Moviesప్ర‌గ‌తి ఆంటీతో క‌లిసి డ్యాన్స్ చేసిన ఈ అమ్మాయి ఎవ‌రో తెలుసా...

ప్ర‌గ‌తి ఆంటీతో క‌లిసి డ్యాన్స్ చేసిన ఈ అమ్మాయి ఎవ‌రో తెలుసా (వీడియో)

తెలుగు సినిమా రంగంలో ప్ర‌గ‌తి ఆంటీ గురించి ప్ర‌త్యేకంగా ప‌రిచ‌యం అక్క‌ర్లేదు. సీనియ‌ర్ హీరోల వ‌య‌స్సే ఉన్నా కూడా ప్ర‌గ‌తి ఆంటీ, అత్త‌, అమ్మ పాత్ర‌ల‌తో అల‌రిస్తోంది. ప్ర‌గ‌తి ఆంటీ తెర‌మీద గ‌య్యాలి పాత్ర‌లో క‌నిపిస్తూ హాట్ డైలాగుల‌తో చేసే ర‌చ్చ అయితే మామూలుగా ఉండ‌దు. ఎఫ్ 2, ఎఫ్ 3 సినిమాలో ఆమె త‌మ‌న్నా, మెహ్రీన్ లాంటి హీరోయిన్ల‌కు అమ్మ‌గా.. వెంకీ, వ‌రుణ్‌గా అత్త‌గా చేసిన సంద‌డి అంతా ఇంతా కాదు. ఇంత వ‌య‌స్సు వ‌చ్చినా కూడా ప్ర‌గ‌తి ఆంటీ త‌న డ్యాన్సుల‌తో సోష‌ల్ మీడియాను ఎప్పుడూ హీటెక్కిస్తూ ఉంటుంది.

అస‌లు ప్ర‌గ‌తి ఆంటీ జిమ్ వ‌ర్క‌వుట్లు, డ్యాన్సులు.. ఆమె ఊపుళ్లు మామూలుగా ఉండ‌వు. స్టార్ హీరోయిన్లే అసూయ ప‌డేంత‌గా ఆమె సోష‌ల్ మీడియా పోస్టులు, వీడియోలు ఉంటాయి. కాస్త స‌న్న‌బ‌డితే సీనియ‌ర్ హీరోల ప‌క్క‌న హీరోయిన్‌గా అయినా చేసేయొచ్చు అన్న‌ట్టుగా ఆమె త‌న ఫిజిక్ మెయింటైన్ చేస్తుంది. ప్ర‌గ‌తి తాజాగా త‌న ఇన్‌స్టా గ్రామ్‌లో ప్ర‌ముఖ బాలీవుడ్ సింగ‌ర్‌, ర్యాప‌ర్ బాద్ షా ఊడూ అనే ట్రెండింగ్ సాంగ్‌కు డ్యాన్స్ చేసింది.

ఈ వీడియోలో ప్ర‌గ‌తితో పాటు మ‌రో యువ‌తి కూడా డ్యాన్స్ చేసింది. చాలా అందంగా కూడా ఉంది. ఈ అమ్మాయిని చూసిన నెటిజ‌న్లు ఆమె ప్ర‌గ‌తి ఆంటీ కూతురే అనుకున్నారు. ఈ ఇద్ద‌రూ వేసిన స్టెప్పులను చూసిన నెటిజ‌న్లు ఆ యువ‌తి కంటే ప్ర‌గ‌తి ఆంటీయే బాగా డ్యాన్స్ చేసింద‌ని కూడా కామెంట్లు చేశారు. అయితే అంద‌రూ అనుకున్న‌ట్టుగా ఆమె ప్ర‌గ‌తి కూతురు కాదు.. ఈమె త‌మిళ అమ్మాయి. ఆమె పేరు స్నేహా ముర‌ళీ.

త‌మిళ‌, క‌న్న‌డ ఇండ‌స్ట్రీలో బాగా పాపుల‌ర్ అయిన న‌టి జ‌యా ముర‌ళీ కుమార్తే ఈ స్నేహా ముర‌ళీ. స్నేహ‌తో క‌లిసి ప్ర‌గ‌తి ఆంటీ చేసిన వీడియో ఇప్పుడు నెట్టింట్లో బాగా వైర‌ల్ అవుతోంది. ఈ వీడియోపై మీరు కూడా ఓ లుక్కేయండి.

 

 

View this post on Instagram

 

A post shared by Sneha Murali (@snehamuralii)

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news