Moviesఇండస్ట్రీకి మరో వారసుడు రాబోతున్నాడోచ్..తల్లి కాబోతున్న ఆ స్టార్ హీరోయిన్..?

ఇండస్ట్రీకి మరో వారసుడు రాబోతున్నాడోచ్..తల్లి కాబోతున్న ఆ స్టార్ హీరోయిన్..?

యస్..తాజాగా బాలీవుడ్ మీడియా లో ప్రసారమౌవుతున్న కధనాల ప్రకారం..బాలీవుడ్ హాట్ బ్యూటీ దీపిక పదుకునే ప్రెగ్నెంట్ గా తెలుస్తుంది. ఈ మధ్యనే స్టార్ హీరోయిన్ అలియా భట్ గర్భవతిని అంటూ..”త్వరలోనే మా బేబీ వస్తుందంటూ” పోస్ట్ చేసి అభిమానులకు షాకిచ్చింది. పెళ్ళైన రెండు నెలలకు ప్రెగ్నెంట్ ఏంటి రా బాబు అని అందరు బుర్రలు పీకున్నా..ఈ రోజుల్లో ఇలాంటివి కామన్ అంటూ..అలియాకి కంగ్రాట్స్ చెప్పుకొచ్చారు.

అయితే, తాజాగా బాలీవుడ్ సుందరిమణి దీపిక పదుకునే గర్భం దాల్చిన్నట్లు బాలీవుడ్ మీడియాలో కధనాలు ప్రసారమవుతున్నాయి. బాలీవుడ్‌లో వన్ ఆఫ్ ది స్టార్ కపుల్స్ గా ఉన్న రణ్‌వీర్ సింగ్, దీపికా పదుకొనే ప్రేమించి పెళ్ళి చేసుకున్న సంగతి తెలిసిందే. చాలాకాలం గుట్టుచప్పుడు కాకుండా ప్రేమాయణం నడిపిన ఈ జంట వన్ ఫైన్ డే అందరిముందు పెళ్లి చేసుకోబోతున్నాం అంటూ ఓపెన్ అయిపోయారు. ఆ తర్వాత కొన్ని రోజులకే అంటే 2018లో ఈ జంట వివాహ బంధంతో ఒక్కటైయ్యారు.

ఆ రోజుల్లోనే వీళ్ల పెళ్లి అంగరంగ వైభవంగా జరిగింది. అబ్బో..అప్పట్లో ఎక్కడ చూసిన వీళ్లకు సంబంధించిన వార్తలే కనిపించాయి. ప్ర‌స్తుతం వీరిద్ద‌రి ప‌ర్స‌న‌ల్ లైఫ్‌,ప్రొఫెష‌న‌ల్ లైఫ్ చాలా సాఫీగా న‌డుస్తుంది. ఇక రణ్‌వీర్ పలు బడా సినిమా ప్రాజెక్టులతో బిజీ బిజీగా ఉండగా.. ఆయన భార్య దీపికా కూడా సినిమాలో నటిస్తూ టాప్ ప్లేస్ లో ఉంది.

తెలుగులో యంగ్‌ రెబెల్ స్టార్ ప్రభాస్ సరసన, నాగ్‌ అశ్విన్ డైరెక్షన్‌లో రూపొందుతున్న ప్రాజెక్ట్ K అనే భారీ పాన్ ఇండియా ప్రాజెక్ట్‌లో కూడా నటిస్తోంది. అయితే ఇప్పుడు దీపిక ప్రెగ్నెంట్ అంటూ రకరకాల వార్తలు స్ప్రెడ్ అవుతుండటంతో ..ప్రభాస్ అభిమానులు టెన్షన్ పడుతున్నారు. దీపిక ప్రెగ్నెంట్ అని ఆమె స్నేహితురాలు అయిన డాక్టర్ ద్వారా బయటకు వచ్చిన్నత్లు తెలుస్తుంది. మొత్తానికి దీపిక ప్రెగ్నేంట్ అయ్యిందో లేదో తెలియదు కానీ..సోషల్ మీడియాలో మాత్రం ఈ విషయం పెద్ద హాట్ టాపిక్ గా మారింది.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news