Moviesనాకు అలా చేయమని చెప్పింది ఆయనే..అడ్డంగా ఇరిక్కించేశాడుగా..!!

నాకు అలా చేయమని చెప్పింది ఆయనే..అడ్డంగా ఇరిక్కించేశాడుగా..!!

సంపత్ రాజ్.. ఈ పేరుకు ప్రత్యేక పరిచయం అవసరం లేదు. ఎన్నో సినిమాల్లో హీరోలకు తండ్రిగా..హీరోయిన్ లకు తండిగా..పలు కీలక రోల్ లో నటించి మెప్పించిన ఈయన ప్రస్తుతం చేతినిండా సినిమాలతో బిజీ బిజీగా దఘిపేస్తున్నారు. హీరోలకు ఏ మాత్రం తగ్గని ఫ్యాన్ ఫాలోయింగ్ ఉన్న ఈయన విలన్ పాత్రలో ఫేమస్ అయ్యాడు. ఆ తరువాత మెల్లగా నాన్నగా.. అన్నగా ఎన్నో పాత్రలు పోషించి ప్రేక్షకులకు దగ్గరయ్యాడు. తెలుగు తమిళ కన్నడ వంటి చిత్రాలలో తనదైన స్టైల్ లో నటీంచి మంచి మార్కెట్ క్రియేట్ చేసుకున్నాడు.

ముఖ్యంగా ఈయనకు తెలుగులో బాగా గుర్తింపు తెచ్చిన సినిమా ప్రభాస్ హీరోగా నటించిన మిర్చి నే అని చెప్పాలి. ప్రభాస్ ను ఢీ కొట్టే పాత్రలో నటించలేదు జీవించేశాడు. ఆ బాడీ లాంగ్వేజ్..స్టైల్ ఆయన తెర పై చూస్తుంటే..ఆ పాత్రను ఆయన తప్పిస్తే మిగతా వారు చేసిన ఆ క్యారెక్టర్ కు సెట్ అయ్యి ఉండేవారు కారు అనేలా మెప్పించాడు. ఆ తరువాత శ్రీమంతుడు, రన రాజా రన్, కృష్ణ గాడి వీర ప్రేమా గాధ వంటి చిత్రాలు సంపత్ రాజ్‏కు మంచి గుర్తింపునిచ్చాయి.

ఇక రీసెంట్ గా అలీతో సరదాగా కార్యక్రమంలో ఆయన సందడి చేశారు. ఈ సందర్భంగా ఆలీ అడిగిన ప్రశ్నలకు సమాధానలు ఇస్తూనే..తన వ్యక్తిగత విషయాలకు సంబంధించిన ఇంట్రెస్టింగ్ మ్యాటర్ అభిమానులతో పంచుకున్నారు. తను సినిమాలోకి రావడం తన తల్లికి ఇష్టం లేదని చెప్పిన ఆయన., తన తండ్రి సహాయంతోనే ఇంతటి స్దాయికి వచ్చాను అని చెప్పుకొచ్చారు.ముఖ్యంగా త‌న‌ త‌ల్లికి సినిమాలంటే ఇష్టం లేక‌పోవ‌డంతో తండ్రే ఇంటి నుంచి పారిపోమ‌ని స‌ల‌హా ఇచ్చార‌ని తెలిపాడు. ఇక నటి శరణ్య తన మొదటి భార్య అంటూ వచ్చిన వార్తల పై కూడా క్లారిటీ ఇచ్చారు. మేము మంచి ఫ్రేండ్స్ అని..సినిమాలో కలిసి నటించామని దానికే ఇలా మొదటి భార్య అంటూ వార్తలు రాసుకొచ్చారని చెప్పుకొచ్చారు.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news