Moviesహీరోయిన్ ' సాయిప‌ల్ల‌వి ' బ్యాక్‌గ్రౌండ్ తెలిస్తే క‌ళ్లుబైర్లు క‌మ్మి.. రోమాలు...

హీరోయిన్ ‘ సాయిప‌ల్ల‌వి ‘ బ్యాక్‌గ్రౌండ్ తెలిస్తే క‌ళ్లుబైర్లు క‌మ్మి.. రోమాలు నిక్క‌పోడ‌వాల్సిందే..!

టాలీవుడ్‌లో లేదా సౌత్ సినిమా ఇండ‌స్ట్రీలో ఇప్పుడున్న హీరోయిన్ల‌లో హీరోల‌తో పోటీప‌డుతూ న‌టించే హీరోయిన్ల లిస్ట్ చూస్తే అందులో ఇద్ద‌రి పేర్లు ప్ర‌ధానంగా వినిపిస్తాయి. అందులో ఒక‌రు కీర్తి సురేష్‌.. రెండు సాయిప‌ల్ల‌వి. ఫిదా లాంటి సినిమాతో సాయిప‌ల్ల‌వి, మ‌హాన‌టి సినిమాతో కీర్తి సురేష్ హీరోలను మించేలా త‌మ న‌ట‌న ఉంటుంద‌ని చెప్ప‌క‌నే చెప్ప‌డంతో పాటు ఈ త‌రం జ‌న‌రేష‌న్ హీరోయిన్ల‌కు ఓ బెంచ్ మార్క్ సెట్ చేశారు.

సాయిప‌ల్ల‌వితో న‌టించేందుకు ఇప్పుడు ఎంతోమంది హీరోలు వెయిటింగ్‌లో ఉన్నాడు. ఆమెకంటూ స‌ప‌రేట్ ఇమేజ్ క్రియేట్ అయ్యింది. సౌత్ ఇండియాలో అన్ని భాష‌ల్లోనూ ఆమెకంటూ స‌ప‌రేట్ ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. ఇక సాయిప‌ల్ల‌వి ఫ్యామిలీ, వాళ్ల బ్యాక్‌గ్రౌండ్ చూస్తే క‌ళ్లు బైర్లు క‌మ్మాల్సిందే. సాయిప‌ల్ల‌వి వాళ్లు బ‌డ‌గ సామాజిక వ‌ర్గానికి చెందిన వారు. ఈ జాతి ప్ర‌జ‌లు త‌మిళ‌నాడు, కేర‌ళ స‌రిహ‌ద్దుల్లో ఉన్న కొండ‌జాతి ప్ర‌జ‌లు అట‌.

వీరు మంచి పోరాట యోధులు. ఈ జాతి ప్ర‌జ‌లు టిప్పుసుల్తాన్ సైన్యంలో ప‌నిచేసి శ‌త్రువుల‌పై పోరాటం చేసే విష‌యంలో ఎంతో ధైర్య సాహ‌సాలు ప్ర‌ద‌ర్శించే వార‌ని క‌థ‌లు క‌థ‌లుగా చెపుతూ ఉంటారు. ఈ జాతి ప్ర‌జ‌ల పోరాటాల గురించి వింటుంటూ రొమాలు నిక్క‌పొడుచుకుంటాయ‌ని కూడా చెపుతూ ఉంటారు.
సాయిప‌ల్ల‌వి సైతం త‌మిళ‌నాడు – కేర‌ళ స‌రిహ‌ద్దుల్లో ఉన్న కొండ‌ల్లోని కొత్త‌గిరి గ్రామంలో జ‌న్మించింది. త‌ల్లి రాధామ‌ణి సాయిబాబా భ‌క్తురాలు.

ఆమెకు ఆ సాయిబాబాపై ఉన్న భ‌క్తి నేప‌థ్యంలోనే సాయి ప‌ల్ల‌వి పేరులో సాయిని యాడ్ చేశారు. న‌ట‌నా ప‌రంగానే కాకుండా డ్యాన్సులు చేసే హీరోయిన్ల‌లో సాయిప‌ల్ల‌వి టాప్ ప్లేసులో ఉంటారు. శేఖ‌ర్ క‌మ్ముల సినిమాలు సాయి ప‌ల్ల‌విలో ఉన్న స‌హ‌జ సిద్ధ‌మైన న‌ట‌న‌ను బ‌య‌ట పెట్టాయి. సాయిప‌ల్ల‌వి తండ్రి సెంతామ‌రై క‌స్ట‌మ్స్ అధికారిగా ప‌ని చేస్తూ ఉంటారు.

సాయిప‌ల్ల‌వికి సోద‌రి కూడా ఉంది. సాయిప‌ల్ల‌వి ప్ర‌స్తుతం త‌న కుటుంబంతో క‌లిసి కోయంబ‌త్తూరులో నివాసం ఉంటోంది. ఇక సాయి ప‌ల్ల‌వి తాజాగా న‌టించిన విరాట‌ప‌ర్వం శుక్ర‌వారం రిలీజ్ అయిన సంగ‌తి తెలిసిందే.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news