Moviesరౌడీ హీరో విజ‌య్ హీరోయిన్ బిగ్ బ్రేక‌ప్‌.. ప్రియుడితో విడిపోయింది...!

రౌడీ హీరో విజ‌య్ హీరోయిన్ బిగ్ బ్రేక‌ప్‌.. ప్రియుడితో విడిపోయింది…!

ఇటీవ‌ల ఇండియ‌న్ సినిమా ఇండ‌స్ట్రీలో బ్రేక‌ప్‌లు కామ‌న్ అయిపోయాయి. పెళ్ల‌య్యి ఏళ్ల‌కు ఏళ్లు కాపురం చేసుకుని పిల్ల‌ల‌ను క‌న్న జంట‌లే విడిపోతున్నాయి. ఇక పెళ్లికి ముందు యేడాదో రెండేళ్లో క‌లిసి డేటింగ్‌లు చేసుకుని.. ప్రేమించుకున్న జంట‌లు విడిపోతే పెద్ద ఆశ్చ‌ర్య ప‌డాల్సిన ప‌నిలేదు. స‌మంత – చైతు జంట ఎంత రొమాంటిక్ క‌ఫుల్‌గా ఉండేవాళ్లో చూశాం. వాళ్లే విడిపోయారు. ఇక ధ‌నుష్ – ఐశ్వ‌ర్య వంతు విష‌యానికి వ‌స్తే 18 ఏళ్ల కాపురం.. 12 ఏళ్ల వ‌య‌స్సు ఉన్న ఇద్ద‌రు మ‌గ పిల్ల‌లు అయినా కూడా విడిపోయారు. అమీర్ ఖాన్ అంతే.. రెండో పెళ్లి చేసుకుని.. 15 ఏళ్లు కాపురం చేశాక భార్య‌కు విడాకులు ఇచ్చేశాడు. ఇలా చెప్పుకుంటూ పోతే చాలా మంది స్టార్ హీరోలు సింపుల్‌గా బ్రేక‌ప్ చెప్పేసుకుంటున్నారు.

తాజాగా ఇప్పుడు మ‌రో యంగ్ జంట బ్రేక‌ప్ చెప్పేసుకుంద‌న్న వార్త‌లు మీడియాలో హ‌ల్ చ‌ల్ చేస్తున్నాయి. ఈ యంగ్ జంట బాలీవుడ్ వాళ్లు కావ‌డం విశేషం. యంగ్ హీరోయిన్ అన‌న్య పాండే, ఆమె స‌న్నిహితుడు ఇషాన్ ఖ‌ట్ట‌ర్ ఎవ‌రి దారులు వాళ్లు చూసుకున్నార‌ట‌. వీరు మూడేళ్ల నుంచి ఎంతో స‌న్నిహితంగా ఉంటున్నారు. అయితే ఇప్పుడు మ‌న‌స్ప‌ర్థ‌లు రావ‌డంతో సింపుల్‌గానే ఒక‌రినొక‌రు అర్థం చేసుకుని విడిపోయార‌ట‌.

మూడేళ్ల నుంచి ఎక్క‌డ చూసినా వీరే క‌నిపించేవారు. తాము రిలేష‌న్‌లో ఉన్నామ‌ని ఎక్క‌డా లీకులు ఇవ్వ‌లేదు. అయితే వీరు అందులోనే మునిగి తేలారు. సీక్రెట్‌గా స‌హ‌జీవ‌నం కూడా చేశారు. డేటింగ్‌లో ఫుల్లుగా మునిగి తేలిపోయారు. ఎక్క‌డ చూసినా వీరే చెట్టాప‌ట్టాలేసుకుని తిరిగేవారు. ఇక చిన్న చిన్న గ్యాప్‌లు రావ‌డంతో ఇవి పెర‌గ‌కూడ‌ద‌ని.. ఎవ‌రి దారి వారు చూసుకోవ‌డం మంచిద‌ని ఓ నిర్ణ‌యానికి వ‌చ్చేశార‌. మ‌రో టాక్ ఏంటంటే వీరు కొత్త రిలేష‌న్ షిఫ్‌ల్లో ఉన్నార‌ని కూడా వినిపిస్తోంది.

ప్ర‌స్తుతం బీ టౌన్‌లో మోస్ట్ వాంటెడ్ హీరోయిన్‌గా అన‌న్య పాండే ఉన్నారు. ఆమెకు బీ టౌన్‌లో మాత్ర‌మే కాదు.. సౌత్‌లోనూ మంచి ఆఫ‌ర్లు వ‌స్తున్నాయి. సౌత్‌లో రౌడీ హీరో విజ‌య్ దేవ‌ర‌కొండ లైగ‌ర్ సినిమాలోనూ ఛాన్స్ వ‌చ్చింది. ఇక ఇషాన్ ఖట్ట‌ర్ ఎవ‌రో కాదు శ్రీదేవి కూతురు జాన్వీ క‌పూర్‌కు ఒక‌ప్పుడు బెస్ట్ ఫ్రెండ్‌. అలాగే బాలీవుడ్ హీరో షాహిద్ క‌పూర్‌కు స‌వ‌తి సోద‌రుడు. ఇషాన్ కూడా ప‌లు సినిమాల్లో హీరోగా చేస్తున్నాడు. జాన్వీ క‌పూర్ ఫ‌స్ట్ డేటింగ్ చేసిన కుర్రాడిగా ఇషాన్‌కు మంచి క్రేజే ఉంది.

జాన్వీతో బ్రేక‌ప్ త‌ర్వాత అన‌న్య‌ను ప‌ట్టేశాడు. మూడేళ్ల పాటు అన‌న్య‌ను వెంటేసుకుని తిరిగిన ఇషాన్ ఇప్పుడు మ‌రో ఫిగ‌ర్‌ను ప‌ట్ట‌డంతోనే అన‌న్య‌తో గ్యాప్ వ‌చ్చిందంటున్నారు. అటు అన‌న్య కూడా కొత్త రిలేష‌న్‌ను వెతుక్కుంద‌ట‌. ఇక ఇషాన్‌కు సినిమాల క‌న్నా ఇలా కుర్ర హీరోయిన్ల‌తో డేటింగ్‌ల‌తో మంచి గుర్తింపు వ‌స్తోంది. ఇక అన‌న్య కొత్త ప్రియుడు ఎవ‌రు అవుతారో ? చూడాలి.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news