Moviesఈ ఫోటోలో అషు రెడ్డి వెనకున్న ఆ స్టార్​ హీరో ఎవరో...

ఈ ఫోటోలో అషు రెడ్డి వెనకున్న ఆ స్టార్​ హీరో ఎవరో తెలుసా..!!

ఇప్పుడు ప్ర‌పంచం సోషల్ మీడియా మ‌యం అయిపోయింది. సోషల్ మీడియా వచ్చాక సెలబ్రిటీలు కావటానికి పెద్ద పెద్ద హీరోలు స్టార్స్ మాత్రమే కావలసిన అవసరం లేదు. ఎవరైనా సోషల్ మీడియాలో సెల‌బ్రిటీలు అయిపోతూ స్టార్ లను మించిపోతూ కింగ్‌లు అవుతున్నారు.

 

అషు రెడ్డి..అబ్బో అమ్మడు అందాలకి పడిపోణి అబ్బాయి అంటూ ఉంటాడా అనేలా ఉంటుంది. దాని తగ్గట్లే అమ్మడు ఏ డ్రెస్ వేసిన అద్దిరిపోయే విధంగా ఉంటుంది. లంగా ఓణీ వేస్తే కుందనపు బొమ్మ లా..మొడ్రెన్ డ్రెసుల్లో హాట్ బుట్ట బొమ్మలా కనిపిస్తూ కుర్రాలకి నిద్ర లేని రాత్రులను ఇస్తుంది. ఒకప్పుడు డబ్ స్మాష్ వీడియోలతో సోషల్ మీడియాలో రచ్చ రచ్చ చేసిన ఈ అమ్మడు..ఇప్పుడు పలు షోలల్లో యూట్యూబ్ ఛానెల్ ద్వార కవర్ సాంగ్స్ చేసి..హీరోయిన్స్ స్దాయిలో ఫ్యాన్ ఫాలోయింగ్ సంపాదించుకుంది ఈ చిన్నది.

ఒక్కప్పుడు జూనియర్ సమంత గా గుర్తింపు పొంది వెండితెరపై అవకాశాలు అందుకున్న సెలబ్రిటీ అషు రెడ్డి. ఆ తరువాత బిగ్ బాస్ లో అడుగు పెట్టి మరింత క్రేజ్ సంపాదించుకుంది ఈ ముద్దుగుమ్మ. ఆమె బిగ్ బాస్ హౌస్ లోకి ఎంట్రీ ఇవ్వడంతో ఆమె దశ తిరిగింది అనే చెప్పాలి. ఇక దానికి తగ్గత్లే బిగ్ బాస్ విన్నర్ రాహుల్ సిప్లిగంజ్ తో అమ్మడు లవ్ లో ఉంది అంటూ వార్తలు రావడం..ఆ తరువాత డైరెక్టర్ వర్మ తో హాట్ ఇంటర్వ్యుల్లో పాల్గొనడం ..ఇలా వరుసగా నెట్టింట దుమ్మురేపుతుంది.

అయితే , సోషల్​ మీడియాలో యమ యాక్టీవ్ గా ఉండే ఈ బ్యూటీ ఫోటోలతో పాటు దానికి తగ్గట్లే ట్యాగ్ లైన్లు కూడా ఇస్తూ రచ్చ రచ్చ చేస్తుంటుంది. ఇటీవల వెకేషన్​ నిమిత్తం దుబాయ్​ వెళ్లిన అషు ‘మేడమ్ టూసాడ్స్’​ మ్యూజియంను సందర్శించింది. ఇక ఈ మ్యూజియంలో సెలబ్రిటీల మైనపు బొమ్మలు ఉంటాయన్న సంగతి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. అక్కడ పలు ఫొటోలు దిగిన ఈ భామ తాను అభిమానించే బాలీవుడ్​ హీరో రణ్​బీర్​ కపూర్​ మైనపు బొమ్మతో కూడా ఫోజులిచ్చి..ఆ ఫోటోలను నెట్టింట పోస్ట్ చేసింది. ఈ ఫొటోలను తన ఇన్​స్టా గ్రామ్​లో షేర్​ చేస్తూ “నా వెనకల ఉన్న స్టార్ హీరో ఎవరో చెప్పుకొండి “అంటూ పోస్ట్ చేసింది. ఇక దీని పై నెటిజన్స్ ఫన్నీ ఫన్నీ కామెంట్స్ పెడుతున్నారు.

 

 

View this post on Instagram

 

A post shared by Ashu Reddy❤️ (@ashu_uuu)

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news