Moviesఎన్టీఆర్ రామ‌య్యా వ‌స్తావ‌య్యా ప్లాప్ వెన‌క ప్ర‌భాస్ ఉన్నాడా.. ఇదేం ట్విస్ట్...!

ఎన్టీఆర్ రామ‌య్యా వ‌స్తావ‌య్యా ప్లాప్ వెన‌క ప్ర‌భాస్ ఉన్నాడా.. ఇదేం ట్విస్ట్…!

టాలీవుడ్ యంగ్‌టైగ‌ర్ ఎన్టీఆర్ కెరీర్‌లో ఎన్నో హిట్లు.. ప్లాపులు ఉన్నాయి. ఇక అటు అగ్ర నిర్మాత దిల్ రాజు త‌న బ్యాన‌ర్లో ఎన్టీఆర్‌తో సినిమా చేసేందుకు చాలా రోజుల నుంచి వెయిట్‌చేస్తూ వ‌చ్చాడు. రాజు కోరిక ఎట్ట‌కేల‌కు బృందావ‌నం సినిమాతో నెర‌వేరింది. వంశీ పైడిప‌ల్లి ద‌ర్శ‌క‌త్వంలో తెర‌కెక్కిన బృందావ‌నం సినిమా మంచి విజ‌యం సాధించ‌డంతో పాటు ఎన్టీఆర్‌లో కొత్త కోణాన్ని ఆవిష్క‌రించింది. ఆ త‌ర్వాత మ‌రో మూడేళ్ల‌కే 2013లో ఎన్టీఆర్ – రాజు కాంబోలో రామ‌య్యా వ‌స్తావ‌య్యా సినిమా వ‌చ్చింది.

ప‌వ‌న్ క‌ళ్యాణ్‌తో గ‌బ్బ‌ర్‌సింగ్ లాంటి బ్లాక్‌బ‌స్ట‌ర్ హిట్ కొట్టిన హ‌రీష్ శంక‌ర్ డైరెక్ష‌న్‌లో ఈ సినిమా వ‌చ్చింది. ఈ సినిమాలో స‌మంత‌, శృతీహాస‌న్ హీరోయిన్లు. భారీ అంచ‌నాల‌తో ప్రేక్ష‌కుల ముందుకు వ‌చ్చిన ఈ సినిమా డిజ‌ప్పాయింట్ చేసింది. అయితే సినిమా అంచ‌నాలు అందుకోలేక‌పోవ‌చ్చు కాని.. నిర్మాత‌గా త‌నకు మాత్రం మంచి లాభాలే తెచ్చిపెట్టింద‌ని నిర్మాత రాజు ఓపెన్‌గా చెప్పారు.

అంటే సినిమా క‌థ‌, క‌థ‌నాలు ఎక్క‌డో ప్రేక్ష‌కుల‌కు క‌నెక్ట్ కాలేదు. అయితే సినిమాకు భారీ ఓపెనింగ్స్ రావ‌డంతో న‌ష్టాలు రాలేదు. అయితే ఈ సినిమా ఫెయిల్యూర్‌కు ఓ ఇంట్ర‌స్టింగ్ కార‌ణాన్ని నిర్మాత రాజు చెప్పారు. అస‌లు ఈ సినిమాకు ముందుగా అనుకున్న క‌థ వేర‌ట‌. సెట్స్ మీద‌కు వెళుతోంద‌నుకుంటోన్న టైంలో ప్ర‌భాస్ రెబ‌ల్ సినిమా రిలీజ్ అయ్యింద‌ట‌. అయితే క‌థ ప‌రంగా తండ్రి మీద రివేంజ్ తీర్చుకోవ‌డం అనే సిమిలారిటీస్ ఉండ‌డంతో రేపు సినిమా రిలీజ్ అయ్యాక అంద‌రూ రెబ‌ల్‌లా ఉంద‌ని అంటార‌ని.. అప్పుడే వేరే క‌థ తీసుకున్నార‌ట‌.

రెబ‌ల్ రిలీజ్ అయ్యాక రామ‌య్యా వ‌స్తావ‌య్యాకు ముందుగా అనుకున్న క‌థ ఒకేలా ఉన్న‌ట్టు అనిపించ‌డంతో అప్ప‌టిక‌ప్పుడు హ‌రీష్ శంక‌ర్ మ‌రో క‌థ రెడీ చేశాడ‌ట‌. అప్ప‌టికే లేట్ అవ్వ‌డంతో ఆ క‌థ‌పై ముందుగా అనుకున్న‌ట్టుగా క‌స‌ర‌త్తులు జ‌ర‌గ‌లేదు. అలా హ‌డావిడిగా ఆ సినిమాను సెట్స్ మీద‌కు తీసుకువెళ్లారు. అయితే ప్రేక్ష‌కుల‌కు అది ఎక్క‌డో క‌నెక్ట్ కాలేదు. అలా ఆ సినిమా అంచ‌నాల‌కు దూరంగా ఆగిపోయింది.

ఒక వేళ రెబ‌ల్ కంటే త‌మ సినిమా ముందుగా షూటింగ్ స్టార్ట్ అయ్యి ఉంటే.. క‌నీసం రెబ‌ల్ క‌థ‌లా ఉంద‌న్న కంప్లైంట్లు ఉన్నా టేకింగ్‌ను బ‌ట్టి అయినా త‌మ సినిమా ప్రేక్ష‌కుల‌కు రీచ్ అయ్యి ఉండేదేమో ? అని రాజు చెప్పారు. ఇక విచిత్రం ఏంటంటే రెబ‌ల్ కూడా భారీ బ‌డ్జెట్‌తో తెర‌కెక్కి ఫెయిల్యూర్‌గానే నిలిచింది.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news