Moviesఆ సినిమా సీక్వెల్లో ఎన్టీఆర్... యువ‌రాజుగా అద‌ర‌గొట్టేస్తాడ‌ట‌...!

ఆ సినిమా సీక్వెల్లో ఎన్టీఆర్… యువ‌రాజుగా అద‌ర‌గొట్టేస్తాడ‌ట‌…!

టాలీవుడ్ యంగ్‌టైగ‌ర్ ఎన్టీఆర్ ప్ర‌స్స‌తుతం త్రిబుల్ ఆర్ స‌క్సెస్ బాగా ఎంజాయ్ చేస్తున్నాడు. మూడు వారాలు కంప్లీట్ చేసుకోబోతోన్న ఈ సినిమా ప్ర‌పంచ వ్యాప్తంగా రు. 1000 కోట్ల గ్రాస్ వ‌సూళ్లు రాబ‌ట్టింది. ఈ సినిమాకు ఇప్ప‌టికే రు. 150 కోట్ల లాభాలు వ‌చ్చిన‌ట్టు తెలుస్తోంది. ఐదు వ‌రుస హిట్ల‌తో ఉన్న ఎన్టీఆర్ ఈ సినిమా కోసం మూడున్న‌ర సంవ‌త్స‌రాల టైం స్పెండ్ చేయ‌డం మామూలు విష‌యం కాదు. ఏదేమైనా సినిమా హిట్ కొట్టింది. ఎన్టీఆర్ డ‌బుల్ హ్యాట్రిక్ హిట్లు కొట్టాడు. పాన్ ఇండియా వైజ్‌గా ఎన్టీఆర్ పాపుల‌ర్ అయ్యాడు.

కొమ‌రం భీంగా ఆ పాత్ర‌లో ఎన్టీఆర్ ఒదిగిపోయిన తీరుకు ప్ర‌తి ఒక్క‌రు హ్యాట్సాప్ చెపుతున్నారు. అందుకే పాన్ ఇండియా లెవ‌ల్లో ఎన్టీఆర్‌కు ప్ర‌శంస‌లు ద‌క్కుతున్నాయి. ప్ర‌స్తుతం ఎన్టీఆర్‌.. కొర‌టాల శివ ద‌ర్శ‌క‌త్వం వ‌హించే సినిమాలో న‌టిస్తోన్న సంగ‌తి తెలిసిందే. ఆచార్య ప్ర‌మోషన్లు పూర్త‌యిన వెంట‌నే కొర‌టాల శివ ఈ సినిమాను ప‌ట్టాలెక్కిస్తాడు. ఆ త‌ర్వాత ప్ర‌శాంత్ నీల్ – ఎన్టీఆర్ పాన్ ఇండియా మూవీ ఉండే ఛాన్సులు ఉన్నాయి.

ఇదిలా ఉంటే తాజాగా ఓ అప్‌డేట్ గ‌త రెండు రోజులుగా ఫిల్మ్‌న‌గ‌ర్ స‌ర్కిల్స్‌లో వినిపిస్తోంది. మ‌ల్లిడి వశిష్ట్ ద‌ర్శ‌క‌త్వంలో క‌ళ్యాణ్‌రామ్ హీరోగా బింబిసార సినిమా తెర‌కెక్కింది. క్రీస్తు పూర్వం 5వ శ‌తాబ్దంలో మ‌గ‌ధ సామ్రాజ్య రాజు అయిన బింబిసారుడి జీవిత చ‌రిత్ర‌కు ఫిక్ష‌న్ జోడించి వ‌శిష్ట్ ఈ సినిమాను తెర‌కెక్కిస్తున్నాడు. ఈ సినిమా గురించి బ‌య‌ట‌కు వ‌చ్చిన ఆ ఫ్యీజులు ఎగిరే అప్‌డేట్ ఏంటంటే బింబిసార 2 కూడా ఉంద‌ట‌.. ఆ సీక్వెల్లో యంగ్‌టైగ‌ర్ ఎన్టీఆర్ మ‌గ‌ధ సామ్రాజ్య యువ‌రాజుగా క‌నిపించబోతున్నాడ‌ట‌.

క‌ళ్యాణ్‌రామ్ బింబిసారుడిగా.. మ‌రో యువ‌రాజుగా ఎన్టీఆర్‌తో పాటు మ‌రో త‌మిళ హీరో కూడా న‌టిస్తున్నాడ‌ని తెలిసింది. ఇప్ప‌టికే సీక్వెల్ స్టోరీ రెడీ చేసిన వ‌శిష్ట్ ఆ క‌థ‌ను క‌ళ్యాణ్‌రామ్ రిక‌మెండేష‌న్‌తో ఎన్టీఆర్‌కు వినిపించ‌డం.. ఎన్టీఆర్ త‌న‌కు న‌చ్చిన యువ‌రాజు పాత్ర చేస్తాన‌ని చెప్ప‌డం జ‌రిగాయ‌ని అంటున్నారు. క‌ళ్యాణ్‌రామ్ భారీ బ‌డ్జెట్‌తో ఈ సినిమాను నిర్మించి.. పాన్ ఇండియా రేంజ్‌లో రిలీజ్ చేసే ప్ర‌య‌త్నాలు జ‌రుగుతున్నాయి.

త్రిబుల్ ఆర్‌తో ఎన్టీఆర్‌కు పాన్ ఇండియా ఇమేజ్ వ‌చ్చింది. ఇప్పుడు బింబిసార‌లో కీ రోల్ చేస్తే.. బింబిసార 2కు నేష‌న‌ల్ వైడ్‌గా క్రేజ్ వ‌స్తుంద‌ని మేక‌ర్స్ లెక్క‌లు వేస్తున్నారు. ఎన్టీఆర్ మామూలుగానే పౌరాణిక సినిమాల్లో పాత్ర‌లు అంటే విజృంభించేస్తాడు. ఇప్పుడు మ‌గ‌ధ‌రాజుగా ఏ స్టైల్లో న‌ట విశ్వ‌రూపం చూపిస్తాడో ? దీనిపై అఫీషియ‌ల్ అప్‌డేట్ ఎప్పుడు వ‌స్తుందో ? చూడాలి.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news