Moviesకెరీర్ ప్రారంభంలోనే ఇలాంటి పనులా..చిట్టి జర ఆలోచించుకో..?

కెరీర్ ప్రారంభంలోనే ఇలాంటి పనులా..చిట్టి జర ఆలోచించుకో..?

సినీ ఇండస్ట్రీలోకి హీరోయిన్ గా రావడం కాదు..వచ్చిన అవకాశాలల్లో మంచి కధలు, రోల్స్ చూస్ చేసుకుని..సెలక్టీవ్ సినిమాలు చేసుకుంటూ పోతేనే..ఇండస్ట్రీలో హీరోయిన్ గా ఎదగగలం. అలా కెరీర్ ప్రారంభంలో ఆలోచించి నిర్ణయాలు తీసుకున్న వారే ..ఇప్పుడు స్టార్ హీరోయిన్స్ గా రాజ్యమేలుతున్నారు. మరి, ఎన్నో ఆశలతో వెబ్ సిరీస్ లు చేసుకుంటు ఇండస్ట్రీలోకి వచ్చి..ఫస్ట్ సినిమాతో బ్లాక్ బస్టర్ కొట్టేసిన ఫరియా అబ్దుల్లా ..అదేనండి మన చిట్టి..జాతిరత్నాలు సినిమాలో తనదైన స్టైల్ లో నవ్వించి మెప్పించిందిగా..

ఆ సినిమాతో ఓవర్ నైట్ స్టార్ గా మారుపోయిన ఈ చిట్టి..ఆ తరువాత చిన్న చితకా పాత్రలు వేసుకుంటూ వచ్చిందే కానీ..ఇప్పటి వరకు హీరోయిన్ గా చేసింది లేదు.ఆ చిట్టినే ఇప్పుడు కెరీర్ లో తప్పటి అడుగు వేస్తుంది అంటున్నారు సినివిశ్లేషకులు. ‘జాతిరత్నాలు’ సినిమాలో హీరోయిన్ గా చేసిన తరువాత ..చిట్టి నాగార్జున , నాగ చైతన్య నటించిన బంగార్రాజు సినిమాలో ఓ ఐటెం సాంగ్ చేసి..మంచిగా పాపులర్ అయ్యింది. అయినా కానీ, అమ్మడుకి అవకాశాలు ఇవ్వట్లేదు మన డైరెక్టర్లు. త‌న‌ న‌ట‌న‌, కామెడీ టైమింగ్‌తో యూత్‌కు బాగా క‌నెక్ట్ అయిన ఫ‌రియా కి డైరెక్టర్లు ఎందుకు అవకాశాలు ఇవ్వట్లేదో తెలియడం లేదు.

నిజానికి జాతిర‌త్నాలు సినిమా త‌ర్వాత ఆమెకు భారీగా ఆఫ‌ర్లు వ‌స్తాయ‌ని భావించారు అంత.. కానీ, అలా జరగలేదు. ఈమెను తెర పై హీరోయిన్‌గా చూసేందుకే అభిమానులు ఇష్టపడుతున్నారు. అయితే, రీసెంట్ గా అమ్మడు ఓ హీరోకి సిస్టర్ గా కనిపించడానికి సిద్ధపడిందట. సినిమాకి సైన్ కూడా చేసిందట. రవితేజ హీరోగా నతిస్తున్న ధమాకా సినిమాలో అమ్మడు..రవితే సిస్టర్ గా కనిపించనుందట. నక్కిన త్రినాధరావు దర్శకత్వం వహిస్తున్న..ఈ కామెడీ ఎంటర్‌టైనర్‌ లో పెళ్లి సందD హీరోయిన్ శ్రీలీల రవితేజతో జతకట్టింది.

అయితే, జాతిరత్నాలు సినిమాతో బాగా గుర్తింపు తెచ్చుకున్న ఫరియా అబ్దుల్లా ఈ సినిమాలో రవితేజ సిస్టర్ గా సెలక్ట్ అయ్యిన్నత్లు వార్తలు వైరల్ అవుతున్నాయి. కెరీర్ ప్రారంభంలోనే వయసుపట్టింపు లేకుండా సీనియర్ హీరోకు ఇలా సిస్టర్ గా ఎస్ చెప్పడం అభిమానులకు షాకింగ్ గా ఉంది. ఒకవేళ ధమాకా సినిమా హిట్ అయినా..అమ్మడు కెరీర్ కి పెద్దగా ఉపయోగపడకపోవచ్చు.. మాస్ హీరో పక్కన సిస్టర్ క్యారెక్టర్ కాబట్టి ఎక్కువ ఎక్స్ పెక్ట్ చేయడం రాంగే..అంటున్నారు సినీ ప్రముఖులు..!!

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news