Moviesబిగ్ బాస్ చరిత్రలోనే ఇది రికార్డ్ .. బింధు మాధవి అందుకున్న...

బిగ్ బాస్ చరిత్రలోనే ఇది రికార్డ్ .. బింధు మాధవి అందుకున్న ఫైనల్ అమౌంట్ ఇదే..?

బింధు మాధవి..ఈ పేరుకు 12 వరాల ముందు వరకు సగం మందికి పైగా తెలియదు. అప్పుడెప్పుడో ఆవకాయ బిరియానీ అంటూ ఓ సినిమా చేసింది..అది అట్టర్ ఫ్లాప్ గా నిలిచింది.. ఆ తరువాత బంపర్ ఆఫర్ అంటూ మరో సినిమా చేసింది..అది పర్లెదౌ అనిపించిన క్రెడిట్ అంటా హీరో తన్నుకుపోయాదు. ఇక ఆ తరువాత అమ్మడుకి అవకాశాలు లేకుండా పోయాయి. దీంతో యూటర్న్ తీసుకుని చెన్నై వెళ్లి అక్కడ మంచి గుర్తింపు సంపాదించుకుంది.

ఈ క్రమంలోనే తమిళ బిగ్ బాస్ లో పాల్గొని..తనదైన స్టైల్ లో ఆట ఆడి,,జనాలను మెప్పించి ..నాలుగో రన్నర్అప్ గా నిలిచింది. ఇక ఆ పాపులారిటీ తో తెలుగు బిగ్ బాస్ OTT లో ఆఫర్ అందుకుని..హౌస్ లోకి ఎంటర్ అయ్యింది. బిగ్ బాస్ హౌస్ లోకి ఎంటర్ అయ్యినప్పుడు అమ్మడు పై స్పెషల్ ఇంట్రెస్ట్ లు ఏం లేవు.

కానీ, నామినేషన్స్ టైం లో ఉన్నది ఉన్నట్లు మాట్లాడి..అందరిని రఫాడించింది. క్రమక్రమంగా హౌస్ లో ఆడపులి అని ట్యాగ్ వేసుకుంది. ముఖ్యంగా హౌస్ లో ఆమె అఖిల్, నటరాజ్ మాస్టర్ తో వేసుకున్న గొడవలు చూస్తే..మనకు ఉద్రేకం వచ్చేస్తుంది..అలా రెచ్చిపోయారు కంటెస్టెంట్లు.

ఇక ఫైనల్ గా అఖిల్-బింధు మధ్య టఫ్ ఫైట్ నడిచినా..ఎట్టకేలకు ట్రోఫీ ని అందుకుని,,బిగ్ బాస్ OTT ఫస్ట్ లేడీ విన్నర్ గా చరిత్ర సృష్టించింది. ఈ క్రమంలోనే ఆమెకు బిగ్ బాస్ నుండి ఎంత ముట్టచెప్పుంటారు అని సోషల్ మీడియాలో డిస్కషన్స్ మొదలైయాయి. ఈ క్రమంలోనే ఆమె రెమ్యూనరేషన్ డీటైల్స్ నెట్టింట వైరల్ గా మారాయి.

బిగ్ బాస్ హౌస్లో మొత్తం 12 వారాలు ఉన్న ఆమెకు..వారానికి 5 లక్షలు చొప్పున మొత్తంగా 60 లక్షలు వచ్చిందట ..ఇక విన్నర్ అమౌంట్ లో 10 లక్షలు అరియానా పట్టుకుపోయింది..దీంతో మిగిలిన 40 లక్షలు..అంతా కలుపుకుంటే..ఆమె కు కోటి రూపాయలు రావాలి..ఇక ఆ ట్యాక్స్ లు, మిగతా చార్జెస్ అంతా కట్ అయ్యి ఆమె కు 87 లక్షలు చేతికి వచ్చిందట. మొత్తానికి బిందు ఈ రేంజ్‌లో రెమ్యునరేషన్‌ అందుకుందన్న వార్త సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది. మరి ఇదెంతవరకు నిజమన్నది తెలియాల్సి ఉంది.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news