Moviesమ‌న స్టార్ హీరోయిన్ల రెమ్యున‌రేష‌న్లు ఇవే... నిర్మాత‌ల‌కు చుక్క‌లే...!

మ‌న స్టార్ హీరోయిన్ల రెమ్యున‌రేష‌న్లు ఇవే… నిర్మాత‌ల‌కు చుక్క‌లే…!

మ‌న సౌత్ సినిమా ఇండ‌స్ట్రీ ఇప్పుడు ఇండియ‌న్ బాక్సాఫీస్‌ను షేక్ చేస్తోంది. తెలుగుతో పాటు త‌మిళం… అటు కేజీయ‌ఫ్ దెబ్బ‌తో క‌న్న‌డ సినిమాలు అంటేనే బాలీవుడ్ వాళ్లు భ‌య‌ప‌డుతున్నారు. మ‌న సౌత్ సినిమాలు నార్త్‌లో మంచినీళ్లు తాగినంత సులువుగా రు. 100 కోట్లు కొల్ల‌గొడుతుంటే నార్త్ స్టార్ హీరోల సినిమాలు రు. 100 కోట్ల కోసం ముక్కుతూ మూలుగుతున్న ప‌రిస్థితి.

ఇక సౌత్ సినిమాలు ఇప్పుడు పాన్ ఇండియా సినిమాలుగా రూపాంత‌రం చెందుతున్నాయి. ఈ క్ర‌మంలోనే సౌత్ ఫిల్మ్ మేకర్స్ ఇప్పుడు కాస్టింగ్‌, బ‌డ్జెట్ విష‌యంలో రాజీ ప‌డ‌డం లేదు. మ‌న సౌత్ సినిమాల్లో పాన్ ఇండియా అప్పీల్ కోసం స్టార్ హీరోయిన్ల‌నే పెడుతున్నారు. దీంతో హీరోయిన్లు కొండెక్కేస్తున్నారు. భారీ రెమ్యున‌రేష‌న్లు డిమాండ్ చేస్తున్నారు. ఏయే హీరోయిన్లు భారీ రెమ్యున‌రేష‌న్లు తీసుకుంటున్నారు.. వారెవ‌రో ఓ లుక్కేద్దాం.

1 – నయనతార :
సౌత్ ఇండియ‌న్ లేడీ సూప‌ర్‌స్టార్ న‌య‌న‌తార తాజాగా ద‌ర్శ‌కుడు విఘ్నేష్ శివ‌న్‌ను పెళ్లి చేసుకుంది. ప్ర‌స్తుతం జ‌యం ర‌వితో ఓ సినిమా చేస్తోంది. ఇవి కాక మ‌రో మూడు సినిమాలు కూడా ఆమె చేతిలో ఉన్నాయి. ఇప్పుడు ఆమె ఒక్కో సినిమాకు రు. 6 – 8 కోట్ల రెమ్యున‌రేష‌న్ తీసుకుంటోంది. పైగా సినిమా షూటింగ్‌ల వ‌ర‌కే ప్ర‌మోష‌న్ల‌కు కూడా రాదు.

2- సమంత రుత్ ప్రభు :
ఇటు నాగ‌చైత‌న్య‌కు విడాకులు ఇచ్చేశాక సౌత్ టు అటు బాలీవుడ్‌లో వ‌రుస పెట్టి సినిమాలు చేస్తోన్న స‌మంత లేడీ ఓరియంటెడ్ సినిమాల‌తో పాటు వెబ్ సీరిస్‌లు కూడా చేస్తోంది. పుష్ప‌లో ఐటెం సాంగ్‌తో రెచ్చిపోయిన స‌మంత ఇప్పుడు విజ‌య్ దేవ‌ర‌కొండ‌కు జోడీగా శివ నిర్వాణ ద‌ర్శ‌క‌త్వంలో ఖుషీ సినిమా చేస్తోంది. ప్ర‌స్తుతం స‌మంత ఇంత వ‌య‌స్సులో అది కూడా పెళ్ల‌య్యి.. విడాకులు తీసుకుని కూడా ఒక్కో సినిమాకు రు. 3 కోట్లు తీసుకుంటోంది.

3 – పూజా హెగ్డే :
మోడల్‌గా కెరీర్ స్టార్ట్ చేసిన పూజా హెగ్డే ఇప్పుడు సౌత్ సినిమా ఇండ‌స్ట్రీలో లీడింగ్ హీరోయిన్ అయిపోయింది. సౌత్‌లో స్టార్ హీరోలు అంద‌రి స‌ర‌స‌న జోడీ క‌ట్టిన ఈ ముద్దుగుమ్మ ఇప్పుడు రెండో రౌండ్ వేసుకుంటూ పోతోంది. ప్ర‌స్తుతం విజ‌య్ దేవ‌ర‌కొండ ప‌క్క‌న జనగణమన సినిమా చేస్తోంది. ఆమె డిమాండ్ ఎక్కువుగా ఉండ‌డంతో ఒక్కో సినిమాకు రు. 5 కోట్లు అడుగుతోంద‌ట‌.

4 – రకుల్ ప్రీత్ సింగ్ :
సౌత్‌లో అత్యధిక పారితోషికం అందుకునే హీరోయిన్స్‌లో రకుల్ ప్రీత్ సింగ్ ఒకరు. ఆమె సౌత్ నుంచి నార్త్ వ‌ర‌కు అన్ని భాష‌ల్లోనూ న‌టిస్తోంది. కాల్షీట్ల‌ను బ‌ట్టి ర‌కుల్ సినిమాకు రెమ్యున‌రేష‌న్లు మారుస్తోంది. ఒక్కో సినిమాకు ఆమె రు. 3 కోట్లు తీసుకుంటోంది. క‌థ బాగుంటే.. ద‌ర్శ‌కుడు, హీరోను బ‌ట్టి కాస్త త‌గ్గించుకోవ‌డానికి కూడా ర‌కుల్ ఓకే చెపుతోంద‌ట‌.

5 – తమన్నా భాటియా :
తమన్నా చాలా యంగ్ ఏజ్‌లోనే సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చింది. మిల్కీబ్యూటీగా దూసుకుపోతోన్న ఆమె ఇప్పుడు స్టార్ హీరోలు, సీనియ‌ర్ హీరోల‌కు మంచి ఆప్ష‌న్‌గా మారింది. మూడున్న‌ర ప‌దుల వ‌య‌స్సులో కూడా ఆమె ఒక్కో సినిమాకు రు. 3 కోట్లు ముక్కుపిండి వ‌సూలు చేస్తోంది. రెమ్యున‌రేష‌న్ విష‌యంలో మాత్రం త‌మ‌న్నా త‌గ్గేదేలే అంటోంది.

6 – రష్మిక మందన్న :పుష్ప సినిమాతో రష్మిక మందన్న క్రేజ్ అమాంతం పెరిగిపోయింది. ఇప్పుడు బాలీవుడ్ సినిమాలు కూడా చేస్తోంది. ప్ర‌స్తుతం ఆమె ఒక్కో సినిమాకు రూ. 3కోట్లను రెమ్యూనరేషన్‌గా తీసుకుంటుంది.


7 – అనుష్క శెట్టి :
బాహుబలి సీరిస్ సినిమాల‌తో ప్రపంచవ్యాప్తంగా అభిమానులను సంపాదించుకున్న అనుష్క‌కు ఇప్పుడు క్రేజ్ త‌గ్గినా ముద‌రు వ‌య‌స్సు వ‌చ్చేసినా కూడా ఒక్కో సినిమాకు రు. 3 కోట్లు చార్జ్ చేస్తోంద‌ట‌.

8- కీర్తి సురేష్ :
కుటుంబ కథా చిత్రాలకు ఎక్కువగా ప్రాధాన్యం ఇచ్చే లేడీ ఓరియంటెడ్‌, ఓటీటీ సినిమాల‌తో కాస్త క్రేజ్ త‌న‌కు తానే త‌గ్గించుకుంది. అయితే స‌ర్కారు వారి పాట సినిమాతో స్వింగ్‌లోకి వ‌చ్చిన ఆమె ఒక్కో సినిమాకు రు. 2 కోట్లు తీసుకుంటోంది. కీర్తికి క‌థ న‌చ్చితే రెమ్యున‌రేష‌న్ పెద్ద ప‌ట్టింపు కాదంటారు.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news