Moviesఫస్ట్ టైం బ్యాడ్ గా ట్రోల్ అవుతున్న సాయి పల్లవి..కాంట్రవర్షీయల్ కామెంట్స్...

ఫస్ట్ టైం బ్యాడ్ గా ట్రోల్ అవుతున్న సాయి పల్లవి..కాంట్రవర్షీయల్ కామెంట్స్ వైరల్..!!

నిన్న మొన్నటి వరకు సాయి పల్లవి కత్తి, తురుము, తోపు అంటూ ఓ రేంజ్ లో పొగిడేసిన జనాలే ఇప్పుడు ఆమెను నెట్టింట ట్రోల్ చేస్తున్నారు. దానికి కారణం ఆమె చేసిన కాంట్రవర్షీయల్ కామెంత్స్ చేయడమే అని తెలుస్తుంది. ఇప్పటి వరకు సినిమాలో బయట ఓ మాట బ్యాడ్ గా అనిపించుకోని సాయి పల్లవి..ఇప్పుడు ఇలా నెట్టింట ట్రోల్ అవ్వడం హాట్ టాపిక్ గా మారింది. విరాటపర్వం సినిమా ప్రమోషన్స్ లో భాగంగా ఫుల్ బిజీ గా మారిపోయింది సాయి పల్లవి.

ఈ క్రమంలోనే వరుస ఛానెల్స్ కి ఇంటర్వ్యులు ఇస్తూ..సినిమా పై ఎక్స్ పెక్టేషన్స్ పీక్స్ కి వెళ్ళేలా చేస్తుంది. కాగా, రీసెంట్ గా ఓ ఇంటర్వుల్లో మాట్లాడుతూ..సినిమా గురించిన అంశాలను మాట్లాదుతూనే…కాంట్రవర్షీ కామెంట్స్ చేసింది. దీంతో సాయిపల్లవి ని ఓ ఆట ఆదేసుకుంటున్నారు కొందరు నెటిజన్స్. తాజాగా ఓ ఇంటర్వ్యూలో కశ్మీర్ పండిట్ల మారణహోమం, గో హత్యలను లింక్ చేసి మాట్లాడింది. దీంతో అసలు వివాదం మొదలైంది.

విరాట పర్వంలో తన పాత్ర గురించి చెప్పుతూ..నక్సల్స్ గురించి మాట్లాడుతూ.. అలా టాపిక్ డైవర్ట్ అయ్యి..అది కాస్తా కశ్మీర్ ఫైల్స్ సినిమా వైపు గో హత్యల మీదకు వచ్చింది. సాయి పల్లవి మాట్లాడుతూ.. “వాళ్లది ఒక ఐడియాలజీ.. మనకు శాంతి అనేది ఓ ఐడియాలజి. నాకు వయలెన్స్ అనేది తప్పుగా అనిపిస్తుంది. న్యూట్రల్ గా ఆలోచించడం నేర్చుకోవాలి. ఏ విషయంలోనూ ఏవరిదీ పూర్తిగా తప్పు అని చెప్పలేం. పాకిస్థాన్ లో ఉన్న వాళ్లకి మన జవాన్లు టెర్రరిస్ట్ లా కనిపిస్తున్నారు. మనకు వాళ్లు కూడా అలానే కనిపిస్తారు. ఏదీ తప్పు ఏది ఒప్పు అని చెప్పడం కష్టం.

కాశ్మీర్ ఫైల్స్ లో కశ్మీర్ పండిట్లను ఎలా చంపారో చూపించారు కదా?. మరి రీసెంట్‌గా బండిలో ఆవుని తీసుకెళ్తున్న డ్రైవర్ ముస్లింగా ఉన్నాడు అని కొంత మంది కొట్టేసి జై శ్రీరామ్ జై శ్రీరామ్ అన్నారు. మరి అప్పుడు జరిగిన దానికి ఇప్పుడు జరిగిన దానికి తేడా ఎక్కడ ఉంది.. నేను నమ్మేది ఒక్కతేఅ మతాలుకాదు మనం మంచి వ్యక్తిగా ఉంటే.. ఇతరులను బాధించం.. లెఫ్టిస్ట్ అయినా రైటిస్ట్ అయినా మనం మంచిగా ఉండకపోతే న్యాయం ఎక్కడా ఉండదు..” అని సాయి పల్లవి చెప్పుకొచ్చింది. దీంతో కొందరు సాయి పల్లవి మాటలను తప్పు బడుతూ ఆమె సినిమా ‘విరాట పర్వం’ సినిమాను చూడబోమంటూ నెట్టింట బహిరంగంగా ప్రకటన చేస్తున్నారు. #BycottSaipallavi, #BycottVirataparvamఅనే హ్యాష్ ట్యాగ్స్ తో ట్విటర్ లో వార్ చేస్తున్నారు. ఇది పరిస్థితి ఎంతవరకు వెళ్తుందో చూడాలి.

 

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news