MoviesKRK: పుష్ప ఐటెం సాంగ్‌ను మించి రెచ్చిపోయిన స‌మంత‌.. మోకాళ్ల‌కు పైనే...

KRK: పుష్ప ఐటెం సాంగ్‌ను మించి రెచ్చిపోయిన స‌మంత‌.. మోకాళ్ల‌కు పైనే (వీడియో)

చైతుతో విడాకుల త‌ర్వాత కూడా తానే త‌గ్గేదేలే అని స‌మంత ఎలా ? రెచ్చిపోతుందో చూస్తూనే ఉన్నాం. అస‌లు పుష్ప సినిమాలో ఐటెం సాంగ్ చూశాక అయితే జ‌నాల‌కు మ‌తులు పోయాయి. మ‌రీ బోల్డ్‌గా విశ్వ‌రూపం చూపించేసింది. బ‌న్నీ చొక్కా బొత్తాలు తీస్తూ.. ఇసుక మీద జ‌రుగుతూ బ‌న్నీ బుగ్గ గిల్లుతూ వామ్మో బోల్డ్‌నెస్ విష‌యంలో తాను ఎంత‌లా అయినా రెచ్చిపోతాన‌ని చెప్ప‌క‌నే చెప్పేసింది.

ఆ త‌ర్వాత ఆమె బాలీవుడ్‌లో రెండు బోల్డ్ వెబ్‌సీరిస్‌కు కూడా ఓకే చెప్పేసింది. ఇటు కోలీవుడ్‌లో విజ‌య్ దేవ‌ర‌కొండ ప‌క్క‌న ఓ రొమాంటిక్ సినిమాలో న‌టించేందుకు కూడా ఆమె ఓకే చెప్పేసింది. ఇటు కోలీవుడ్‌లో కార్తీ ప‌క్క‌న కూడా న‌టిస్తోంది. హాలీవుడ్‌లో బోల్డ్ మూవీలో న‌టించేందుకు కూడా గ్రీన్‌సిగ్న‌ల్ ఇచ్చింది. అయితే ఇప్పుడు ఆమె కోలీవుడ్‌లో కేఆర్కే సినిమా చేస్తోంది.

మక్కల్ సెల్వన్ విజయ్ సేతుపతి హీరోగా.. నయనతార – సమంత హీరోయిన్లుగా తెర‌కెక్కిన ఈ సినిమాకు న‌య‌న్ ప్రియుడు విఘ్నేష్ శివ‌న్ ద‌ర్శ‌కుడు. కాథువాక్కుల రెండు కాద‌ల్ పేరుతో తెర‌కెక్కిన ఈ సినిమాను తెలుగులో క‌ణ్మణి రాంబో ఖతీజా టైటిల్ తో రిలీజ్ చేస్తున్నారు. ఈ సినిమాలో టూటూటూ అనే సాంగ్ గ్లింప్స్ రిలీజ్ చేశారు. పాట వ‌ర‌కు బాగానే ఆక‌ట్టుకుంటోంది.

స‌మంత‌తో పాటు న‌య‌న్ ఇద్ద‌రూ క‌లిసి పోటాపోటీగా స్టెప్పులు వేశారు. స‌మంత మాత్రం మ‌రోసారి బోల్డ్‌గా రెచ్చిపోయేందుకు బాగా తాప‌త్ర‌య ప‌డింది. న‌య‌న‌తార సారీలో క‌ల‌ర్ ఫుల్‌గా క‌నిపించాల‌ని చూస్తే.. స‌మంత మోకాళ్ల‌కు పైన ఉండేలా ఓ చిట్టి పొట్టి డ్రెస్సు వేసుకుని తెగ ఊపేస్తోంది. ఆమె ఊపుడు చూస్తుంటే మామూలు వ‌య్యారం వ‌ల‌క‌బోసిన‌ట్టుగా లేదు.

ఈ సినిమాతో ఖ‌తీజా పాత్ర‌లో సామ్ క‌నిపించ‌బోతోంది. ఇద్ద‌ర‌మ్మాయిల‌ను ఒకేసారి ప్రేమించి.. ఆ ఇద్ద‌రితోనూ క‌లిసి ఉండాల‌ని అనుకునే హీరో క‌థే ఈ సినిమా. స‌మంత మాత్రం మామూలుగా రెచ్చిపోలేదు. చిన్న సాంగ్‌లోనే ఇంత‌లా చూపించేస్తోందంటే.. సినిమాలో ఏ రేంజ్లో రెచ్చిపోయి ఉంటుందో ? చూడాలి.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news