Moviesఒక్క హిట్‌తో ఇండ‌స్ట్రీకే చుక్కలు చూపిస్తోన్న డీజే భామ నేహాశెట్టి..!

ఒక్క హిట్‌తో ఇండ‌స్ట్రీకే చుక్కలు చూపిస్తోన్న డీజే భామ నేహాశెట్టి..!

సిద్ధు జొన్న‌ల‌గ‌డ్డ హీరోగా తెర‌కెక్కిన డీజే టిల్లు సినిమాతో సాలీడ్ హిట్ అందుకున్న కుర్ర భామ నేహా శెట్టి ఇప్పుడు ఆకాశంలోనే విహారిస్తోంద‌ట‌. ఆమె అస్స‌లు ఏ మాత్రం త‌గ్గే ప్ర‌శ‌క్తే లేద‌ని చెపుతోంద‌ట‌. సాధార‌ణంగా హీరోయిన్లు ముందు రెండు, మూడు సినిమాల‌కు రెమ్యున‌రేష‌న్లు డిమాండ్ చేయ‌రు. నిర్మాత‌లు ఎంత ఇస్తే అంతే తీసుకుంటారు. రెండు, మూడు స‌క్సెస్‌లు వ‌స్తే మాత్రం వాళ్ల రేటు వాళ్లే అడిగేస్తారు. ఆటోమేటిక్‌గా రెమ్యున‌రేష‌న్ పెంచేస్తూ ఉంటారు.

ఇప్పుడు టాలీవుడ్‌ను ఏలేస్తోన్న పూజా హెగ్డే సైతం కెరీర్ స్టార్టింగ్‌లో వ‌రుస ప్లాపుల‌తో ఉన్న‌ప్పుడు చాలా త‌క్కువ రెమ్యున‌రేష‌న్ మాత్ర‌మే తీసుకునేది. ఇంకా చెప్పాలంటే నిర్మాత‌లు ఎంత ఇస్తే అంత మాత్ర‌మే ఆమె కిమ్మ‌న‌కుండా తీసుకునేది. అయితే ఇప్పుడు పాన్ ఇండియా హీరోయిన్ అయిపోయిన ఆమె సినిమాకు రు. 3 కోట్ల‌కు త‌గ్గ‌కుండా డిమాండ్ చేస్తోంది. ఇక ఛ‌లో సినిమాతో టాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇచ్చిన ర‌ష్మిక గీత‌గోవిందం హిట్ అయ్యాక రేటు భారీగా పెంచేసింది.

ఇక ఎలాంటి గ్లామ‌ర్ రోల్స్‌, ఎక్స్‌పోజింగ్ చేయ‌ని ఫిదా బ్యూటీ సాయిప‌ల్ల‌వి సైతం ఇప్పుడు త‌న రెమ్యున‌రేష‌న్ పెంచేసిన‌ట్టు చెపుతున్నారు. ఇటీవ‌ల ల‌వ్‌స్టోరీ, శ్యామ్‌సింగ‌రాయ్ సినిమాలు హిట్ అవ్వ‌డంతో సాయిప‌ల్ల‌వి పెద్ద సినిమాలు చేయ‌డంతో పాటు తాను అడిగిన రేటు ఇవ్వాల‌ని డిమాండ్ చేస్తోంద‌ట‌. ఇప్పుడు డీజే టిల్లు సినిమా హీరోయిన్ నేహాశెట్టి కూడా ఒక్క హిట్ వ‌చ్చిందో లేదో వెంట‌నే రేటు పెంచేసింద‌ట‌.

పూరి జ‌గ‌న్నాథ్ త‌న‌యుడు మెహ‌బూబా సినిమాతో హీరోయిన్‌గా ప‌రిచ‌యం అయ్యింది నేహాశెట్టి. తొలి సినిమాతో కావాల్సినంత‌గా అంద‌చందాలు చూపించేసింది. ఇప్పుడు డీజే టిల్లు యూత్‌ను బాగా ఆక‌ట్టుకుంటోంది. నేహా అందాల‌కు కూడా కుర్ర‌కారు ఫిదా అయిపోయారు. దీంతో ఇప్పుడు ఈ బ్యూటీ టాలీవుడ్‌లో టాక్ ఆఫ్ ద టౌన్‌గా మారిపోయింది. ఇప్పుడు మీడియం రేంజ్ హీరోల సినిమాల్లో ఆమెకు వ‌రుస‌గా అవ‌కాశాలు వ‌స్తున్నాయి.

 

దీంతో మేక‌ర్స్ ఆమె డేట్లు అడిగితే ఆమె చెప్పే రేటు చూసి భ‌య‌ప‌డిపోతున్నార‌ట‌. ఒక్క సినిమా హిట్ అయితేనే నేహాశెట్టి ఈ రేంజ్‌లో టాలీవుడ్ నిర్మాత‌ల‌ను భ‌య‌పెడుతూ ఉండ‌డం ఇప్పుడు ఇండ‌స్ట్రీ వ‌ర్గాల్లో హాట్ టాపిక్‌గా మారింది. మ‌రి నేహా కాస్త బెట్టు దిగితే ఆమెకు మ‌రిన్ని మంచి ఛాన్సులు వ‌స్తాయి.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news