Moviesప‌విత్రా లోకేష్‌పై ఇంత బ్యాడ్‌గానా... న‌రేష్ మూడో భార్య ర‌మ్య సంచ‌ల‌నం..!

ప‌విత్రా లోకేష్‌పై ఇంత బ్యాడ్‌గానా… న‌రేష్ మూడో భార్య ర‌మ్య సంచ‌ల‌నం..!

ప్ర‌ముఖ న‌టుడు, సూప‌ర్‌స్టార్ కృష్ణ త‌న‌యుడు న‌రేష్ – ప‌విత్రా లోకేష్ బంధం, పెళ్లి గురించి వార్త‌లు గ‌త నెల రోజులుగా బాగా వైర‌ల్ అవుతున్నాయి. వీరిద్ద‌రు పెళ్లి చేసుకోబోతున్నార‌న్న వార్త‌ల నేప‌థ్యంలో సెడ‌న్‌గా న‌రేష్ మూడో భార్య ర‌మ్య లైన్‌లోకి వ‌చ్చ‌చేశారు. ఆమె న‌రేష్‌ను, ప‌విత్ర‌ను టార్గెట్‌గా చేసుకుని విమ‌ర్శ‌లు చేయ‌డంతో పాటు త‌మ బంధంలోకి ప‌విత్రా లోకేష్ వ‌చ్చాకే గొడ‌వ‌లు స్టార్ట్ అయ్యాయ‌ని ఆరోపిస్తున్నారు. మ‌రోవైపు అటు ప‌విత్ర‌పై కూడా ఆమె భ‌ర్త సుచేంద్ర ప్ర‌సాద్ విమ‌ర్శ‌లు చేస్తున్నాడు.

ఈ సంఘ‌ట‌న‌ల నేప‌థ్యంలో ప‌విత్రా లోకేష్ ఓ వీడియో విడుద‌ల చేశారు. ర‌మ్య ర‌ఘుప‌తిపై ఆరోప‌ణ‌లు చేశారు. ర‌మ్య బెంగ‌ళూరు వెళ్లి త‌న‌ను టార్గెట్ చేస్తూ అక్క‌డ బ్యాడ్‌గా ప్ర‌చారం చేస్తున్నార‌ని ప‌విత్ర వాపోయారు. ఆమె సోష‌ల్ మీడియాలో రిలీజ్ చేసిన వీడియో ప్ర‌కారం తాను క‌న్న‌డ నుంచే టాలీవుడ్‌కు వ‌చ్చాన‌ని.. చాలా ఏళ్లుగా మీకు ద‌గ్గ‌ర‌య్యాను.. న‌రేష్ గారు ఏంటో తెలుగు ప్ర‌జ‌ల‌కు కొత్త‌గా చెప్ప‌వ‌ల‌సిన అవ‌స‌రం లేద‌ని.. ర‌మ్య అనే మ‌హిళ బెంగ‌ళూరు వ‌చ్చి అక్క‌డ నా గురించి క‌న్న‌డ మీడియా ముందు చాలా చెడ్డ‌గా మాట్లాడింద‌ని ప‌విత్రా ఆరోపించారు.

న‌రేష్ – ర‌మ్య విడాకుల‌కు తానే కార‌ణ‌మ‌ని.. తాము రిలేష‌న్‌షిఫ్‌లో ఉన్నామంటూ ర‌మ్య బెంగ‌ళూరు మీడియాకు చెప్ప‌డంతో పాటు త‌న‌ను టార్గెట్ చేసి త‌న మ‌న‌సు నొప్పించింద‌ని ప‌విత్రా లోకేష్ చెప్పారు. ఆమెకు భ‌ర్త కావాల‌నుకున్నా.. ఫ్యామిలీలో స‌మ‌స్య‌లు ఉన్నా హైద‌రాబాద్‌లో క‌దా చెప్పాల్సింది.. న‌రేష్ గారు తెలుగు న‌టుడు క‌దా ? ఆమె బెంగ‌ళూరు వెళ్లి కేవ‌లం త‌న‌ను చెడ్డ‌గా చిత్రీక‌రించేందుకే ఇలా చేసింద‌ని.. ఈ టైంలో న‌రేష్ గారికి అంద‌రూ మ‌ద్ద‌తుగా నిల‌వాల‌ని కోరుకుంటున్నా అని ప‌విత్ర లోకేశ్ వేడుకున్నారు.

ఒక్క‌సారిగా ఇటు న‌రేష్ మూడో భార్య ర‌మ్య ర‌ఘుప‌తి, అటు ప‌విత్రా లోకేష్ రెండో భ‌ర్త సుచేంద్ర ప్ర‌సాద్ ఈ జంట‌ను టార్గెట్‌గా చేసుకుని విమ‌ర్శ‌లు చేయ‌డం సంచ‌ల‌నంగా మారింది. ఇక న‌రేష్ కూడా ఇంత వివాదం రేపుతున్న త‌న మూడో భార్య ర‌మ్య‌పై ఘాటుగా ఆరోప‌ణ‌లు చేయ‌డంతో పాటు ఆమెపై దారుణంగా విమ‌ర్శ‌లు కూడా చేస్తోన్న ప‌రిస్థితి.

ఇక ప‌విత్ర తండ్రి మైసూర్ లోకేష్ క‌న్న‌డంలో సీనియ‌ర్ న‌టుడు. ఆయ‌న కుమార్తె అయిన ప‌విత్ర 16 ఏళ్ల వ‌య‌స్సులోనే సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చింది. ఆమె క‌న్న‌డ‌తో పాటు తెలుగులో ప‌లు సినిమాల్లో న‌టించారు. ప‌విత్ర‌కు సుచేంద్ర ప్ర‌సాద్‌తో వివాహానికి ముందే ఓ సాఫ్ట్‌వేర్ ఇంజ‌నీర్‌తో పెళ్లి కాగా.. ఆ బంధం యేడాదికే పెటాకులైందంటున్నారు.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news