MoviesNBK 108 బాల‌య్య‌కు జోడీగా ఆ మ‌ళ‌యాళ ముద్దుగుమ్మ‌ను ఫిక్స్ చేసిన...

NBK 108 బాల‌య్య‌కు జోడీగా ఆ మ‌ళ‌యాళ ముద్దుగుమ్మ‌ను ఫిక్స్ చేసిన అనిల్ రావిపూడి..!

బాల‌య్య బాబు అఖండ సినిమా జోష్‌తో ఇప్పుడు మ‌లినేని గోపీచంద్ ద‌ర్శ‌క‌త్వంలో త‌న 107వ సినిమా చేస్తున్నాడు. ఈ సినిమా ద‌సరాకు రెడీ కావ‌చ్చు. ఆ వెంట‌నే బాల‌య్య 108వ సినిమా అనిల్ రావిపూడితో ఉంటుంది. ఈ సినిమా ప్రీ ప్రొడ‌క్ష‌న్ ప‌నుల్లో బిజీగా ఉన్న అనిల్ కాస్టింగ్‌ను కూడా ఎంపిక చేసే ప‌నిలో ఉన్నాడు. బాల‌య్య‌కు జోడీగా ముదురు ముద్దుగుమ్మ ప్రియ‌మ‌ణి పేరు ముందుగా వినిపించింది.

అనిల్ రావిపూడి ఇప్పుడు మామూలు ఫామ్‌లో లేడు. ఒక‌టి కాదు రెండు కాదు ఆరు వ‌రుస హిట్లు. ఎఫ్ 3 ఇచ్చిన జోష్‌తో ఇప్పుడు ఏకంగా బాల‌య్య‌తోనే సినిమా చేస్తున్నాడు. బాల‌య్య‌తో సినిమా చేయాల‌న్న‌ది అనిల్ రావిపూడికి నాలుగేళ్లుగా ఉన్న కోరిక‌. అందుకే ఈ సారి త‌న జాన‌ర్‌కు భిన్నంగా యాక్ష‌న్ క‌ల‌బోత‌తో స్క్రిఫ్ట్ రెడీ చేశాడ‌ట‌. ఈ విష‌యాన్ని అనిల్ కూడా చెప్పారు.

ఈ సినిమాలో బాల‌య్య 55 ఏళ్లు పై బ‌డిన వ‌య‌స్సు ఉన్న వ్య‌క్తిగా క‌నిపించ‌బోతున్నాడు. ఆయ‌న కుమార్తెగా యంగ్ హీరోయిన్ శ్రీలీల పేరు క‌న్‌ఫార్మ్ చేశారు. ఇక ఇప్పుడు హీరోయిన్‌గా మ‌ళ‌యాళ ముద్దుగుమ్మ హానీరోజ్‌ను ఫిక్స్ చేశార‌ని అంటున్నారు. మెయిన్ హీరోయిన్ ఎవ‌ర‌న్న‌ది క్లారిటీ అయితే లేదు. ముందు ప్రియ‌మ‌ణి అన్నారు.. ఇప్పుడు మిల్కీబ్యూటీ త‌మ‌న్నా పేరు కూడా వినిపిస్తోంది. సెకండ్ హీరోయిన్‌గా హానీ రోజ్ క‌న్‌ఫార్మ్ అని టాక్ ?

హానీ రోజ్ ప్ర‌స్తుతం మ‌ల్లూవుడ్‌లో క్రేజీ హీరోయిన్‌. ఆమె తెలుగు, త‌మిళ‌, మ‌ళ‌యాళ భాష‌ల్లో ఎన్నో హిట్ సినిమాల్లో న‌టిస్తోంది. సినిమాలో ఆమె పాత్ర‌కు ఎంతో ప్రాధాన్య‌త ఉంటుంద‌ని.. అనిల్ రావిపూడి ప‌ట్టుబ‌ట్టి మ‌రీ ఆమెనే చాయిస్‌గా తీసుకున్న‌ట్టు తెలుస్తోంది. బాల‌య్య‌తో క్రేజీ ఛాన్స్ కొట్టేసిన హానీరోజ్‌కు హిట్ ప‌డితే ఇక తిరుగు ఉండ‌దు. తెలుగులో వ‌రుస అవ‌కాశాలు క్యూ క‌ట్ట‌డం ఖాయం.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news