Moviesఆచార్య ఎఫెక్ట్‌... ఎన్టీఆర్ సినిమా క‌థ‌కు 2 రిపేర్లు చేస్తోన్న కొర‌టాల‌...!

ఆచార్య ఎఫెక్ట్‌… ఎన్టీఆర్ సినిమా క‌థ‌కు 2 రిపేర్లు చేస్తోన్న కొర‌టాల‌…!

టాలీవుడ్ యంగ్ టైగ‌ర్ ఎన్టీఆర్ త్రిబుల్ ఆర్ పాన్ ఇండియా స‌క్సెస్ బాగా ఎంజాయ్ చేస్తున్నాడు. త్రిబుల్ ఆర్‌తో ఎన్టీఆర్‌కు ఎంతో కొంత పాన్ ఇండియా ఇమేజ్ వ‌చ్చింది. ఇప్పుడు ఈ ఇమేజ్‌ను కంటిన్యూ చేసేలా క‌థ‌లు ఉండేలా ప్లాన్ చేసుకుంటున్నాడు. త్రిబుల్ ఆర్ స‌క్సెస్‌తో పాటు త‌న కెరీర్‌లో ఎప్పుడూ లేన‌ట్టుగా ఆరు వ‌రుస హిట్లు… డ‌బుల్ హ్యాట్రిక్ హిట్ అనే అరుదైన రికార్డును కూడా త‌న ఖాతాలో వేసుకున్నాడు.

ఈ క్ర‌మంలోనే ఎన్టీఆర్ కొర‌టాల శివ ద‌ర్శ‌క‌త్వంలో త‌న నెక్ట్స్ సినిమా చేస్తోన్న సంగ‌తి తెలిసిందే. ఈ సినిమా ఈ నెల 20న లాంచ్ అవుతోంది. ఎన్టీఆర్ ఆర్ట్స్ – యువ‌సుధా ఆర్ట్స్ సంయుక్తంగా ఈ క్రేజీ ప్రాజెక్టును తెర‌కెక్కిస్తున్నాయి. నంద‌మూరి క‌ళ్యాణ్‌రామ్ , మిక్కిలినేని సుధాక‌ర్ క‌లిసి ఈ సినిమాను నిర్మిస్తున్నారు. అయితే ఆచార్య రిలీజ్ టెన్ష‌న్ వ‌దిలిపోవ‌డంతో ద‌ర్శ‌కుడు కొర‌టాల శివ ఇప్పుడు ఎన్టీఆర్ సినిమా క‌థ‌కు రిపేర్లు చేయ‌డం స్టార్ట్ చేశాడ‌ట‌.

ఆచార్య‌కు ముందు వ‌ర‌కు కొర‌టాల‌కు ఉన్న క్రేజ్, ఆ రేంజ్ వేరు. అయితే ఇప్పుడు కొర‌టాల వైపు చాలా వేళ్లు చూస్తున్నాయి. ఆచార్య ప్లాప్‌న‌కు చాలా కారణాలు ఉన్నా కూడా కొర‌టాల స్టార్ హీరోల రేంజ్‌కు త‌గిన క‌థ తీసుకోలేద‌న్న విమ‌ర్శ‌లే తీవ్రంగా ఉన్నాయి. కొర‌టాల గ‌త సినిమాల్లో టేకింగ్‌, నెరేష‌న్ స్లోగా ఉంటుంద‌న్న కంప్లైంట్లు మామూలే.

అయితే ఇప్పుడు నెరేష‌న్‌, స్క్రీన్ ప్లే లోపాల‌తో పాటు క‌థ కూడా పాత‌గా ఉండ‌డంతో పాటు ఏ మాత్రం ఆస‌క్తిగా లేద‌నే ఎక్కువ మంది విమ‌ర్శ‌లు చేశారు. అస‌లు కొర‌టాల క‌థ‌పై ఏ మాత్రం క‌స‌ర‌త్తులు చేయ‌లేద‌న్న విమ‌ర్శ‌లు ఎక్కువే వ‌చ్చాయి. అయితే ఎన్టీఆర్ సినిమా విష‌యంలో త‌న ఫ‌స్ట్ కంప్లైంట్ రెక్టిపై చేసుకోవాల‌ని క‌థ‌పై మ‌రింత క‌స‌ర‌త్తులు చేస్తున్నాడ‌ట‌.

స్క్రిఫ్ట్‌లో ఎమోష‌న్లు, ఎంట‌ర్టైన్‌మెంట్ మేళ‌వింపు ఉండేలా ప్లాన్ చేసుకుంటున్నాడ‌ట‌. కొర‌టాల కెరీర్‌లో ఫ‌స్ట్ సినిమాగా వ‌చ్చిన మిర్చి సినిమాను మించిన మాస్ డ్రామాగా ఈ సినిమా ఉండ‌బోతోంద‌ట‌. ఎన్టీఆర్ లుక్ కూడా మాస్ మేకోవ‌ర్‌గా ఉండ‌బోతోంద‌ని అంటున్నారు. ఇక హీరోయిన్ ఎవ‌రు ? అన్న‌ది ఖ‌రారు కాక‌పోయినా ర‌ష్మిక మంద‌న్న‌, పూజా హెగ్డే పేర్లు విన‌ప‌డుతున్నాయి.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news