Movies2022లో గూగుల్లో సెర్చింగ్‌లో టాప్ ప్లేస్‌లో ఉన్న హీరోయిన్లు వీళ్లే...!

2022లో గూగుల్లో సెర్చింగ్‌లో టాప్ ప్లేస్‌లో ఉన్న హీరోయిన్లు వీళ్లే…!

మ‌న ఇండియ‌న్ సినీ ల‌వ‌ర్స్‌లో చాలా మంది హీరోల‌కు అభిమానులు ఉన్నా.. వాళ్ల‌లో చాలా మంది హీరోయిన్ల‌ను కూడా పిచ్చ‌గా అభిమానిస్తూ ఉంటారు. అయితే హీరోల‌పై వాళ్ల‌కు ఉన్న అభిమానం బ‌య‌ట క‌న‌ప‌డుతూ ఉంటుంది. హీరోయిన్ల‌పై అభిమానం బ‌య‌ట ఎక్స్‌ప్రెస్ చేసేందుకు ఛాన్స్ ఉండ‌దు. అయితే ప్ర‌స్తుత సోషల్ మీడియా యుగంలో హీరోయిన్ల‌కు సంబంధించిన ఇంట్ర‌స్టింగ్ విష‌యాల‌ను గూగుల్లో సెర్చ్ చేస్తూ ఉంటారు. హీరోయిన్లు ఏయే సినిమాల్లో న‌టిస్తున్నారు.. వాళ్ల స్పెష‌ల్‌, హాబీలు ఏంటి ? వాళ్ల ఏజ్ ఎంత ? వాళ్ల ఎఫైర్లు ఏంట‌న్న‌ది తెలుసుకునేందుకు ప్ర‌తి ఒక్క‌రికి ఆస‌క్తి ఉంటుంది. 2022 సంవ‌త్స‌రంలో తొలి ఆరు నెలల్లో మ‌న‌వాళ్లు ఎక్కువుగా ఏయే హీరోయిన్ల గురించి సెర్చ్ చేశారో తెలుసుకుందాం.

కాజ‌ల్ :
చంద‌మామ ముద్దుగుమ్మ కాజ‌ల్ పెళ్లి చేసుకుని ఓ బిడ్డ‌కు త‌ల్ల‌య్యాక కూడా క్రేజీ హీరోయ‌న్‌గానే ఉంటోంది. ఈ ముద్దుగుమ్మ గురించి ఈ యేడాది బాగా సెర్చ్ చేశారు. ఆమెకు గ‌తేడాది పెళ్ల‌వ్వ‌డం.. ఈ యేడాది బిడ్డ‌కు జ‌న్మ‌నివ్వ‌డంతో కాజ‌ల్ వార్త‌ల్లో ఉంది. ఎక్కువుగా సెర్చ్ చేసిన హీరోయిన్ల లిస్టులో కాజ‌ల్ 15వ స్థానంలో ఉంది.

స‌మంత :
నాగ‌చైత‌న్య‌తో విడాకుల త‌ర్వాత స‌మంత కెరీర్ ఓ రేంజ్‌లో ఉంది. అందులోనూ తెలుగులో శాకుంత‌లం, య‌శోద‌, ఖుషీ సినిమాల‌తో పాటు అటు బాలీవుడ్‌లో ఫ్యామిలీమ్యాన్ వెబ్‌సీరిస్ త‌ర్వాత స‌మంత రేంజ్‌, క్రేజ్ మామూలుగా లేదు. పైగా విడాకుల త‌ర్వాత హాట్‌గా క‌నిపించే విష‌యంలో స‌మంత ఏ మాత్రం వెన‌క్కు త‌గ్గ‌డం లేదు. దీంతో ఆమె అంటే ఇప్పుడు యూత్‌లో క్రేజ్ మ‌రింత పెరిగింది. ఈ యేడాది ఎక్కువ సెర్చింగ్ జ‌రిగిన లిస్టులో స‌మంత 18వ ర్యాంకులో ఉంది.

ర‌ష్మిక మంద‌న్న :
పుష్ప హిట్ అయ్యాక ర‌ష్మిక క్రేజ్ ఒక్క‌సారిగా నార్త్‌లో కూడా పెరిగిపోయింది. ఇప్పుడు ఆమె కోలీవుడ్‌లో స్టార్ హీరో విజ‌య్ ప‌క్క‌న న‌టిస్తోంది. అటు బాలీవుడ్ సినిమాలు చేస్తోంది. సౌత్‌లో ఫుల్ బిజీ హీరోయిన్ అయిపోయిన ర‌ష్మిక అటు నార్త్‌లోనూ క్రేజీ హీరోయ‌న్‌గా మారింది. టాప్ సెర్చింగ్ హీరోయిన్ల లిస్టులో ఆమెది ఈ యేడాది ఇప్ప‌టి వ‌ర‌కు 20వ ర్యాంకు.

న‌య‌న‌తార :
ఎట్ట‌కేల‌కు ఊరిస్తూ లేడీ సూప‌ర్‌స్టార్ న‌య‌న‌తార ఈ యేడాది త‌న ప్రియుడు, ద‌ర్శ‌కుడు అయిన విఘ్నేష్ శివ‌న్‌ను పెళ్లి చేసుకుంది. దీంతో న‌య‌న‌తార గూగుల్లో బాగా సెర్చింగ్‌లోకి వ‌చ్చింది. ఈ క్ర‌మంలోనే ఆమె 33వ ర్యాంక్ సొంతం చేసుకుంది.
త‌మ‌న్నా :
మిల్కీబ్యూటీ త‌మ‌న్నా ఈ యేడాది ఎఫ్ 3 సినిమాలో న‌టించింది. వ‌య‌స్సు పెరుగుతున్నా ఆమె వ‌న్నె ఏ మాత్రం త‌గ్గ‌డం లేదు. ఆమె ఈ యేడాది సౌత్ ఇండియ‌న్ స్టార్ హీరోయిన్స్ సెర్చింగ్‌లో 37వ స్తానంలో ఉంది.

పూజా హెగ్డే :
టాలీవుడ్‌, కోలీవుడ్‌, బాలీవుడ్ అన్న తేడా లేకుండా వ‌రుసగా స్టార్ హీరోల‌తో సినిమాలు చేస్తూ దూసుకుపోతోన్న పూజా హెగ్డే ఈ యేడాది సెర్చింగ్ ప‌రంగా టాప్ 44 ప్లేస్‌లో నిలిచింది. ఇక ముదురు ముద్దుగుమ్మ అయిన అనుష్క శెట్టి 57, మ‌హాన‌టి కీర్తిసురేష్ 62వ స్థానంలోనూ, ఇక దివంగ‌త అతిలోక సుంద‌రి శ్రీదేవి 75, ర‌కుల్‌ప్రీత్‌సింగ్ 91వ స్థానంలో ఉన్నారు.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news