Moviesచిరంజీవి - జూనియ‌ర్ ఎన్టీఆర్ మ‌ల్టీస్టార‌ర్ ఆ కార‌ణంతోనే ఆగిపోయిందా ?

చిరంజీవి – జూనియ‌ర్ ఎన్టీఆర్ మ‌ల్టీస్టార‌ర్ ఆ కార‌ణంతోనే ఆగిపోయిందా ?

టాలీవుడ్ యంగ్‌టైగ‌ర్ ఎన్టీఆర్ – మెగాప‌వ‌ర్‌స్టార్ రామ్‌చ‌ర‌ణ్ కాంబినేష‌న్లో ఎప్పుడు అయినా ఒక్క సినిమా అయినా తెర‌కెక్కుతుంద‌ని టాలీవుడ్ సినీ అభిమానులు అస్స‌లు ఎప్పుడూ ఊహించి ఉండ‌రు. అస‌లు మ‌న హీరోల ఇమేజ్ చ‌ట్రాల‌ను దృష్టిలో పెట్టుకుని ఇది జ‌రుగుతుంద‌ని కూడా ఎవ్వ‌రూ క‌ల‌లో కూడా అనుకుని ఉండ‌రు. అలాంటి అసాధ్యాన్ని సుసాధ్యం చేశాడు ద‌ర్శ‌క‌ధీరుడు రాజ‌మౌళి. టాలీవుడ్‌లోనే తిరుగులేని క్రేజీ హీరోలుగా ఉన్న ఎన్టీఆర్‌, రామ్‌చ‌ర‌న్ కాంబినేష‌న్లో త్రిబుల్ ఆర్ సినిమాను తెర‌కెక్కించాడు. బాహుబ‌లి సీరిస్ సినిమాల త‌ర్వాత రాజ‌మౌళి తెర‌కెక్కించిన ఈ సినిమా ఇప్పుడు మార్చి 25న ప్ర‌పంచ వ్యాప్తంగా 14 భాష‌ల్లో రిలీజ్‌కు రెడీ అవుతోంది.

ఇదిలా ఉంటే మెగాస్టార్ చిరంజీవి – యంగ్‌టైగ‌ర్ ఎన్టీఆర్ కాంబినేష‌న్లో మ‌ల్టీస్టార‌ర్ వ‌స్తే ఎలా ఉంటుందో ? ఊహకే అంద‌ని ఆనందం వేస్తోంది క‌దూ..! అయితే చాలా ఏళ్ల క్రితం వీరి కాంబినేష‌న్లో ఓ మ‌ల్టీస్టార‌ర్‌కు ప్లాన్ జ‌రిగింది. అయితే ఇది ప‌ట్టాలు ఎక్క‌లేదు. ఈ కాంబినేష‌న్ గురించి ఎన్టీఆర్ ద‌గ్గ‌ర చ‌ర్చ‌లు కూడా జ‌రిగాయ‌ట‌. ఈ విష‌యాన్ని ఆవుల గిరి ఓ ఇంట‌ర్వ్యూలో స్వ‌యంగా వెల్ల‌డించారు. అలాగే కొంద‌రు చేసిన ప‌నుల వ‌ల్లే త‌న‌కు, ఎన్టీఆర్‌కు మ‌ధ్య గ్యాప్ పెరిగింద‌ని కూడా చెప్పారు.

కొడాలి నాని ప‌రిచ‌యం చేసిన వ్య‌క్తి వ‌ల్లే త‌న‌కు, ఎన్టీఆర్‌కు గొడ‌వ‌లు పెరిగిన‌ట్టు గిరి వెల్ల‌డించారు. రానా ప్ర‌తాప్ క‌థ‌తో ఎన్టీఆర్ – చిరు కాంబినేష‌న్లో మ‌ల్టీస్టార‌ర్ సినిమా తీయాల‌ని అనుకున్నార‌ట‌. ఆ టైంలో కొంద‌రు గాసిప్ రాయుళ్ల‌తో పాటు ఇండ‌స్ట్రీలోని కొంద‌రు ఎన్టీఆర్ – చిరంజీవి మ‌ధ్య లేనిపోని మాట‌లు చెపుతూ గ్యాప్ పెంచే ప్ర‌య‌త్నం చేశార‌ని గిరి చెప్పారు. ఆ విష‌యం త‌ర్వాత ఎన్టీఆర్‌కు అర్థ‌మై వారిని ప‌క్క‌న పెట్టేశార‌ట‌. ఏదేమైనా ఇప్పుడు ఆవుల గిరి చేసిన కామెంట్లు సోష‌ల్ మీడియాలో వైర‌ల్ అవుతున్నాయి.

ఇక ఎన్టీఆర్ – చిరు కాంబినేష‌న్ క‌న్నా ఇప్పుడు సినీ అభిమానులు, నంద‌మూరి అభిమానులు అంద‌రూ కూడా నంద‌మూరి ఫ్యామిలీ మ‌నం సినిమా కోరుకుంటున్నారు. నంద‌మూరి హీరోలు బాల‌య్య‌, ఎన్టీఆర్‌, క‌ళ్యాణ్‌రామ్ కాంబినేష‌న్లో సినిమా ఎప్పుడు వ‌స్తుందా ? అని వెయిట్ చేస్తున్నారు. క‌నీసం బాల‌య్య – ఎన్టీఆర్ క‌లిసి ఓ మల్టీస్టార‌ర్ చేసినా బాగుంటుంద‌న్న‌దే వీరి ఆశ‌. మ‌రి ఇది ఎప్ప‌ట‌కి తీరుతుందో ? చూడాలి.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news