Moviesబాల‌య్య బ‌స‌వ‌తార‌కం హాస్ప‌ట‌ల్‌కు అరుదైన రికార్డ్‌... దేశంలోనే బెస్ట్ సెకండ్ హాస్ప‌ట‌ల్‌..!

బాల‌య్య బ‌స‌వ‌తార‌కం హాస్ప‌ట‌ల్‌కు అరుదైన రికార్డ్‌… దేశంలోనే బెస్ట్ సెకండ్ హాస్ప‌ట‌ల్‌..!

దివంగ‌త ఎన్టీఆర్ భార్య నంద‌మూరి బ‌స‌వ తార‌కం క్యాన్స‌ర్ హాస్ప‌ట‌ల్ ఓ అరుదైన జ్ఞాప‌కం. ఎన్టీఆర్ భార్య బ‌వ‌స‌తార‌కం క్యాన్స‌ర్‌తో మృతిచెందారు. ఆమెకు గ‌ర్భాశ‌య క్యాన్స‌ర్ రావ‌డంతో మృతిచెందారు. ఆమె చివ‌రి కోరిక మేర‌కు ఈ క్యాన్స‌ర్ హాస్ప‌ట‌ల్ స్థాపించి ఎంతోమంది నిరుపేద‌లు, మ‌ధ్య‌, దిగువ త‌ర‌గ‌తి వ‌ర్గాల వారికి క్యాన్స‌ర్ చికిత్స ఎంతో అత్యున్న‌త ప్ర‌మాణాల‌తో అందిస్తున్నారు. బ‌స‌వ‌తార‌కం ట్ర‌స్ట్ ద్వారా ఏర్పాటు అయిన ఈ ఆసుప‌త్రికి చైర్మ‌న్‌గా నంద‌మూరి బాలృష్ణ వ్య‌వ‌హ‌రిస్తున్నారు. క్యాన్స‌ర్ భారీన ప‌డి జీవిత చ‌ర‌మాంకంలో ప‌డిన ఎంతోమందికి ఈ హాస్ప‌ట‌ల్ వైద్యులు పున‌ర్జ‌న్మ ఇచ్చారు.

 

క్యాన్స‌ర్ బాధితుల‌కు అత్యున్న‌త ప్ర‌మాణాల‌తో కూడిన వైద్యం అందిస్తుండ‌డంతో ఈ హాస్ప‌ట‌ల్‌కు దేశంలోనే బెస్ట్ క్యాన్స‌ర్ హాస్ప‌ట‌ల్స్‌లో 2వ స్థానం ల‌భించింది. తాజాగా ఈ క్యాన్స‌ర్ హాస్ప‌ట‌ల్‌ 22 వ‌సంతాలు పూర్తి చేసుకుంది. 22వ వార్షికోత్స‌వం సంద‌ర్భంగా హాస్ప‌ట‌ల్లో తాజాగా వార్షికోత్స‌వ వేడుక‌లు నిర్వ‌హించారు. ఈ వేడుక‌ల్లో తెలంగాణ వైద్య ఆరోగ్య శాఖా మంత్రి హ‌రీష్‌రావు, ఖ‌మ్మం ఎంపీ నామా నాగేశ్వ‌ర‌రావు పాల్గొన్నారు.

ఈ సంద‌ర్హంగా హ‌రీష్‌రావు మాట్లాడుతూ ప్ర‌జ‌ల‌కు సేవ చేసే ఇలాంటి హాస్ప‌ట‌ల్స్‌కు ప్ర‌భుత్వ స‌హ‌కారం ఎప్పుడూ ఉంటుంద‌ని హాస్ప‌ట‌ల్ మేనేజ్‌మెంట్‌కు శుభాకాంక్షలు తెలిపారు. ఈ క్ర‌మంలోనే ఈ హాస్ప‌ట‌ల్ చైర్మ‌న్ నంద‌మూరి బాల‌కృష్ణ‌పై సైతం హ‌రీష్‌రావు ఆస‌క్తిక‌ర వ్యాఖ్య‌లు చేశారు. బాల‌య్య మ‌నిషి క‌రుకుగా ఉన్నా కూడా మ‌న‌స్సు మెత్త‌ని అని మెచ్చుకున్నారు.

అనంత‌రం బాల‌కృష్ణ మాట్లాడుతూ బ‌వ‌స‌తార‌కం హాస్ప‌ట‌ల్ సాధించిన విజ‌యాల‌ను వివ‌రించారు. రెండు తెలుగు రాష్ట్రాల్లో ఎక్కువ మంది ఆరోగ్య శ్రీ కింద ట్రీట్‌మెంట్ చేయించుకున్న హాస్ప‌ట‌ల్ ఇదే అని బాల‌య్య చెప్పారు. వంద ప‌డ‌క‌ల సామ‌ర్థ్యంతో ప్రారంభ‌మైన ఈ హాస్ప‌ట‌ల్ ఇప్పుడు 600 ప‌డ‌క‌ల హాస్ప‌ట‌ల్‌గా రూపాంత‌రం చెందింద‌న్నారు.

ఈ హాస్ప‌ట‌ల్‌ను నంద‌మూరి తార‌క రామారావు ప్రారంభించారు.. అట‌ల్ బిహార్ వాజ్‌పేయ్ చేతుల మీదుగా దీనిని ప్రారంభించామ‌న్నారు. ఇక ఈ హాస్ప‌ట‌ల్‌కు దేశంలోనే బెస్ట్ క్యాన్స‌ర్‌ ట్రీట్‌మెంట్ హాస్ప‌ట‌ల్స్‌లో 2వ స్థానంలో ఉండ‌డం అంటే నిజంగా అటు చైర్మ‌న్ బాలయ్య‌కు మాత్ర‌మే కాదు.. మ‌న తెలుగు వారంద‌రికి గ‌ర్వ‌కార‌ణం. ఇక ఈ హాస్ప‌ట‌ల్స్‌కు తెలుగు వాళ్ల నుంచే కాకుండా.. జాతీయ‌, అంత‌ర్జాతీయ స్థాయిలో భారీఎత్తున విరాళాలు సేక‌రించ‌డంలో బాల‌య్య చేసిన కృషి అమోఘం.. అద్భుతం.

త‌న త‌ల్లి చివ‌రి కోరిక మేర‌కు ఆమెలా ఎవ్వ‌రూ క్యాన్స‌ర్‌తో చ‌నిపోకూడ‌ద‌న్న సంక‌ల్పంతో బాల‌య్య మొక్కోవ‌ని సంక‌ల్పంతో దీనిని నిర్వ‌హిస్తున్నారు. ఏదేమైనా ఈ విష‌యంలో మాత్రం బాల‌య్య‌ను వేన్నోళ్ల మెచ్చుకోవాల్సిందే..!

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news