Movies"వారియర్" కోసం కృతి పుచ్చుకున్న పారితోషకం తెలిస్తే..కళ్లు జిగేల్..?

“వారియర్” కోసం కృతి పుచ్చుకున్న పారితోషకం తెలిస్తే..కళ్లు జిగేల్..?

ప్రస్తుతం సినీ ఇండస్ట్రీలో అదృష్ట దేవతగా మారిపోయింది ఈ కన్నడ బ్యూటీ కృతి శెట్టి. పేరు కి కన్నడ అమ్మాయి అయినా ట్రెడిషనల్ లుక్ లో అచ్చం తెలుగింటి అమ్మాయిలా..కనిపిస్తుంది. చూడటానికి సైలెంట్ గా ఉండే ఈ పాప..యాక్షన్ చెప్పగానే మాత్రం ఆ పాత్రలోకి పరకాయ ప్రవేశం చేసేస్తుంది. మెగా మేనల్లుడు వైష్ణవ్ తో ఉప్పెన సినిమాతో హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చిన ఈ ముద్దు గుమ్మ..ఆ తరువాత వరుస హిట్లతో టాప్ హీరోయిన్ పోజీషన్ లోకి వెళ్లిపోయింది.

ప్రజెంట్ టాలీవుడ్, కోలీవుడ్ లో సినిమాలు చేస్తున్న ఈ బ్యూటీ..సింగం హీరో సూర్య సినిమాలో నటించే ఛాన్స్ కొట్టేసింది. ఇండస్ట్రీకి వచ్చిన అతి తక్కువ టైంలోనే స్టార్ హీరో సూర్య పక్క నటించడం అంటే మాములు విషయం కాదు. ఇప్పటికి బిగ్ స్టార్స్ హీరోయిన్లు ఆయనతో నటించే అవకాశం కోసం ఎదురు చూస్తుంటారు. కాగా, కృతిశెట్టి నటించిన సినిమా “ది వారియర్” రిలీజ్ కు సిద్ధంగా ఉంది. ఎనర్జిటిక్ హీరో రామ్ పోతినేని పవర్ ఫుల్ పోలీస్ ఆఫీసర్ పాత్రలో నటిస్తున్న ఈ మూవీకి తమిళ దర్శకుడు లింగు స్వామి దర్శకత్వం వహిస్తున్నారు.

అంతేకాదు పవర్ ఫుల్ విలన్ పాత్రలో విలక్షణ నటుడు ఆదిపినిశెట్టి కనిపించనున్నారు. ఇప్పటికే ఈ సినిమా నుంచి విడుదలైన పోస్టర్స్ , బుల్లెట్ సాంగ్ ప్రేక్షకులను విపరీతంగా కట్టుకుంది. ఈ చిత్రంలో రామ్ సరసన మొదటి సారిగా హీరోయిన్ గా నటిస్తున్న కృతి శెట్టి ..ఈ ప్రాజెక్ట్ కోసం అక్షరాల 2 కోట్లు పారితోషకంగా తీసుకుందట. నిజానికి సమంత,కీర్తి సురేష్ లాంటి బడా హీరోయిన్స్ నే 3 కోట్లు తీసుకుంటున్నారు అన్న టాక్ వినిపిస్తుంది.

అలాంటిది..కేవలం మూడు సినిమాలు చేసి కృతి ఇంత రెమ్యూనరెషన్ తీసుకుంటుందంటే..మరో రెండు సినిమాలు హిట్ అయితే..3, 4 కోట్లు తీసుకునేస్తుంది అంటున్నారు సినీ విశ్లేషకులు. పవన్ కుమార్ సమర్పణలో శ్రీనివాసా సిల్వ‌ర్ స్క్రీన్ పతాకంపై ప్రొడ‌క్ష‌న్ నెం. 6గా శ్రీనివాసా చిట్టూరి ఈ సినిమాను నిర్మిస్తున్నారు.ఇటీవ‌లే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ చిత్రం జూలై 14న విడుద‌ల కానుంది.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news