Moviesఆ ఒక్క వీడియోతో అందరి నోర్లు మూయించిన సాయిపల్లవి..స్టార్ హీరోలకు కూడా..?

ఆ ఒక్క వీడియోతో అందరి నోర్లు మూయించిన సాయిపల్లవి..స్టార్ హీరోలకు కూడా..?

సాయి పల్లవి..ఎక్స్ పోజింగ్ కు దూరంగా..నటనకు ఎక్కువ స్కోప్ ఉన్న పాత్రలను మాత్రమే సెలక్ట్ చేసుకుంటూ..అందరిని ఫిదా చేస్తుంది ఈ మలయాళీ బ్యూటీ. ఈ అమ్మాయి డ్యాన్స్ చేస్తే అచ్చం నెమలి నాట్యం చేస్తున్నాట్లే అనిపిస్తుంది.ఆ నవ్వుతో..సిప్లిసిటీతో పెద్ద హీరోలని సైతం మెస్మరైజ్ చేసిన సాయి పల్లవి సినిమాల ఎంపికల విషయంలో ఎంత జాగ్రత్తగా ఉంటుందీ ప్రత్యేకించి చెప్పనవసరం లేదు. టాలీవుడ్ లో ఫిదా సినిమాతో అందరినీ ఫిదా చేసిన సాయి పల్లవి…తెలుగు, తమిళ,మళియాళ భాషల్లో బిజీ హీరోయిన్ గా మారిపోయింది. అయితే ఎంత పెద్ద హీరోనైనా సరే..ఆమెకు కధ నచ్చకపోతే రిజెక్ట్ చేసి పక్కన పడేస్తుంది సాయిపల్లవి.

రీసెంట్ గానే నేచ్రల్ స్టార్ నాని సరసన శ్యాం సింగరాయ్ అనే సినిమాలో నటించి మనల్ను మెప్పించింది. ప్రతి సినిమాలో లాగనే ఈ సినిమాలో కూడా తన పాత్రకు 100% న్యాయం చేసింది సాయిపల్లవి. ముఖ్యంగా ఈ సినిమాలో దేవదాసి పాత్రలో సాయి పల్లవి నటీంచిన తీరు స్టార్ హీరోలను సైతం ఆకర్షించింది. శ్యాం సింగ రాయ్ సినిమా ఇంతటి గన విజయం సాధించడానికి సాయిపల్లవి కీ రోల్ ప్లే చేసిందనే చెప్పాలి.

అయితే సాయి పల్లవి పై నెగిటివ్ కామెంట్స్ చేసేవాళ్లకి..తనను నెట్టింట ట్రోల్ చేసేవారిని నోర్లు మూయించేలా ఓ వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ గా మారింది. శ్యామ్ సింగ రాయ్ సినిమాలో సాయి పల్లవి లాస్ట్ లో ఓ ముసలావిడ పాత్ర చేసిన సంగతి తెలిసిందే. ఈ పాత్రలో ఆమె యాక్టింగ్ చూసి బడా బడా హీరోలు సైతం తనని పొగిడేశారు. ఇక ఈ పాత్ర కోసం సాయిప‌ల్ల‌వి మేకోవ‌ర్ అయిన తీరు అంద‌రినీ ఆశ్చ‌ర్యానికి గురి చేసింది.

తాజాగా ఈ మేక‌ప్‌కు సంబంధించిన వీడియో నెట్టింట వైర‌ల్ అవుతోంది. ముఖాన్ని పూర్తిగా కప్పేసి గంట‌ల త‌ర‌బ‌డి మేక‌ప్ ఆర్టిస్టులు వేసిన మేక‌ప్‌, అందుకు సాయి ప‌ల్ల‌వి స‌హ‌క‌రించిన తీరు అంద‌రినీ ఆశ్చ‌ర్యానికి గురి చేస్తోంది. నిజం చెప్పాలంటే ఇలాంటి సాహసాలు పెద్ద పెద్ద స్టార్ హీరోలు మాత్రమే చేయడానికి ట్రై చేస్తారు. కానీ ఇంత చిన్న ఏజ్ లోనే సాయి పల్లవి ఇలాంటి సాహసానికి పూనుకోవడం ..అంద‌రినీ ఆశ్చ‌ర్యానికి గురి చేస్తోంది. ఈ వీడియో చూసిన నెటిజ‌న్లు న‌ట‌న‌పై సాయిప‌ల్ల‌వికి ఉన్న డెడికేష‌న్‌కు ఈ వీడియోనే నిద‌ర్శ‌నం అంటూ ప్ర‌శంస‌లు కురిపిస్తున్నారు. మ‌రి ఈ వీడియోపై మీరూ ఓ లుక్కేయండి..

 

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news