Moviesచిరంజీవి ' స్నేహంకోసం ' లో సూప‌ర్‌స్టార్ కృష్ణ‌... తెర‌వెన‌క ఏం...

చిరంజీవి ‘ స్నేహంకోసం ‘ లో సూప‌ర్‌స్టార్ కృష్ణ‌… తెర‌వెన‌క ఏం జ‌రిగింది…!

చిరంజీవి తెలుగు చిత్ర సీమలో చిన్న పాత్రలతో ఎంట్రీ ఇచ్చి అతి తక్కువ టైమ్ లోనే తన విశ్వరూపాన్ని చూపించారు.మెగాస్టార్ గా అవతరించారు. దానికి ఆయన టాలెంట్ తో పాటు, వినయం, మంచితనం, సరైన టైమ్ లో వచ్చిన అవకాశాలను సద్వినియోగం చేసుకోవడం అని చెప్పాలి. ఇక చిరంజీవి కెరీర్ బిగినింగ్ లో సూపర్ స్టార్ క్రిష్ణ ఆయన్ని బాగా ప్రోత్సహించారు. క్రిష్ణతో కొత్త అల్లుడు, కొత్త పేట రౌడి వంటి చిత్రాలలో చిరంజీవి నటించారు. అవి ఆయా సినిమాలలో చిన్న పాత్రలు. ఇక ఈ ఇద్దరు 1980 ప్రాంతంలో తోడు దొంగలు సినిమా నటించారు.

ఒక విధంగా ఇది మల్టీ స్టారర్ మూవీ అని చెప్పాలి. ఇందులో క్రిష్ణతో కలసి చిరంజీవి చలాకీగా హుషారుగా నటించారు. ఈ సినిమా సూపర్ హిట్ అయింది. ఈ కాంబో కూడా జనాలు మెచ్చారు. అయితే ఆ తరువాత ఖైదీతో చిరంజీవికి స్టార్ డం రావడంతో సోలో హీరోగానే సినిమాలు వరసబెట్టి చేస్తూ వచ్చారు. మరో వైపు క్రిష్ణ రాజకీయాల్లోకి మధ్యలో వెళ్ళి వచ్చారు. ఆ తరువాత ఆయన స్టార్ డమ్ డౌన్ అవుతూ వచ్చింది.

ఇక 1990 దశకంలో క్రిష్ణ కెరీర్ మళ్లా నంబర్ వన్ మూవీతో పుంజుకుంది. అమ్మ దొంగ మరో సూపర్ హిట్ మూవీగా వచ్చింది. దాంతో క్రిష్ణ మళ్లీ హీరోగా అనేక సినిమాలు చేశారు. ఇక 1999 నాటికి క్రిష్ణ మళ్ళీ తగ్గారు. ఆ టైమ్ లోనే బాలక్రిష్ణతో ఆయన చేసిన సినిమా సుల్తాన్. ఈ మూవీ ఆశించిన స్థాయిలో విజయం సాధించలేకపోయినా ఈ కాంబో అయితే అలరించింది.

అదే టైమ్ లో చిరంజీవి స్నేహం కోసం మూవీని చేస్తున్నారు. ఆ మూవీలో ఇద్దరు చిరంజీవిలు ఉంటారు. తండ్రి చిరంజీవికి దోస్తీగా ఒక కీలకమైన పాత్ర ఉంది. దాన్ని క్రిష్ణ చేత నటింపచేయాలని మేకర్స్ చూశారు. దాని కోసం ప్రయత్నాలు కూడా చేశారు. అయితే ఎందుకో అది చివరికి వచ్చేసరికి మెటీరియలైజ్ కాలేదు. తండ్రి చిరంజీవితో దోస్తీగా ఉంటే కొడుకు చిరంజీవి దగ్గర పెద్దాయనగా క్రిష్ణ కనిపించాల్సి ఉంటుంది.

అయితే ఫ్యాన్స్ నుంచి అభ్యంతరాలు వస్తాయని ఆలోచించి క్రిష్ణ నో చెప్పి ఉంటారని అనుకున్నారు. మొత్తానికి ఆ పాత్రను విజయకుమార్ పోషించారు. ఆ సినిమా మంచి విజయం సాధించింది. అయితే క్రిష్ణ చిరంజీవిలను కలిపే మూవీ ఇది అవుతుందని ఆశించిన వారికి మాత్రం నిరాశే మిగిలింది. మొత్తానికి చూస్తే మెగాస్టార్ అలనాటి సూపర్ స్టార్ మాత్రం తోడు దొంగలు తరువాత మళ్ళీ కలసి నటించలేదు.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news