Moviesలైంగిక వేధింపులపై సంచలన కామెంట్స్..త్రూ అవుట్‌ ఇండియాను షేక్ చేస్తున్న బ్యూటీ..!!

లైంగిక వేధింపులపై సంచలన కామెంట్స్..త్రూ అవుట్‌ ఇండియాను షేక్ చేస్తున్న బ్యూటీ..!!

యమీగౌతమ్..పేరుకి కొత్త పరిచయాలు అవసరం లేదు. అందానికి అందం నటనకి నటన..ఎక్స్ పోజింగ్ విషయంలో కూడా ఏ మాత్రం తగ్గదు..కానీ ఎందుకో తెలియదు అమ్మడుకి మంచి మంచి ఆఫర్స్ రావడం లేదు. ఫెయిర్ అండ్‌ లవ్లీ యాడ్‌తో జనాలకు దగ్గరైన యామీ గౌతమ్‌.. ఆ యాడ్‌ సూపర్ సక్సెస్ కావడంతో..ఆ పాపులారిటీతోనే సినిమాలోకి వచ్చింది. సినిమాల్లోకి వచ్చిన ఈ టాలెంటెడ్‌ హీరోయిన్‌ తన దైన స్టైల్ లో సినిమాలు చేస్తూ..మంచి పేరు తెచ్చుకుంది. కానీ ఫెయిర్ అండ్ లవ్లీ యాడ్‌తో టీవీల్లో బాగానే ఫేమస్ ఈ ముద్దుగుమ్మ. అయితే సినిమాల్లో మాత్రం కోరుకున్న విజయం రావడం లేదు.

పలు సౌందర్య ఉత్పత్తులకు బ్రాండ్‌ అంబాసిడర్‌గా వ్యవహరించిన యామీ గౌతమ్.. 2009 సంవత్సరంలో ‘ఉల్లాస ఉత్సాహ’ అనే కన్నడ సినిమాతో నటిగా ఎంట్రీ ఇచ్చింది. ఆ తర్వాత ‘ఏక్ నూర్’ అనే పంజాబీ సినిమా చేసి ‘నువ్విలా’ మూవీతో తెలుగు ప్రేక్షకులకు పరిచయమైంది. “కొరియర్ బాయ్ కళ్యాణ్”.. “గౌరవం” లాంటి సినిమాలతో తెలుగు ప్రేక్షకులను పలకరించిన ముద్దుగుమ్మ యమీగౌతమ్. తెలుగుతో పాటు హిందీలో కూడా కొన్ని సినిమాలు చేసినా కూడా కోరిన సక్సెస్ రాలేదు. అజయ్ దేవ్‌గన్, హృతిక్ రోషన్ లాంటి బదా హీరోల సరస్న నటించినా యమీకి సక్సెస్ దక్కలేకపోయింది. దాంతో హాయిగా మళ్లీ హాట్ ఫోటోషూట్‌లు చేసుకుంటూ కాలం గడిపేస్తుంది ఈ భామ.

కాగా , రీసెంట్ గా ఆమె నటించిన ‘ఎ థర్స్‌డే’ మూవీ మంచి పాజిటీవ్ తాక్ సొంతం చేసుకుంది. చిన్న వయసూలోనే అత్యాచారం చేయబడిన ఓ పాప..పోలీసులు పట్టించుకోని తీరు..మగ దిక్కులేక అల్లాడిపోతున్న అమ్మ..ఏం చేయలేని స్ధితిలో ఆ పాప పెద్ద అయిన తరువాత వాళ్ళ పై ఎలా రీవేంజ్ తీర్చుకుంది అనేది స్టొరీ లైన్. ఈ సినిమాలో యామీ నటన అద్భుతం అంటూ చాలా మంది పొఘిడేశారు. కాగా, తాజాగా ఆమె తీసుకున్న ఓ నిర్ణయం త్రూ అవుట్‌ ఇండియాను ఫిదా చేసేసింది.నిజ జీవితంలో లైంగిక వేధింపులకు.. గురైన బాధితులకు అండగా నిలిచేందుకు ముందుకొచ్చి.. మజ్లిస్​, పారి అనే రెండు స్వచ్ఛంద సంస్థలతో చేతులు కలిపింది. మహిళల భద్రత సమస్యల విషయంలో కొంత పురోగతి సాధించా..అయినప్పటికి ఇంకా చాలా చేయాలని ఉంది..చేస్తాను కూఅదా.. అన్ని వర్గాల మహిళలను రక్షించడానికి అవసరమైన వసతుల కల్పనకు మరింత సహకారం అందించాలనుకుంటున్నాను అంటూ యామీ చెప్పుకొచ్చింది.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news