Moviesఎన్టీఆర్ 31 సినిమా నుంచి క‌మ‌ల్‌హాస‌న్ అవుట్‌.. సూప‌ర్‌స్టార్ ఇన్‌...!

ఎన్టీఆర్ 31 సినిమా నుంచి క‌మ‌ల్‌హాస‌న్ అవుట్‌.. సూప‌ర్‌స్టార్ ఇన్‌…!

టాలీవుడ్ యంగ్‌టైగ‌ర్ ఎన్టీఆర్‌, పాన్ ఇండియా డైరెక్టర్ ప్రశాంత్ నీల్ కాంబినేష‌న్లో ఓ సినిమా వ‌స్తోన్న సంగ‌తి తెలిసిందే. ప్ర‌స్తుతం కొర‌టాల శివ సినిమా చేస్తోన్న ఎన్టీఆర్ ఆ సినిమా త‌ర్వాత ప్ర‌శాంత్ నీల్ సినిమా ఉండ‌నుంది. ప్ర‌స్తుతం స‌లార్ చేస్తోన్న ప్ర‌శాంత్‌.. ఆ సినిమా పూర్త‌యిన వెంట‌నే ఎన్టీఆర్ సినిమాను సెట్స్ మీద‌కు తీసుకు వెళ‌తాడు. ఈ లోగా ఎన్టీఆర్ కొర‌టాల శివ సినిమాను ఫినిష్ చేయాల్సి ఉంది.

ఈ భారీ యాక్ష‌న్ డ్రామాలో ఎన్టీఆర్ డ్యూయెల్ రోల్ చేస్తున్న‌ట్టు కూడా ఓ టాక్ బ‌య‌ట‌కు వ‌చ్చింది. ఈ సినిమాలో ఎన్టీఆర్ పాత్ర‌లే కాకుండా మ‌రో కీల‌క పాత్ర కూడా ఉంది. ఆ పాత్ర కోసం ముందుగా లోక‌నాయ‌కుడు క‌మ‌ల్‌హాస‌న్ పేరు వినిపించింది. ఈ పాత్ర సినిమాకే హైలెట్‌గా ఉండ‌బోతోంద‌ట‌. ప్ర‌శాంత్ నీల్ సైతం క‌మ‌ల్‌ను క‌లిసి ఒక‌టి రెండు సార్లు చ‌ర్చ‌లు కూడా జ‌రిపాడు.

అయితే విక్ర‌మ్ భారీ స‌క్సెస్ అవ్వ‌డంతో క‌మ‌ల్‌హాస‌న్ ఈ ప్రాజెక్టులో న‌టించేందుకు ఆస‌క్తి చూపించ‌డం లేద‌ని తెలుస్తోంది. క‌మ‌ల్ – ఎన్టీఆర్ క‌లిసి స్క్రీన్ మీద కనిపిస్తే ఆ ర‌చ్చ ఎలా ఉంటుందో చెప్ప‌క్క‌ర్లేదు. సౌత్ నుంచి నార్త్ వ‌ర‌కు సినిమా స్క్రీన్లు అన్నీ షేక్ అయిపోతాయి. అయితే ఇప్పుడు క‌మ‌ల్ ఈ క్రేజీ ప్రాజెక్ట్ ప‌ట్ల ఆస‌క్తిగా లేక‌పోవ‌డంతో ప్ర‌శాంత్ నీల్ ఈ పాత్ర కోసం మ‌ళ‌యాళ సూప‌ర్‌స్టార్ మోహ‌న్‌లాల్‌ను దించాల‌ని ప్లాన్ చేస్తున్నాడ‌ట‌.

ఇక ఈ సినిమాలో హీరోయిన్‌గా ప్ర‌భాస్ ప్రాజెక్ట్ కేలో న‌టిస్తోన్న బాలీవుడ్ బ్యూటీ దీపికా ప‌దుకొణెను తీసుకోవాల‌ని సంప్ర‌దింపులు చేస్తున్నార‌ట‌. ఈ సినిమా రెగ్యుల‌ర్ షూటింగ్ ను ప్ర‌శాంత్ నీల్ అక్టోబ‌ర్ నుంచి ప్లాన్ చేస్తున్నారు. అక్టోబ‌ర్ సెకండ్ వీక్‌ను ముహూర్తంగా నిర్ణ‌యించిన‌ట్టుగా తెలుస్తోంది. ఏదేమైనా ఎన్టీఆర్ – ప్ర‌శాంత్ నీల్ క‌లియిక అన‌గానే అంచాన‌లు నేష‌న‌ల్ లెవ‌ల్లో ఓ రేంజ్‌లో ఉన్నాయి.

ఎన్టీఆర్ మాస్ ఇమేజ్‌కు , ప్ర‌శాంత్ నీల్ మైండ్ బ్లోయింగ్ విజువ‌ల్స్ తోడైతే సినిమా మ‌రో కేజీయ‌ఫ్ రేంజ్‌లో ఉంటుంద‌ని అంచ‌నాలు ఉన్నాయి. ఇక కొర‌టాల త‌న సినిమా ఎప్పుడు సెట్స్ మీద‌కు తీసుకు వెళ్లి ఫినిష్ చేస్తాడో ? అన్న‌దే ఇప్పుడు ఉత్కంఠ‌గా ఉంది.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news