Moviesతప్పదు ఉపాసన..కొంతకాలం ఆగాల్సిందే..చరణ్ పోస్ట్ వైరల్..!!

తప్పదు ఉపాసన..కొంతకాలం ఆగాల్సిందే..చరణ్ పోస్ట్ వైరల్..!!

టాలీవుడ్ ఇండస్ట్రీలో ఉన్న లవబుల్ కపుల్స్ లో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్-ఉపాసన ఒకరు. ఈ మెగా జంట జంట గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ది బెస్ట్ అంతే.. ఒకరిని ఒకరు బాగా అర్ధం చేసుకుంటారు. కలిసి చదువుకున్న వీళ్లు కాలేజీ రోజుల్లోనే ప్రేమించుకున్నారు..ఆ తరువాత ఇంట్లో పెద్దలను ఒప్పించి ఘనంగా పెళ్లి చేసుకున్నారు. ప్రేమను వివాహబంధంతో ఒక్కటైన వీరిద్ధరూ.. ఇప్పటికీ ఎంతో అన్యోన్యంగా ఉంటూ ఎంతో మందికి ఆదర్శంగా నిలుస్తున్నారు. చిన గొడవలకే విడాకులు వరకు వెళ్తున్న సెలబ్రిటీలు ఈ జంట చూసి నేర్చుకోవాల్సిన విషయాలు చాలానే ఉన్నాయి.

ముఖ్యంగా చరణ్ చాలా అర్ధం చేసుకుంటాదు. అలానే ఉపాసన ప్రవర్తన ఉంటుంది. దీంతో ఈ భార్య భ్రతలు చక్కగా మ్యారిడ్ లైఫ్ ను ఎంజాయ్ చేస్తున్నారు. వీళ్ళకు ఇంకా పిల్లలు లేరని ఒక్క మాట తప్పిస్తే ఈ జంట ది బెస్ట్..త్వరలోనే ఆ గుడ్ న్యూస్ కూడా అందిస్తుంది మెగా కోడలు అంటున్నారు మెగా అభిమానులు. తెలంగాణ, ఏపీలో చిరంజీవి ఫ్యామిలీకి, అపోలో ప్రతాప్ రెడ్డి కుటుంబానికి మంచి పేరే ఉంది. ఉపాసన విషయానికొస్తే.. అపోలో హాస్పిటల్స్‌లోని అపోలో లైఫ్ విభాగానికి వైస్ చైర్మన్ బాధ్యతల్ని నిర్వర్తిస్తుంది.మెగాస్టార్ చిరంజీవి కోడలిగా.. రామ్ చరణ్ భార్యగా మెగా ఫ్యామిలీతో మమేకైపోయింది. చరణ్ గురించి ఎప్పుడూ ఉపాసన.. తన భార్య గురించి చరణ్ పలు ఇంటర్వ్యూలలో ఆసక్తికర విషయాలను పంచుకుంటుంటారు.

అంతేకాదు ఉపాసన అపోలో హెల్త్ కేర్ బాధ్యతలు నిర్వహిస్తూ తనదైన శైలిలో సెలబ్రిటీల డైట్స్ గురించి ఇంటర్వ్యూలు చేయడమే కాదు… తనకు హెల్త్ విషయంలో తెలిసిన చిట్కాలను సోషల్ మీడియా ద్వారా మాములు ప్రజలకు అవగాహన కల్పిస్తోంది. ఇక చరణ్ విషయానికి వస్తే.. సినిమాలతో ఎంత బిజీగా ఉన్నా.. ఫ్యామిలీకి సమయం కేటాయిస్తూ.. ఫర్ఫెక్ట్ ఫ్యామిలీ మెన్ గా పేరు తెచ్చుకుంటారు.

కాస్త సమయం దొరికిన కుటుంబసభ్యులతో ఎంజాయ్ చేయడానికి ఇష్టపడుతుంటాడు.. ఇక చెర్రీకి వీలు చిక్కినప్పుడల్లా.. తన సతీమణితో కలిసి వెకెషన్స్ వెళ్తుంటాడు. పాపం ఆ వెకేషన్స్ రోజులు గుర్తు వచ్చిన్నత్లు ఉన్నాయి. ఉపాసన వారిద్దరూ కలియుసి వెకేషన్ కు వెళ్లిన ఫోటోలను షేర్ చేసింది. ఆ ఫోటోలకు చరణ్ పెట్టిన కామెంట్స్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.

‘ఉపాసన.. నా మైండ్‌లో కూడా వెకేషన్‌కు వెళ్లాలని ఉంది. కానీ, ఆర్‌సీ 15 సినిమా వైజాగ్‌ షెడ్యుల్‌ పూర్తి కావాలి. కాబట్టి మనం ఇంకా కొన్ని రోజులు ఆగాల్సిందే’ అంటూ చరణ్ రాసుకొచ్చాడు. దాంతో పాటు అంతకుముందు వెకేషన్ లో ఉన్న ఫోటోలను షేర్ చేశాడు. ప్రస్తుతం ఈ ఫోటోలు నెట్టింట్లో వైరల్ గా మారాయి.

 

 

View this post on Instagram

 

A post shared by Ram Charan (@alwaysramcharan)

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news