Moviesముదురు జంట ప్ర‌భాస్ - అనుష్క ఘాటు రొమాన్స్‌.. రొమాంటిక్‌గా...!

ముదురు జంట ప్ర‌భాస్ – అనుష్క ఘాటు రొమాన్స్‌.. రొమాంటిక్‌గా…!

ప్ర‌భాస్ – అనుష్క బంధం గురించి ఎంత చెప్పుకున్నా త‌క్కువే. వీరిద్ద‌రి స్నేహం ప‌దేళ్ల‌కు పైగానే కొన‌సాగుతోంది. బిల్లా – మిర్చి- బాహుబ‌లి 1, బాహుబ‌లి 2 సినిమాలు వీరి కాంబినేష‌న్లో వ‌చ్చాయి. వీరి కాంబినేష‌న్లో వ‌చ్చిన సినిమాలు అన్నీ హిట్టే. ప్ర‌భాస్ ఆజానుబాహుడు. అనుష్క కూడా ప్ర‌భాస్ ప‌క్క‌న న‌టిస్తే ఆ జంట‌ను తెర‌మీద చూసేందుకు రెండు క‌ళ్లు చాల‌వు. మిర్చి ఆ వెంట‌నే బాహుబ‌లి రెండు సినిమాల‌తో నాలుగైదేళ్లుగా వీరు ట్రావెల్ అయ్యారు.

ఇక ఈ జంట గురించి సినిమా వ‌ర్గాల్లో ఎప్ప‌టిక‌ప్పుడు ఏదో ఒక పుకారు న‌డుస్తూనే ఉంటుంది. అనుష్క‌కు ప్ర‌భాస్‌కు సోష‌ల్ మీడియా వెబ్‌సైట్లు అయితే చాలాసార్లు పెళ్లి చేసేశారు. మ‌రికొంద‌రు అనుష్క‌, ప్ర‌భాస్ నిజంగానే పెళ్లి చేసుకుంటే బాగుంటుంద‌ని కామెంట్లు చేస్తూ ఉంటారు. విచిత్రం ఏంటంటే ఇద్ద‌రు ముదురు వాళ్లు అయిపోయారు. వీరి పెళ్లి గురించి టోట‌ల్ ఇండియ‌న్ సినిమా ల‌వ‌ర్స్‌కు ఎంతో ఆస‌క్తి ఉన్నా వీరికి మాత్రం ఇంకా పెళ్లి చేసుకోవాల‌న్న కోరిక ఉన్న‌ట్టే క‌నిపించ‌డం లేదు.

మ‌రో డౌట్ కూడా ఉంది. వీరిద్ద‌రి మ‌ధ్య నిజంగా ఏం లేక‌పోతే ఇప్ప‌ట‌కీ వీరిద్ద‌రు పెళ్లి చేసుకోకుండా ఎందుకు ? ఉన్నారు ? అనే వారు కూడా ఉన్నారు. బాహుబ‌లి 2 త‌ర్వాత ప్ర‌భాస్ అన్నీ పాన్ ఇండియా సినిమాల‌తో బిజీ అయిపోయాడు. సాహో, రాధేశ్యామ్ ఇప్పుడు ఆదిపురుష్‌, ప్రాజెక్ట్ కే, స‌లార్ ఓ రేంజ్‌లో ప్ర‌భాస్ లైన‌ప్ ఉంది. ఈ టైంలో మ‌ళ్లీ అనుష్క‌, ప్ర‌భాస్ జంట‌ను తెర‌మీద చూస్తామా ? అన్న సందేహాలు ప‌టా పంచ‌లు అవుతున్నాయి.

డీవీవీ దాన‌య్య బ్యాన‌ర్లో మారుతి డైరెక్ష‌న్‌లో ప్ర‌భాస్ ఓ సినిమా చేస్తున్నాడు. ఎక్స్‌ప్రెస్ రాజా టైటిల్‌తో తెర‌కెక్కే ఈ కామెడీ యాక్ష‌న్ ఎంట‌ర్టైన‌ర్లో ప్ర‌భాస్‌కు జోడీగా ముగ్గురు హీరోయిన్లు న‌టిస్తున్నారు. వీరిలో అనుష్క మెయిన్ హీరోయిన్. ఈ క‌థ‌లో ముగ్గురు హీరోయిన్ల‌కు ప్రాధాన్య‌త ఉంటుంద‌ని అంటున్నారు. ఇక మ‌రో ఇద్ద‌రు హీరోయిన్ల విష‌యానికి వ‌స్తే శ్రీలీల‌, మాస్ట‌ర్ ఫేం మాళ‌విక మోహ‌న‌న్‌కు అడ్వాన్స్‌లు ఇచ్చేశారు.

మొత్తం ముగ్గురు హీరోయిన్లు ఉన్నా కూడా మెయిన్ హీరోయిన్ అనుష్క‌, ప్ర‌భాస్ చుట్టూనే ఎక్కువ క‌థ న‌డుస్తుంద‌ట‌. రొమాంటిక్ స‌న్నివేశాల‌తో పాటు వీరిద్ద‌రి స్నేహం నేప‌థ్యంలో వ‌చ్చే సీన్లు సినిమాకు హైలెట్ అంటున్నారు. వీరిద్ద‌రు క‌లిసి న‌టిస్తే చూడాల‌నుకుంటోన్న అభిమానులు చాలా మందే ఉన్నారు. ఏదేమైనా మ‌ళ్లీ వెండితెర‌పై అనుష్క – ప్ర‌భాస్ రొమాంటిక్ కాస్త లేట్ ఏజ్‌లో కొత్త‌గా ఉండ‌బోతోంద‌న్న‌మాట‌.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news