Moviesఆ మాటే అంటేనే చిరాకు..రకుల్ మరీ ఓవర్ చేస్తుందబ్బా..?

ఆ మాటే అంటేనే చిరాకు..రకుల్ మరీ ఓవర్ చేస్తుందబ్బా..?

రకుల్ ప్రీత్ సింగ్.. అబ్బో అమ్మడుకి ఫ్యాన్ ఫాలోయింగ్ ఎక్కువే. అప్పుడెప్పుడో పదేళ్ల కిందట సినిమాలోకి వచ్చిన ఈ భామా..ఇంకా మంచి మంచి అవకాశాలతో హీరోయిన్ గా నెట్టుకొస్తుంది. కన్నడ సినిమా గిల్లితో సినీ ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చిన ఈమె.. ఆ తర్వాత హిందీలో యారియాన్ సినిమాతో మంచి గుర్తింపు తెచ్చుకుంది. ఆ సినిమా పర్లేదు అనిపించే టాక్ సంపాదించుకుంది. ఇక ఆ వెంటనే సందీప్ కిషన్ వెంకటాద్రి ఎక్స్‌ప్రెస్ సినిమాతో తెలుగు ఇండస్ట్రీలో ఫస్ట్ హిట్ అందుకుంది. ఇక ఆ తర్వాత నెనక్కి తిరిగి చూసుకునే పనే లేకుండా పోయింది ..వరుస ఆఫర్లతో స్టార్ హీరోయిన్‏గా కొనసాగింది.

ఇండస్ట్రీకి వచ్చిన అతి తక్కువ టైంలోనే దాదాపు టాలీవుడ్ అగ్ర హీరోలందరితోనూ స్క్రీన్ షేర్ చేసుకుంది రకుల్. సౌత్ లో క్రేజీ హీరోయిన్ గా ఓ వెలుగు వెలిగిన రకుల్ ప్రీత్ సింగ్.. ఇప్పుడు అడ్రెస్ లేకుండా పోయింది. హీందీలో బోళెడు అవకాశాలు దక్కించుకుంటున్న ఈ బ్యూటీకి తెలుగు లో మాత్రం ఒక్కతి అంటే ఒక్కటి కూడా సినిమా ఆఫర్ లేదు. సినిమాల్లో అవకాశం కోసం డైరెక్టర్స్ ఏం చెప్పినా చేయడానికి నేను రెడీగా లేను అంటూ చెప్పుకొచ్చిన పంజాబీ భామ రకుల్ ప్రీత్ సింగ్.. మొహమాటమే లేకుండా ఏ డైరెక్టర్ బరువు పెరగడం, తగ్గడం లాంటివి అడిగిన మాత్రం చేయను అని తేల్చి చెప్పింది.

కాగా, రీసెంట్ గా ఆమె నతించిన హిందీ చిత్రం ‘రన్​ వే 34’ ఏప్రిల్​ 29న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. అజయ్​ దేవగణ్​ దర్శకత్వం వహించిన ఈ మూవీలో బిగ్​బీ అమితాబ్​ బచ్చన్​, అజయ్​ దేవగణ్​ వంటి స్టార్స్ నటించిన విషయం తెలిసిందే. అయితే ఈ సినిమా విశేషాలను అభిమానులతో పంచుకుంటున్న క్రమంలో..ఇద్దరు స్టార్ తో సినిమా చేస్తున్నప్పుడు మీకు ఇబ్బది గా అనిపించిందా అని అడగ్గా..” అస్సలు కష్టం అన్న మాట అంటెనే నాకు నచ్చదు.

నాకంటే టాలెంటెడ్ నటులతో కలిసి వర్క్ చేస్తున్నప్పుడు..చాలా నేర్చుకోఈవచ్చు,, నాకు చాలా ఉత్సాహంగా అనిపిస్తుంది. ఆ టైంలోనే ఉత్సాహం డబుల్ అవుతుంది” అని రకుల్​ ప్రీత్​ సింగ్​ చెప్పుకొచ్చింది. ఇదిలా ఉంటే రకుల్​ ప్రీత్​ ఛత్రివాలీ, డాక్టర్​ జీ, థ్యాంక్​ గాడ్​ చిత్రాల్లో నటిస్తోంది.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news