Moviesమగాడు చేస్తే హీరో..అదే ఆడది చేస్తే..?

మగాడు చేస్తే హీరో..అదే ఆడది చేస్తే..?

సీనియర్ నటి ఇంద్రజ .. అప్పట్లో ఈమె పేరు ఓ సంచలనం. ఈమె నటిస్తే సినిమా హిట్టు. కుర్రకారుని తన అందాలతో పిచ్చెక్కించిన బ్యూటీ. యమలీల చిత్రంలో నీ జీను ప్యాంటు వేసి బుల్లెమ్మో.. అంటూ టైట్ జీన్స్ లో కుర్రకారును హోరెత్తించిన ఇంద్రజ అందం మర్చిపోగలమా. ఈ సినిమాతో స్టార్‌ ఇమేజ్‌ని సొంతం చేసుకున్న ఆమె వరుసగా పలుక్రేజీ ప్రాజెక్ట్ ల్లో చేసింది. ఎక్కువగా స్టార్‌ హీరోలతో చేయకపోయినా చిన్నచిత్రాలతోనైనా సక్సెస్‌ అందుకుంది. ఇప్పటికి ఈమె నటనకు అభిమానులు ఉన్నారు అనడంలో సందేహం లేదు.

తెలుగు, తమిళ్, కన్నడ అని లేకుండా అన్ని భాషల్లోనూ హిట్ హీరోయిన్ గా పేరుతెచ్చుకుంది. స్టార్ హీరోయిన్ గా ఉన్న సమయంలోనే ఒక వ్యాపారవేత్తను పెళ్ళాడి సినిమాలకు బ్రేక్ ఇచ్చింది. ఈ మధ్య కాలంలో జబర్దస్త్ కామెడీ షోలో అలరిస్తున్నారు ఇంద్రజ. సహజసిద్ధమైన నవ్వుతో పంచ్‌లు పేల్చుతూ… జడ్జీ స్థానానికి వన్నెతెస్తున్నారు. ఈ బ్యూటీ సీనియర్ నటిగా మారి హీరోయిన్ తల్లిగానూ, హీరో అత్తగానూ పాత్రలు వేస్తూ తళుక్కుమంటోంది. ఒకప్పుడు అగ్ర హీరోల పక్కన సినిమాలు చేసిన ఇంద్రజకు మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. ఇక సినిమా పరంగా చిన్న చిన్న పాత్రలతో తెలుగులో బిజీ అవుతుంది ఇంద్రజ. రాజ్‌ తరుణ్, వర్ష బొల్లమ్మ జంటగా శాంటో మోహన్‌ వీరంకి దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘స్టాండప్‌ రాహుల్‌’. నంద కుమార్‌ అబ్బినేని, భరత్‌ మాగులూరి నిర్మించిన ఈ సినిమా ఈ నెల 18న విడుదలవుతోంది.

రీసెంట్ గా ఆమె హీరో రాజ్‌ తరుణ్ కి తల్లిగా ఈ సినిమా చేసింది. రాజ్‌ తరుణ్, వర్ష బొల్లమ్మ జంటగా శాంటో మోహన్‌ వీరంకి దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘స్టాండప్‌ రాహుల్‌’. నంద కుమార్‌ అబ్బినేని, భరత్‌ మాగులూరి నిర్మించిన ఈ సినిమా ఈ నెల 18న విడుదలవుతోంది. ఈ సినిమా ప్రమోషన్స్ లో భాగంగా ఆమె ఓ ఇంటర్వ్యుల్లో మాట్లాడు పలు ఆసక్తికర కామెంట్స్ చేసారు. కుటుంబ విలువనుబ్ తెలియజేసేలా ఉంటుంది ఈ సినిమా ..ప్రస్తుత జెనరేషన్ కి చాలా అవసరమైన ..అందరు తప్పక చూడాల్సిన సినిమా ఇది అంటూ ..తనకు ఈ సినిమాలో ఆఫర్ రావడం పై ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేసింది.” పెళ్లి తరువాత నటిగా నా ప్రయాణం అయిపోయింది అనుకున్నాను.

కానీ మళ్ళీ ఇలాంటి మంచి సినిమాలో అవకాశం వచ్చినందుకు చాలా హ్యాపీగా ఉంది. ప్రస్తుత సినిమాలలో మహిళా ప్రాధాన్యత ఉన్న పాత్రలు చాలా అరుదుగా వస్తున్నాయి.. అది మారితే బావుంటుందని అనుకుంటున్నా. నా దృష్టిలో ఆడ మగా ఇద్దరు ఒక్కతేఅ. పెళ్లైన మగాడు.. పెళ్లి తరువాత కూడా హీరోగా చేస్తాడు చేస్తున్నారు.. కానీ అదే పెళ్లి అయిన ఆడదాని దగ్గరకు వచ్చేసరికి పరిస్ధితి వేరాలా ఉంటుంది. ఓ హీరోయిన్ మాత్రం పెళ్లి తరువాత తల్లిగా, అక్కగా కొనసాగుతుంది. ఒక విధంగా చెప్పాలంటే ఇది కూడా మంచిదే . ఎందుకంటే పెళ్లి తరువాత సమాజం ఆమెను ఒక తల్లిగా, భార్యగా గౌరవిస్తుంది. పెళ్లి తరువాత నా భర్త పాపను చూసుకోవడానికే టై సరిపోయింది. ఇప్పుడిప్పుడే మళ్లీ సినిమాల్లో బిజీ అవుతున్నాను. ప్రస్తుతం నాలుగు సినిమాలలో నటిస్తున్నాను.” అంటూ చెప్పుకొచ్చింది.

 

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news