహెగ్డేను సంప్రదించారట. సూర్య సినిమా కావడంతో అమ్మడు బిజీ గా ఉన్న ఈ సినిమాకు కాల్ షీట్లు అడ్జెస్ట్ చేసి మరీ ఒకేఅ చేసిందట. ఈ సినిమాలో పూజా జర్నలిస్ట్ పాత్రలో మెప్పించనున్నత్లు తెలుస్తుంది. జర్నలిస్ట్ అంటే పూజా కు ఎక్స్ పోజింగ్ స్కోప్ తక్కువుగా ఉంటుంది. ఇది నిజంగా పూజా అభిమానులని నిరాశ పరిచే అంశమే..!!

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news